అంబాసిడర్
Manufacturer | హిందుస్తాన్ మోటర్స్ |
---|---|
Production | 1958– |
Body style(s) | 4-door సెడాన్ |
Layout | FR layout |
హిందుస్తాన్ అంబాసిడర్ భారతదేశంకు చెందిన హిందుస్తాన్ మోటార్స్ చే రూపొందించబడ్డ కారు. 1958 నుండి ఉత్పత్తి చేయబడుతున్న ఈ కారుకి కొన్ని మర్పులు చేర్పులు జరిగాయి. UK లోని ఆక్స్ ఫర్డ్లో కౌలీకి చెందిన మోరిస్ మోటార్ కంపెనీ (1956 నుండి 1959 వరకు ఉత్పత్తి చేసిన) మోరిస్ ఆక్స్ ఫర్డ్ III మోడల్ ను ఆధారం చేసుకొని ఈ కారు రూపొందించబడింది.
"The king of Indian roads" (భారతదేశపు రహదారుల రాజు) గా ముద్దుగా వ్యవహరింపబడే అంబాసిడర్, బ్రిటీషు మూలాలు ఉన్ననూ కచ్చితంగా భారతదేశపు కారుగానే చూడబడుతుంది. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కటావద్దనున్న ఉత్తర్ పారాలో ఈ కారులు ఉత్పత్తి చేయబడుతున్నాయి. సోనియా గాంధీ వంటి రాజకీయ ప్రముఖులు ఇప్పటికీ అంబాసిడర్ ను వాడటానికే ఇష్టపడతారు.
మూలాలు
[మార్చు]మారిస్ ఆక్స్ ఫర్డ్ II సిరీస్ మూలంగా తాము నిర్మించిన హిందుస్తాన్ ల్యాండ్ మాస్టర్ స్థానే క్రొత్త మాడల్ ను తీసుకు రావాలన్న బిర్లాల ఆలోచనలు మారిస్ ఆక్స్ ఫర్డ్ III వైపు మళ్ళాయి. అప్పట్లో ఇది సాంకేతికంగా చాలా ముందుండటం, కారు లోపల చాలా విశాలంగా ఉండటం మూలాన దీని పై దృష్టి మరలింది.
రారాజుగా వెలిగొందిన అంబాసిడర్
[మార్చు]భారత ఆటోమొబైల్ రంగంలోకి అనేక అత్యాధునిక కార్లు వచ్చినప్పటికీ కార్ల మార్కెట్‌లో మాత్రం ఇప్పటికీ రారాజుగా వెలుగొందుతున్న కారు అంబాసిడరే. మారుతీ, హ్యుండాయ్, టయోటా, హోండా, నిస్సాన్... ఇలా ఎన్ని కార్ల కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చినా దేశీయ కారు అంబాసిడర్‌తో ఏమాత్రం పోటీ పడలేక పోయాయి.
1970, 1980 దశకాల్లో భారతీయ కార్ల రంగానికి ఏకఛత్రాధిపత్యం వహించిన అంబాసిడర్ కారు ఇప్పటికీ ప్రపంచంలో ఉత్తమ ట్యాక్సీగా 'టాప్ గేర్' ఓటింగ్‌లో నిలిచింది. బీబీసీ ఛానల్‌లో వచ్చే టాప్ గేర్ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిచర్డ్ హ్యామండ్ ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించారు.
ఇందులో అన్ని ఆధునిక కార్ల నుంచి ఎదురైన పోటీని భారతీయ అంబాసిడర్ విజేతగా నిలిచింది. మోరిన్ ఆక్స్‌ఫర్డ్‌గా బ్రిటన్‌లో ప్రారంభమై హిందూస్థాన్ అంబాసిడర్‌గా పేరు మార్చుకున్న ఈ కారు, 80వ దశకం సగంలో మారుతీ కారు రంగ ప్రవేశం వరకు రారాజుగా వెలుగొందింది.[1]
కాలానుగుణంగా వచ్చిన మోడళ్ళు
[మార్చు]- అంబాసిడర్
- మార్క్ II
- మార్క్ III
- మార్క్ IV
- అంబాసిడర్ నోవా
- అంబాసిడర్ 1800 ISZ
- అంబాసిడర్ క్లాసిక్
- అంబాసిడర్ గ్రాండ్
- అంబాసిడర్ అవిగో