అక్కరలు
Appearance
అక్కరలు జాతి పద్యములు. ఇవి ఐదు విధములు.
మహాక్కరలో పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కరకు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలో మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలో చంద్ర గణము రావలెన్ననియము ఉన్నది. అక్కరలలో సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములో లేని అక్కర మధ్యాక్కర.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |