అక్బర్ హైదరీ
అక్బర్ హైదరీ | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జాతీయత | భారతీయుడు | ||
జీవిత భాగస్వామి | అమీనా తయ్యబ్జీ | ||
సంతానం | మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ | ||
వృత్తి | రాజకీయనాయకుడు |
సర్ మహమ్మద్ అక్బర్ నజర్ అలీ హైదరీ, సద్ర్ ఉల్-మహమ్,[1] ప్రివీ కౌన్సిల్ (నవంబరు 8, 1869 – నవంబరు 1941)[2] భారతీయ రాజకీయ నాయకుడు. ఈయన 1937, మార్చి 18 నుండి 1941 సెప్టెంబరు వరకు హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]హైదరీ, 1869, నవంబరు 8న ఒక సులేమానీ బోరా ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి సేఠ్ నజర్ అలీ హైదరీ, బొంబాయికి చెందిన వ్యాపారవేత్త.[4]
హైదరాబాదు రాజ్యానికి వచ్చే ముందు హైదరీ ఇండియన్ ఆడిట్, అకౌంటెన్సీ సర్వీసులో పనిచేశాడు. హైదరాబాదు రాజ్యంలో తొలుత ఆర్ధికశాఖమంత్రిగా చేరి, ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అజంతా గుహల పునరుద్ధరనకు ప్రధాన కారకుడు.[5]
ఈయన 1930 నవంబరు నుండి 1931 జనవరి వరకు జరిగిన తొలి రౌండు టేబులు సమావేశంలో హైదరాబాదు రాజ్యానికి ప్రాతినిధ్యం వహించాడు.1936 జనవరిలో హైదరీ యునైటెడ్ కింగ్డం ప్రివీ కౌన్సిలుకు సభ్యుడగా నియమించబడ్డాడు.[6] 1941లో వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలుకు సభ్యుడిగా నియమితుడయ్యాడు. అస్సాం రాష్ట్రానికి తొలి భారతీయ గవర్నరైన మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ ఈయన కుమారుడు.[7]
గౌరవ సత్కారాలు
[మార్చు]1928 జన్మదిన సత్కారాల్లో బ్రిటీషు ప్రభుత్వం ఈయనను నైట్‌గా ప్రకటించింది.[1][5] అధికారికంగా ఈయన్ను లార్డ్ ఇర్విన్ 1929 డిసెంబరు 17న హైదరాబాదులో జరిగిన ఉత్సవంలో నైట్‌ను చేశాడు.[8]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Edinburgh Gazette, 8 June 1928[permanent dead link]
- ↑ "Mohammed Akbar Nazar Ali Hydari (1869 - c.1941)". Geni.com. 2011-09-30. Archived from the original on 2016-01-26. Retrieved 2013-07-05.
- ↑ Hyderabad, Princely States of India, WorldStatesmen.org
- ↑ "Golconde" (PDF). motherandsriaurobindo.in. Archived from the original (PDF) on 6 మే 2017. Retrieved 6 May 2017.
- ↑ 5.0 5.1 Gunther, John. Inside Asia - 1942 War Edition. READ BOOKS, 2007, pp. 471-472
- ↑ Edinburgh Gazette, 7 January 1936[permanent dead link]
- ↑ Sulaymani Bohra: South Asia Archived 2016-03-03 at the Wayback Machine, accessed July 5, 2010
- ↑ Edinburgh Gazette, 11 February 1930[permanent dead link]