Jump to content

అక్షత మూర్తి

వికీపీడియా నుండి
అక్షత మూర్తి
జననంఅక్షత నారాయణ మూర్తి
(1980-04-25) 1980 ఏప్రిల్ 25 (వయసు 44)
హుబ్లీ, కర్ణాటక భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తివ్యాపారవేత్త
భార్య / భర్తరిషి సునాక్| 2009}}
పిల్లలు2
బంధువులురోహాన్ మూర్తి (తమ్ముడు)
తండ్రిఎన్.ఆర్. నారాయణ మూర్తి
తల్లిసుధా మూర్తి

అక్షత మూర్తి (జననం 1980 ఏప్రిల్ 25) ఒక భారతీయ వ్యాపారవేత్త, ఫ్యాషన్ డిజైనర్. అక్షత మూర్తి యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు రిషి సునక్‌ను వివాహం చేసుకుంది. సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం.. బ్రిటన్‌లోని అత్యంత సంపన్న వ్యక్తులలో అక్షత మూర్తి 275వ స్థానంలో ఉంది.[1] [2]

అక్షత మూర్తి భారతీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల కుమార్తె. అక్షత మూర్తి అనేక ఇతర బ్రిటిష్ వ్యాపారాలలో వాటాలతో పాటు ఇన్ఫోసిస్‌లో 0.93 శాతం వాటాను కలిగి ఉంది. [3] [4] [5]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

అక్షత మూర్తి 1980 ఏప్రిల్ 25న భారతదేశంలోని హుబ్లీలో జన్మించారు,[4] [6] తండ్రి ఎన్.ఆర్. నారాయణ మూర్తి, తల్లి సుధా మూర్తి. [7] [6] అక్షత మూర్తి తల్లి సుధా మూర్తి టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీలో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్.[8] అక్షత మూర్తికి సోదరుడు రోహన్ మూర్తి ఉన్నాడు.[9] వారు బెంగళూరు శివారులోని జయనగర్‌లో పెరిగారు. [10]

1990వ దశకంలో, [11] అక్షత మూర్తి బెంగళూరులోని బాల్డ్‌విన్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంది. 1998లో కాలిఫోర్నియాలోని క్లేర్‌మాంట్ మెక్‌కెన్నా కళాశాలలో విద్యను అభ్యసించింది. [12]

వ్యాపార రంగం

[మార్చు]

2007లో, అక్షత మూర్తి డచ్ క్లీన్‌టెక్ సంస్థ టెండ్రిస్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా చేరింది, అక్కడ అక్షత మూర్తి రెండు సంవత్సరాలు పనిచేసింది. [6]

2013లో,అక్షత మూర్తి వెంచర్ క్యాపిటల్ ఫండ్ కాటమరాన్ వెంచర్స్‌కు డైరెక్టర్‌గా పనిచేసింది. [6] అక్షత మూర్తి తన భర్త రిషి సునక్‌తో కలిసి తన తండ్రి, ఎన్ ఆర్ నారాయణ మూర్తికి చెందిన భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ ను స్థాపించారు. [13] రిషి సునాక్ 2015లో రిచ్‌మండ్‌కు కన్జర్వేటివ్ ఎంపీగా ఎన్నిక కావడానికి కొంతకాలం ముందు తన వ్యాపార సంస్థలను అక్షత మూర్తికి అప్పగించాడు. [14] 2015 నుండి, అక్షత మూర్తి తన తండ్రి సాంకేతిక సంస్థ ఇన్ఫోసిస్‌లో [4] 0.93% వాటాను కలిగి ఉంది, 2023లో సుమారు 481 కోట్ల సంపదను కలిగి ఉంది, [3]. [15]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అక్షత మూర్తి భారతీయ పౌరురాలు . అక్షత మూర్తి ఇంగ్లీష్, హిందీ, కన్నడ ఫ్రెంచ్ భాషలలో అనర్గళంగా మాట్లాడుతుంది . [16] 2009లో, అక్షతమూర్తి రిషి సునక్‌ను వివాహం చేసుకున్నారు. [6] [17] అక్షత మూర్తి దంపతులకు ఇద్దరు ఇద్దరు కుమార్తెలు - అనౌష్క కృష్ణ. [18] [9]

మూలాలు

[మార్చు]
  1. "The Sunday Times Rich List 2023". The Sunday Times. 4 October 2023.
  2. John, Tara (25 October 2022). "Akshata Murty: Rishi Sunak's wife is a software heiress who's richer than royalty". CNN. Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
  3. 3.0 3.1 "Rishi Sunak and Akshata Murty net worth — Sunday Times Rich List 2023". The Sunday Times. 4 October 2023.
  4. 4.0 4.1 4.2 Neate, Rupert (7 April 2022). "Akshata Murty: Rishi Sunak's wife and richer than the Queen". The Guardian. Archived from the original on 7 April 2022. Retrieved 12 July 2022.
  5. Mendel, Jack (5 May 2022). "Rishi Sunak's father-in-law's company Infosys is still active in Russia". City A.M. Archived from the original on 25 October 2022. Retrieved 24 October 2022.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 Bedi, Rahul; Bird, Steve (15 February 2020). "Why Rishi Sunak's wife may hold the clue to his budget". The Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Archived from the original on 6 March 2020. Retrieved 7 April 2022.
  7. "Rishi Sunak faces questions over wife Akshata Murty's non-dom tax status" (in బ్రిటిష్ ఇంగ్లీష్). BBC News. 7 April 2022. Archived from the original on 17 December 2022. Retrieved 7 April 2022.
  8. Blackall, Molly (7 April 2022). "The super-rich businesswoman and wife of Rishi Sunak under fire for using non-domicile status". iNews (in ఇంగ్లీష్). Archived from the original on 24 October 2022. Retrieved 12 August 2022.
  9. 9.0 9.1 "The "IT" Crowd At Rohan Murty's Wedding; Infy Squad Turns Up In Suits, Kurtas – A Lot Like Love". The Economic Times. 4 December 2019. Archived from the original on 29 October 2022. Retrieved 7 April 2022.
  10. Murthy, N. R. Narayana (21 June 2020). "Hope for a growing, liveable Bengaluru". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
  11. Lal, Nita (12 April 2022). "Akshata Murty's UK tax scandal divides Indians; peers remember her as "humble and simple"" (in ఇంగ్లీష్). Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
  12. Blackall, Molly (7 April 2022). "The super-rich businesswoman and wife of Rishi Sunak under fire for using non-domicile status". iNews (in ఇంగ్లీష్). Archived from the original on 24 October 2022. Retrieved 7 December 2022.
  13. Hurley, James (2 October 2021). "Rishi Sunak's wife Akshata Murty lends £4.3m to start-up Catamaran Ventures". The Times. ISSN 0140-0460. Archived from the original on 11 November 2022. Retrieved 7 April 2022.
  14. "Who is Rishi Sunak's wife Akshata Murty – and why are her family so wealthy?". Sky News (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2022. Retrieved 12 August 2022.
  15. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Guardian wealth అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  16. "Is Britain Ready For Akshata Murty?". Rediff.com. 19 July 2022. Retrieved 5 December 2023.
  17. Neate, Rupert (3 April 2022). "Sunaks' £5m Santa Monica flat offers sun, sea ... and a pet spa". Archived from the original on 3 April 2022. Retrieved 7 April 2022.
  18. "Chancellor Rishi Sunak defends wife Akshata Murty in row over non-dom status" (in బ్రిటిష్ ఇంగ్లీష్). BBC News. 8 April 2022. Archived from the original on 27 December 2022. Retrieved 8 April 2022.