సుధా మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుధా మూర్తి
Sudha Murthy.jpg
జననం
సుధా

(1950-08-19) 1950 ఆగస్టు 19 (వయసు 72)
పౌరసత్వంభారతదేశం
విద్యాసంస్థబి.వి.బి సాంకేతిక కళాశాల
ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
వృత్తిఅధ్యక్షురాలు , ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్
జీవిత భాగస్వామిఎన్.ఆర్.నారాయణ మూర్తి
బంధువులురిషి సునాక్ (అల్లుడు)

పద్మశ్రీ సుధా మూర్తి (కన్నడ: ಸುಧಾ ಮೂರ್ತಿ), ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ , గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.[1][2]. ఈవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించింది. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరించింది. కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడినది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంచించింది.[3][4][5]. తన వృత్తి జీవితంతో బాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేస్తుంది. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే (డాలర్ కోడలు) ఆంగ్లములో డాలర్ బహుగా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది.[6]

బాల్యము , విద్యాభ్యాసము[మార్చు]

1950 ఆగస్టు 19 వ సంవత్సరము శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం హావేరీ జిల్లా షిగ్గాన్ లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఎస్. ఆర్. కులకర్ణి వైద్యుడు. బాల్యమంతా తల్లి తండ్రులు, తాతయ్య, నానమ్మ ల మధ్య గడిచింది.[7]. ఈ అనుభవాలతోనే పెద్దయ్యాక How I Taught my Grandmother to Read & Other Stories.[8] అనే పుస్తకాన్ని రచించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా హెచ్. ఆర్. కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ , ఐ.ఐ.టి కాన్పూర్ లలో కంప్యూటర్ సైన్స్ విభాగాలను ][9][10] , జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం లోని నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాల లను[7] ప్రారంభించడానికి భూరి విరాళాలను అందజేసింది.

సుధా ఎలక్టికల్ ఇంజనీరింగ్ పట్టాను బి.వి.బి. సాంకేతిక కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రధమురాలిగా నిలిచి కర్ణాటక ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పతకం అందుకొని పూర్తిచేసింది. తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి తరగతిలో ప్రధమురాలిగా నిలిచి స్వర్ణపతకం అందుకొని పూర్తిచేసింది.[11]

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ ఐన టెల్కో లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ గా ఉద్యోగం సాధించింది. అప్పటికి ఈ సంస్థలో కేవలము పురుషులకే స్థానం కల్పించేవారు. దీనిని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్టుకార్డు రాసింది. దీనిని స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యోకంగ ముఖాముఖి (Interview) నిర్వహించి, అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించాడు. ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నపుడే ఆవిడకు ఎన్.ఆర్.నారాయణ మూర్తి తో పరిచయమై తర్వాతి కాలంలో వారిద్దరు వివాహం చేసుకోవడానికి దారితీసింది.[12]

ఇన్ఫోసిస్ ఫౌండేషన్[మార్చు]

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్ మరియి పెట్టుబడిదారీ సంశ్థ ఐన కెటారామన్ వెంచర్స్ సంస్థలకు తెర వెనుక ముఖ్స్య పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు.[13]

పురస్కారాలు[మార్చు]

 1. 2004 - సామాజిక సేవకు గానూశ్రీ రాజా లక్ష్మీ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్, చెన్నై నుండి అందుకున్నారు.[14]
 2. 2006 - భారత ప్రభుత్వము నుండి అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారము , సామాజిక సేవ, దాతృత్వం , విద్యా రంగాలలో ఆమె సేవలకు గౌరవ డాక్టరేటు.[15]
 3. మనదేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందవేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డే తో కలిసి గౌరవ న్యాయ డాక్టరేటు ( honorary LL.D (Doctor of Laws)) .[16]
 4. సాహితీ సేవ , ఆమె రచనలకు ఆర్. కె. నారాయణన్ పురస్కారము.
 5. 2023 -పద్మ భూషణ్ అవార్డు[17]

రచనా వ్యాసాంగము[మార్చు]

ఈవిడ మంచి రచయిత్రి కూడా. కాల్పనిక సాహిత్యంపై పలు రచనలు కూడా చేశారు. పెంగ్విన్ ముద్రణా సంస్థద్వారా దాతృత్వం, ఆతిధ్యం , స్వీయ పరిపూర్ణత (self-realization ) లపై కాల్పనిక పాత్రల ద్వారా ఆమె రచించిన పలు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి.[18] ఈమె రచించిన How I Taught My Grandmother to Read & Other Stories అనే పుస్తకము దాదాపు పదహైదు భాషలలో తర్జుమా చేయబడింది.[18] . ఆమె ఈ మధ్యనే రచించిన గ్రంథము The Day I Stopped Drinking Milk.[18] . ఈవిడ ఇతర రచనలు Wise and Otherwise, Old Man and his God and Gently Falls the Bakula.[18]

మూలాలు[మార్చు]

 1. Ratan Tata, Rahul Dravid on Gates Foundation board Archived 2013-05-22 at the Wayback Machine. tata.com (2003-07-15). Retrieved on 2011-12-08.
 2. Gates Foundation's AIDS initiative launched Archived 2003-12-31 at the Wayback Machine. The Hindu (2003-12-06). Retrieved on 2011-12-08.
 3. Sudha Murthy: Humility personified. Business-standard.com (2011-01-23). Retrieved on 2011-12-08.
 4. I'm enjoying my acting stint: Sudha Murthy – Times Of India. Timesofindia.indiatimes.com. Retrieved on 2011-12-08.
 5. http://www.murtylibrary.com/
 6. The Sunday Tribune – Spectrum – Article. Tribuneindia.com (2001-09-30). Retrieved on 2011-12-08.
 7. 7.0 7.1 Karnataka / Bangalore News : Director thanks Dharam Singh Archived 2007-12-12 at the Wayback Machine. The Hindu (2005-08-29). Retrieved on 2011-12-08.
 8. About Mrs. Narayan Murthy Archived 2013-05-19 at the Wayback Machine. Nipun.charityfocus.org (1978-02-10). Retrieved on 2011-12-08.
 9. New CSE Building, IIT Kanpur Archived 2010-02-02 at the Wayback Machine. Iitk.ac.in. Retrieved on 2011-12-08.
 10. Infosys chief Narayan Murthy rejects govt offer – Times Of India Archived 2013-12-12 at the Wayback Machine. Articles.timesofindia.indiatimes.com (2002-01-04). Retrieved on 2011-12-08.
 11. Sudha Murthy | The Woman Behind | Narayan Murthy Wife Archived 2012-07-15 at Archive.today. Living.oneindia.in (2011-08-17). Retrieved on 2011-12-08.
 12. JRD's words inspired me in philanthropy: Sudha Murthy Archived 2013-05-22 at the Wayback Machine. tata.com (2002-10-23). Retrieved on 2011-12-08.
 13. Sudha Murthy sells shares to fund Catamaran Archived 2014-02-01 at the Wayback Machine. Siliconindia.com. Retrieved on 2011-12-08.
 14. National : Raja-Lakshmi Award for Sudha Murty Archived 2014-01-18 at the Wayback Machine. The Hindu (2004-08-15). Retrieved on 2011-12-08.
 15. Tamil Nadu / Chennai News : Honorary doctorates for seven eminent personalities Archived 2007-12-03 at the Wayback Machine. The Hindu (2006-09-04). Retrieved on 2011-12-08.
 16. Santosh Hegde, Sudha Murthy to be conferred honorary doctorate. Deccanherald.com. Retrieved on 2011-12-08.
 17. Andhra Jyothy (5 April 2023). "కన్నుల పండువగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం". Archived from the original on 5 April 2023. Retrieved 5 April 2023.
 18. 18.0 18.1 18.2 18.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-10. Retrieved 2013-03-07.