అక్షరశిల్పులు (పుస్తకం)
అక్షరశిల్పులు | |
![]() | |
"అక్షర శిల్పులు" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | సయ్యద్ నశీర్ అహమ్మద్ |
---|---|
అంకితం: | డాక్టర్ ఉమర్ అలీషా (1885 - 1945) |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయం |
ప్రచురణ: | ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్,వినుకొండ. |
విడుదల: | 2010 |
పేజీలు: | 180 |
ముఖపత్రాలంకరణ: | వజ్రగిరి జెస్టిస్, వినుకొండ |
ముద్రణ: | శ్రీ జయదీప్తి గ్రాఫిక్స్,వినుకొండ |
ప్రతులకు: | ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్, శివప్రసాద్ వీధి, కొత్తపేట, వినుకొండ-522 647, గుంటూరు జిల్లా. |
సోల్ డిస్ట్రిబ్యూటర్స్: | తెలుగు బుక్ హౌస్, 3-3-862, కాచిగూడ ఎక్స్ రోడ్స్ ,హైదరాబాద్-500 027 |
అక్షరశిల్పులు ముస్లిం కవులు-రచయితల సంక్షిప్త పరిచయాలను తెలియజేసిన పుస్తకం. దీనిని రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించారు.[1]
పుస్తక పరిచయం[మార్చు]
ఈ పుస్తకంలో మొత్తం 333 కవులు, రచయితలు, అనువాదకుల వివరాలను పొందుపర్చారు. ఈ ప్రముఖుల విశేషాలను పొందుపర్చడానికి మార్చి 2008 లో ఒక ప్రకటన చేసారు. అందులో భాగంగా 242 మంది రచయితలు వారి వివరాలను పుస్తక రచయితకు నేరుగా పంపారు. వీటితో పాటు అనేక పుస్తకాలలో గల వారి వివరాలను కూడా చేర్చి "కవులు రచయితల జాబితా"ను తయారుచేసారు. ఆ కవుల సాధారణ నామాలను పరిగణనలోకి తీసుకొని వారి జాబితాను ఆంగ్ల అక్షరక్రమంలో పొందుపర్చారు. ఈ కవుల జీవిత విశేషాల కోసం వివిధ గ్రంథాలను మూలాలుగా తీసుకొని ఆయా మూలాల జాబితాను పుస్తక చివరి పుటలలో పొందుపర్చారు.
ముందు మాట[మార్చు]
తెలుగు సాహితీ రంగంలో తెలుగు మాతృ భాష కాని ముస్లిం రచయితల సేవలు అమూల్యం. వీరు అనేక అపురూప గ్రంథాలను అసంఖ్యాకంగా తెలుగు పాఠకులకు అందించారు. తెలుగు సాహిత్య రంగానికి వన్నెతెచ్చిన అవధాన ప్రక్రియను సైతం అలవోకగా నిర్వహిస్తూ, అద్భుతంగా పద్యరచన గావిస్తూ చక్కని విద్వత్తును, గొప్పధారణా శక్తిని ప్రదర్శించి పండితులు, ప్రజల చేత ప్రశంసలు అందుకున్నారు. అటువంటి వారిలో ఒకరు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆధునిక భారతీయ భాషల విభాగం అధ్యక్షుడైన ఆచార్య షేక్ మస్తాన్. ఆయన ఈ గ్రంథానికి ముందు మాట రాశాడు.
“ | తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలలో ముస్లిం కవులు, రచయితల యొక్క పరిచయాలు అత్యల్పంగా కన్పిస్తాయి, అక్కడక్కడా ఒకటీ రెండూ కన్పించినా ఆయా కవులు రచయితల గురించి, వారి రచనల గురించిన సమాచారం నామమాత్రమే. భాషాశాస్త్ర నిపుణులు, ఉత్తమ సాహిత్య విమర్శకులు ఆచార్య తూమాటి దోణప్ప (నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు) ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యానికి ముస్లింలు అందచేసిన సేవల మీద పరిశోధన జరిపే అవకాశం నాకు లభించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని 'తెలుగు సాహిత్యం- ముస్లింల సేవ' సిద్ధాంత వ్యాసాన్ని నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించి 'పి.హెచ్డి' పట్టాను పొందాను. ఆ పరిశోధన సమయంలో 1984 వరకు ముస్లిం కవులు, రచయితలు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు నా పరిశోధన పరిధిలోకి వచ్చాయి. నా యీ సిద్ధాంత వ్యాసాన్ని 1991లో ప్రచురించాను. అని చెపుతూ...... చివరగా...... ఈ గ్రంథానికి ముందుమాట రాయడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. అని కూడ అన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి ప్రశంచలు పొందిన ఈ గ్రంధము యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్ప నవసరము లేదు. | ” |
— ఆచార్య షేక్ మస్తాన్,M.A (Tel).M.A.(Lit).Ph.D
|
“ | ఇదొక క్లిష్టమైన మహత్తర కార్యం. ఈ కార్యసాఫల్యానికి మిక్కిలి వ్యయప్రయాసలకు లోనై ఉంటారన్నది నగ్నసత్యం. ఇటువంటి గ్రంథ రచనలకు సంబంధించిన విషయ సేకరణకు ఎంతో ఓపిక, సహనం అవసరం. పలు ఒడు దుడుకులను, కష్టనష్టాలను సైతం భరించక తప్పదు. ఇలాంటి బృహత్తర కార్యభారాన్ని చేపట్టి, పట్టువదలని విక్రమార్కుడిలా అహర్నిశలు కృషి చేసి నసీర్ అహమద్ 333 మంది ముస్లిం కవులు, రచయితల వివరాలతో 'అక్షరశిల్పులు' వెలువరించడం ముదావహం. ఈ గ్రంథం ద్వారా ముస్లిం కవులు, రచయితలు వారి రచనలు మరుగున పడి మటుమాయం కాకుండ నశీర్ నిక్షిప్తం చేశారు. భావి తరాలకు, సాహిత్య చరిత్ర పరిశోధకులకు అక్షరశిల్పులు ఎంతగానో ఉపకరిస్తుందనటం ఏమాత్రం అతిశయోక్తికాదు. | ” |
— ఆచార్య షేక్ మస్తాన్,M.A (Tel).M.A.(Lit).Ph.D |
- పొత్తూరి వెంకటేశ్వర రావు ఈ పుస్తకం పై తన అభిప్రాయాన్ని ఈ క్రింది విధంగా తెలియజేసారు.
“ | భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిములు నిర్వహించిన మహత్తర పాత్రను వివరిస్తూ శ్రీ నశీర్ పత్రికల్లో వ్యాసాలు వ్రాసి, ఆక్రమంలో పలు ప్రామాణిక, పరిశోధనాత్మక గ్రంథాలను వరుసగా వెలువరించారు. ఈయన గ్రంథాలు దేశభక్తిని ప్రబోధించడమే కాక మాతృదేశం కోసం ముస్లిములు ఎంతటి మహత్తర త్యాగాలు చేశారో, స్వాతంత్య్రోద్యమంలో మిగతా వారందరితో భుజం భుజం కలిపి ఎలా మమేకమై పోరాడరో తెలియజేసే చరిత్ర గ్రంథాలవి. ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల సమాచారం సేకరించడానికి పడిన శ్రమ కంటె మరింతగా కష్టపడి శ్రీ నశీర్ అహమ్మద్ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న 'అక్షరశిల్పులు' గ్రంథాన్నినిర్మించారు. తెలుగు సాహిత్య చరిత్ర రచయితలకు, పరిశోధకులకు బాగా ఉపయోగపడగల మంచి రచన ఇది. ఈ గ్రంథలోని కవులు, రచయితలు, అనువాదకుల పరిచయాలు సంక్షిప్తంగా ఉన్నా ప్రామాణికంగా ఉన్నాయి. | ” |
— పొత్తూరి వెంకటేశ్వర రావు |
సయ్యద్ నసీర్ అహ్మద్ కృషి[మార్చు]
గ్రంథ రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ గ్రంథానికి కావలసిన విషయాన్ని సమీకరించడానికి పడిన వ్యయ ప్రయాసలు అనేకం. వాటిని తాను కొంతవరకు ఈ పుస్తకంలో చెప్పాడు. అంతకన్నా ఆయన ఎక్కువ శ్రమే చేసి ఉంటాడు అంతటి శ్రమ పడక పోతే ఈ గ్రంథము ఈ రూపములో 333 మంది రచయితలు/కవుల జీవిత సంగ్రహము పాఠకులకు అందేది కాదు. ముఖ్యముగా తెలుగు మాతృభాష కాని ముస్లింలు సాహిత్య పరంగా తెలుగు భాషకు చేసిన సేవ అపూర్వము. కారణమేదైనా ముస్లిములు తెలుగు భాషకు చేసిన సాహితీసేవ తెలుగు చదువరులకు తెలియకుండా మరుగునే ఉం డి పోయింది. అటువంటి ముస్లిం ప్రముఖులలో, తెలుగులో అష్టావదానము చేసిన అవధానులు, కవులు, గాయకులు, నాటక కర్తలు, కథకులు, మొదలగు వారెందరో ఉన్నారని తెలిసి ఆశ్చర్య పోతాము. ఈ గ్రంథమే గనుక రాక పోయి ఉంటే అటు వంటి వారి పరిచయము శాశ్వతముగా మరుగున ఉండి పోయేది. అలా మరుగున పడకుండా వారి వివరాలను తెలుగు చదువరులకు తెలియ జేసిన రచయిత నశీర్ అహమద్ ఎంతో అభినందనీయుడు.
పుస్తకంలో గల కవుల,రచయితల జాబితా[మార్చు]
- అబ్బాదుల్లా
- అబ్బాస్ ముహమ్మద్
- అబ్దుల్ ఆజాద్ ఖాన్ పఠాన్
- అబ్దుల్ అజీజ్ ముహమ్మద్
- అబ్దుల్ బాసిత్ షేక్
- అబ్దుల్ గఫూర్ ముహమ్మద్ మౌల్వీ
- అబ్దుల్ హకీం జానీ షేక్
- అబ్దుల్ హక్ షేక్
- అబ్దుల్ జలీల్ షేక్
- అబ్దుల్ ఖాదార్ షేక్
- అబ్దుల్ ఖాదార్ వేంపల్లి
- అబ్దుల్ ఖలీల్ షేక్
- అబ్దుల్ లతీఫ్ షేక్
- అబ్దుల్ నూర్ బాషా షేక్ డక్టర్
- అబ్దుల్ రఫీ షేక్
- అబ్దుల్ రహమాన్ సయ్యద్
- అబ్దుల్ రహిమాన్ సయ్యద్
- అబ్దుల్ రజాఖ్
- అబ్దుల్ రషీద్ మహమ్మద్
- అబ్దుల్ సమద్ షేక్
- అబ్దుల్ సత్తార్
- అబ్దుల్ వాహెద్
- అబ్దుల్లా ముహమ్మద్
- అబుల్ ఇర్పాùన్
- అఫ్జల్ మహమ్మద్ అహమ్మద్
- అఫ్రోజ్ అహమ్మద్ షేక్
- అఫ్సర్
- అహమ్మద్ అలీ ఖాదారి సాహెబ్
- అహమ్మద్ బాషా షేక్
- అహమ్మద్ బాషా సయ్యద్
- అహమ్మద్ మహమ్మద్
- అక్బర్ బాబు షేక్
- అక్బర్ ఎస్. ఎం
- అలీ ముహమ్మద్
- అలీ షేక్
- అలీ వలీ హమీద్ షేక్
- అలీ సయ్యద్
- అల్లా బక్ష్ షేక్
- అల్లా బక్షి బేగ్ షేక్
- అమీన్ సాహెబ్ సయ్యద్
- అమిరి మువ్వలున్
- అనిస్ ముఖ్తదిర్ మహమ్మద్
- అన్వర్ పాష మహ్మద్
- అన్వర్ పాష మహ్మద్: నిజామాబాద్
- ఆరిఫ్ బాష షేక్
- ఆసిఫుద్దీన్ మహమ్మద్
- అస్లాం ఫరీఫ్ షేక్
- ఆజం మహబూబ్ షేక్
- ఆజం మహమ్మద్ సయ్యద్
- ఆజీజుర్రహ్మాన్ ముహమ్మద్
- ఆజీజ్ వజీర్ సయ్యద్
- అజీద్ అబ్దుల్ షేక్
- అజ్మతుల్లా
- బాబ్జీ షేక్
- బాబూజీ షేక్
- బడే సాహెబ్ షేక్
- బడే సాహెబ్ షేక్
- బహదాూర్
- బాషా ఖాదార్ షేక్
- బజులుల్లా సాహెబ్
- బాషా హుసేన్ సయ్యద్
- బాషా జాన్ ఎస్
- బాషా మహబూబ్ షేక్
- బాషా మహబూబ్ గుత్తి
- బాషా మహబూబ్ షేక్
- బాషా ఎస్ ఎం
- బాషా షేక్
- బాషా ఎస్ ఎం
- బషిరానంద్
- బషీరుద్దీన్ ముహమ్మద్
- బిందే అలీ సయ్యద్
- బుడన్ సాహెబ్ షేక్
- చాంద్ బాషా పి
- దాదా హయాత్
- డనీ యస్
- దారియా హుస్సేన్ షేక్
- దస్తగిరి అచ్చుకట్ల చిన్న
- దావూద్ అలీ సయ్యద్
- దావూద్ ఇనగంటి
- దావూద్ సాహెబ్ షేక్
- దేవిప్రియ
- దిలావర్
- దౌలా మహమ్మద్ షేక్
- దౌలత్ బేగం
- ఫరీద్ సాహెబ్ షేక్ ఇఠలాపురం
- ఫరీద్ షేక్
- ఫాతిమున్నీసా షేక్
- ఫజులుల్లా ఖాన్
- ఫక్రుద్దీన్
- ఫక్రుల్లా సాహెబ్
- గఫార్ ముహమ్మద్ అబ్దుల్
- గఫార్ పులివీడు షేక్
- గఫార్ సయ్యద్
- గఫూర్ మహమ్మద్ అబ్దుల్ షేక్
- గఫూర్ బేగ∑ ముహమ్మద్
- గఫూర్ యస్
- గయాజ్ షేక్
- ఘన్ షైదా షేక్ (గని)
- గౌస్ ఖాన్ పి
- గౌస్ ఖాన్ పియండి
- గౌస్మొహిద్దీన్ మహమ్మద్
- గౌస్ మొహిద్దీన్ ఎస్
- గులాం గౌస్ షేక్ (శాతవాహన)
- గులాం యాసిన్
- హబీబుర్రెహమాన్
- హమీద్ ఎం.ఎ
- హమీదాుల్లా షరీఫ్
- హనీఫ్ ముహమ్మద్ (అలీ)
- హనీఫ్ ఎండి
- హసన్ జీలాని సయ్యద్
- హసన్ ముహమ్మద్
- హసన్ చిన్నషేక్
- హసన్ వలి షేక్
- హుసేన్ మహ్మద్ ఎండి షేక్ డా:
- హుస్సేన్ సాహెబ్ పి
- హుసేన్ సయ్యద్
- ఇబ్రహీం అక్కంపేట
- ఇమాం షేక్
- ఇనాయతుల్లా ఎస్ఎండి
- ఇక్బాల్ అహమ్మద్
- ఇక్బాల్ చంద్ డక్టర్
- ఇక్బాల్ ఎంజి
- ఇక్బాల్ ఎస్ ఎం డక్టర్
- ఇస్లాం షేక్
- ఇస్మాయిల్
- ఇస్మాయిల్ మహమ్మద్
- ఇస్మాయిల్ ఉమ్రి షేక్
- జబ్బార్ అబ్దుల్ గుట్టూరు
- జాఫర్ బాబు షేక్
- జాఫర్ వలీ ఖాన్ డక్టర్
- జఫ్రుల్లా మహమ్మద్
- జహంగీర్ మహమ్మద్
- జహీర్ అహమ్మద్ సయ్యద్
- జైనుల్ ఆబెదీన్ ముహమ్మద్
- జలాలుద్దీన్ యూసుఫ్ మహమ్మద్
- జలీల్ అబ్దుల్ ముహమ్మద్
- జమాల్ వలీ ఎస్
- జానీ బాషా సయ్యద్
- జాశ్మిన్ అహమ్మద్ సయ్యద్
- జవేరియా
- జవాద్ హుస్సేన్
- జిలానీ అబ్దుల్ ఖాదార్ షేక్
- జీలాని ముహమ్మద్
- జోహరా బాను
- జానీ అమీర్ షేక్
- కాలేషా షేక్
- కమాల్ సాహెబ్ షేక్
- కరీం ఖాన్ పఠాన్
- కరీముల్లా ఖాన్ పఠాన్
- కరీముల్లా షేక్
- ఖదీర్ బాబు మహమ్మద్
- ఖాదార్ ఖాన్ మహమ్మద్
- ఖాదార్ మస్తాన్ అలీషా షేక్
- ఖాదార్ మొహియుద్దీన్ ఎండి.అబ్దుల్
- ఖాదార్ షరీఫ్ షేక్
- ఖాదార్ వలి షేక్
- ఖాద్రి సయ్యద్ మొహిద్దీన్
- ఖాజా
- ఖాజా బి. ఎండి.
- ఖాజా హుస్సేన్ సయ్యద్
- ఖాజా ఎండి.
- ఖాజా మైనద్దీన్ మహమ్మద్
- ఖాజావలి షేక్
- ఖాలిదా పర్వీన్
- ఖాశిం ఖాన్ ముహమ్మద్
- ఖాశిం సాహెబ్ షేక్
- ఖాశిం సాహెబ్ బద్దేలి డక్టర్
- ఖాశిం సాహెబ్ డి.
- ఖాశిం సాహెబ్ షేక్
- ఖాశిం షేక్
- ఖాశిం యూసుఫ్
- ఖతిజా హయాత్ బేగం
- ఖుర్షీద్ సయ్యద్
- లాల్ షేక్
- లతీఫ్ సాహెబ్ షేక్
- మహబూబ్ సాహెబ్ షేక్
- మహబూబ్ జాన్ షేక్
- మహబూబ్ మియా
- మహమూద్ పాషా
- మహబూబ్ సాహెబ్ షేక్
- మహబూబ్ షేక్
- మహబూబ్ యస్. యం.
- మహబూబ్ టంగుటూరి
- మహమూద్ పీర్ల షేక్
- మహమూద్ షేక్
- మహజబీన్
- మక్సూద్ అహమ్మద్ సయ్యద్
- మలిక్ సుల్తాన్ మొహిద్దీన్ సయ్యద్
- మస్తాన్ షేక్ డక్టర్
- మస్తాన్ వలి షేక్
- మస్తాన్ వలి షేక్
- మహమ్మద్ ఇలియాస్
- మహబూబ్ అలీ షేక్
- మహబూబ్ సయ్యద్
- మహబూబ్ అలీ ఖాన్ షేక్
- మహబూబ్ బాషా షేక్
- మహబూబ్ గులాం
- మహబూబ్ ఖాన్ పి.
- మీరా జాన్ షేక్
- మిష్కన్ సాహెబ్ షేక్
- మహమ్మద్ అలీ మహమ్మద్
- ముహమ్మద్ ఆరిజ్
- ముహమ్మద్ ఉమిరి అబూ అబ్దుల్లా
- మహమ్మద్ ఆజం యస్
- మహమ్మద్ గౌస్
- మహమ్మద్ హుస్సేన్ షేక్
- ముహమ్మద్ ఖాశిం ఖాన్
- ముహమ్మద్ రుస్తుంజీ షేక్
- మహమ్మద్ యార్
- మొహిద్దీన్ బాచ్చా షేక్
- మొహిద్దీన్ హుసైనీ సయ్యద్ షామ్
- మొహిద్దీన్ పిరాన్ ఏలూరు
- మొహిద్దీన్ సయ్యద్ కే.
- మøలా షేక్ మున్షీ
- మహమూద్ అలీ ఖాన్ కె.
- మహమ్మద్ ఖాన్
- ముజీర్ సయ్యద్
- ముంతాజ్ అలీ ముహమ్మద్
- ముంతాజ్ బేగం
- మునీర్ మహమ్మద్
- మున్షీ మీర్ సుజాయత్ ఖాన్
- మున్వరున్నీసా బేగం
- ముష్టాఖ్ అహమ్మద్ మహమ్మద్
- ముస్తఫా మహమ్మద్ షేక్ డక్టర్
- ముస్తఖీమ్ ముహమ్మద్
- ఎన్నెస్ ఖలందార్
- నబీ రసూల్ షేక్ కంబదాూరి
- నబీ సాహెబ్ షేక్
- నబీ షేక్
- ఎం.డి.నఫీజుద్దీన్ (ఎం.డి.సౌజన్య)
- నశీర్ అహమ్మద్ సయ్యద్
- నసీరా బేగం
- నవాజ్ అలీ ముహమ్మద్
- నాజర్ సాహెబ్ షేక్
- నజీర్ అహమ్మద్ సి.యం.
- నజీర్ బాషా షేక్
- నజీరుద్దీన్ ఎండి.
- నిసార్ అహమ్మద్ సయ్యద్
- నిసార్ మహమ్మద్
- నూర్జహాన్ షేక్
- నూరుల్లా ఖాద్రి సయ్యద్
- పాపా సాహెబ్ తక్కెళ్ళపల్లి
- పర్వీన్ ముస్తఫా
- పిరాన్ నిజాయి ి.హెచ్.
- ఖుతుబుద్దీన్ సయ్యద్ డక్టర్
- రఫి ఎండి. డక్టర్
- రఫి మహమ్మద్ షేక్
- రఫి షేక్
- రఫి సయ్యద్
- రఫి మహమ్మద్ టింగరి షేక్
- రహమతుల్లా బేపారి షేక్
- రహమతుల్లా షేక్
- రహమతుల్లా షేక్
- రహంతుల్లా షాలీ
- రహమతుల్లా నూర్బాషా
- రహిమాన్ ఎస్.
- రహిమాన్ ఎస్.ఎ.
- రాజ్ మహమ్మద్ డక్టర్
- రజా హుస్సేన్ అబ్దుల్
- రజాఖ్ అబ్దుల్ ఎండి.
- రమిజా బాను షేక్
- రషీద్ బాషా
- రషీదా డి.
- రసూల్ ఖాన్ పఠాన్
- రసూల్ ముహమ్మద్ షేక్
- రసూల్ షేక్
- రవూఫ్ అబ్దుల్ షేక్ డక్టర్
- రియాజ్ మహమ్మద్
- రియాజుద్దీన్ అహమ్మద్ షేక్
- రుక్మునుద్దీన్ కె. డక్టర్
- సాబిర్ హుసేన్ సయ్యద్
- సాదిఖ్ ఎం.
- సాగర్ జయ్యాది డక్టర్
- సైదా సాహెబ్ షేక్
- సైఫ్ అలీ గొరే సయ్యద్
- సాజిదా సికిందార్
- సలాం అబ్దుల్ షేక్
- సలాం అబ్దుల్ షేక్
- సలీం ఎం.ఏ (దాళిత్ సలీం)
- సలీం సయ్యద్
- సమద్ ఎస్. ఎ.
- సమ్దాని హుసేన్ షేక్
- సమీవుల్లా ఖాన్ పఠాన్
- సర్దార్ బాషా షేక్
- సర్వర్ ముహమ్మద్(అబుల్ ఫ్ధజాన్)
- సత్యాగ్ని హుస్సేన్
- సత్తార్ షేక్
- షఫీ అహమ్మద్ ముహమ్మద్
- షహనాజ్ బేగం
- షహనాజ్ బేగం పఠాన్
- షహనాజ్ బేగం షేక్
- షహనాజ్ ఫాతిమా
- షాజహానా
- షమీమ్ షేక్
- షమీవుల్లా షేక్ డక్టర్
- షంషీర్ అహమ్మద్ షేక్
- షంషుద్దీన్ ముహమ్మద్
- షంషుద్దీన్ షేక్
- ఫరీఫా షేక్
- షరీఫ్ మొహమ్మద్ షేక్
- షరీఫ్ సాలార్ ఎం.
- షాజిక్ మౌల్వి
- షిరాజ్ ఖాన్ ఎంఏకె.
- సిద్దాయ్య కవి ఎస్
- సికిందార్
- సికిందార్ వి.
- సిలార్ సాహెబ్ షేక్
- సిలార్ వై ఎస్.
- సిరాజుద్దీన్ మహమ్మద్
- సుబహన్ అబ్దుస్ కెయం.
- సుభాని మహబూబ్ షేక్
- ఎం. కె. సుగంబాబు
- సుహైల్ అహమ్మద్ ఆదిల్
- సుల్తాన్ పాషా
- తహ్సీన్ అలి మహమ్మద్ డక్టర్
- తాజుద్దీన్ అహ్మద్ మహమ్మద్
- ఉమర్ అలీషా
- ఉమర్ అలీషా డక్టర్
- ఉమర్ అలీషా మమౌల్వీ
- ఉస్మాన్ ఖాన్ మహమ్మద్
- ఉస్మాన్ సయ్యద్
- వలి సాహబ్ షేక్ డాక్టర్
- వలి షేక్
- వలి మస్తాన్ షేక్ కురిచేడు
- వలి ఎస్ఎం.
- వజీర్ రహమాన్
- వాహెద్ అబ్దుల్
- యూకూబ్ షేక్ డాక్టర్
- యూసుఫ్ అలీ అస్కరి
- యూసుఫ్ బాబ షేక్ (స్కైబాబ)
- యూసుఫ్ ఘోరి
- జమ్రుద్ బాషా షేక్
- జరీనా బేగం డాక్టర్