అక్షా పార్ధసాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షా పార్ధసాని
జననంనవంబర్ 8, 1991
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం

అక్షా పార్ధసాని భారతీయ సినిమా నటి. ఆమె యువత, రైడ్, కందిరీగ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబైలో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంది. తెలుగు, మళయాల, తమిళ సినిమాలలో నటించిన అక్షా తొలిసారిగా 2007లో మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో నటించింది.

అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి. 5వ తరగతి చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేయడం ప్రారంభించి, సుమారు 75 ప్రకటనలలో నటించింది. మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో అక్షను చూసిన యువత సినిమా దర్శకుడు తన సినిమాలో తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. 10వ తరగతి సమయంలోనే గోల్ సినిమా పూర్తయింది. బ్యాంగిల్స్ అనే మలయాళ చిత్రంలో ప్రత్యేక పాటలో కనిపించింది.

రెండు సంవత్సరాల విరామం తరువాత బెంగాల్ టైగర్ సినిమాలో అతిథి పాత్రలో నటించింది.

సినీసమహారం[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2004 ముసఫిర్ యంగ్ సం హందీ
2007 గోల్ నీతు మళయాలం
2008 యువత విశాలాక్షి తెలుగు
2009 రైడ్ పూజా తెలుగు
2010 అది నువ్వే సమీర తెలుగు
2011 కందిరీగ సంధ్య తెలుగు
2013 శత్రువు అనుషా తెలుగు
రెయ్ రెయ్ లక్ష్మీ తెలుగు
బ్యాంగిల్స్ మళయాలం
2014 సలీం\ డా. సలీమ్‌ (తెలుగు) నిషా తమిళం డా. సలీం (తెలుగు)
రాంలీల హందీ అతిథి పాత్ర
2015 మెంటల్ తెలుగు
బెంగాల్ టైగర్ తెలుగు అతిథి పాత్ర
డిక్టేటర్[1] తెలుగు
2017 రాధ రుక్మిణి (రుక్కు) తెలుగు

మూలాలు[మార్చు]

  1. సినీఫ్యాక్టరీ, సినిమా వార్తలు. "నందమూరి బాలకృష్ణ సరసన అక్ష!". www.cinefactory.net. Archived from the original on 19 జనవరి 2016. Retrieved 20 September 2016.