యువత (సినిమా)
Appearance
యువత | |
---|---|
దర్శకత్వం | పరశురామ్ |
స్క్రీన్ ప్లే | దంతులూరి చైతన్య |
నిర్మాత | హరి తుమ్మా, ఉమ ప్రకాష్ |
తారాగణం | నిఖిల్ సిద్ధార్థ్, రణధీర్ గట్ల, అక్షా పార్ధసాని, సాయాజీ షిండే |
ఛాయాగ్రహణం | జశ్వంత్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | నవంబరు 7, 2008 |
సినిమా నిడివి | 2 గంటల 10 నిమిషాలు |
భాష | తెలుగు |
బడ్జెట్ | 30 కోట్లు |
యువత 2008 లో పరశురాం దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] నిఖిల్, అక్ష ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[2]
కథ
[మార్చు]కేశవరం గ్రామానికి చెందిన వీరబాబు పనిలేకుండా ఆవారాగా తిరుగుతుంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు కోల్పోవడంతో మామయ్య, అత్త దగ్గర పెరుగుతాడు. బాబాయి అతని క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రశ్నించడంతో అలిగి హైదరాబాదులో ఉన్న స్నేహితుడు అజయ్ దగ్గర ఉండటానికి వెళ్ళిపోతాడు.
నటవర్గం
[మార్చు]- వీరబాబు/బాబు గా నిఖిల్ సిద్ధార్థ్
- బేబి గా అక్ష
- సుబ్బు గా సుభాష్
- అజయ్ గా రణధీర్ గట్ల
- నారిపెద్ది శివన్నారాయణ
- నానన్న గా సాయాజీ షిండే
- కిరణ్ గా నరసింహ
- మాధవి గా సోనియా
- కరుణ
- జైలర్ గా జయప్రకాష్ రెడ్డి
- ఎం. ఎస్. నారాయణ
- జైలు పోలీస్ గా శ్రీనివాస రెడ్డి
- సోనూ సేఠ్ గా జీవా
- మెల్కోటే
- రవికాంత్
- లడ్డు గా నర్సింగ్ యాదవ్
- ఏ. సి. పి కృష్ణ మనోహర్ గా పృథ్వీ
- జైలు ఖైదీ గా ధన్రాజ్
- రాజా రవీంద్ర
- అతిథి పాత్రలో కృష్ణుడు
- అతిథి పాత్రలో సిద్ధార్థ్
సాంకేతికవర్గం
[మార్చు]పాటల జాబితా
[మార్చు]చిత్రం లోని అన్ని పాటలు కృష్ణ చైతన్య రచన చేశారు.
యువత యువత , గానం.రంజిత్, రాహూల్ నంబియార్, నవీన్
ఎవరున్నారని నీకైనా , గానం.హేమచంద్ర , హరిణి
ఈలేసి నువ్వు , గానం.నవీన్
కోటికొకటీల అమ్మాయీ , గానం.రంజిత్, రీటా
మావూరేమో చిన్న , గానం.మురళీ , మాలతి .
మూలాలు
[మార్చు]- ↑ "యువత సినిమా సమీక్ష". indiaglitz.com. indiaglitz. Retrieved 24 September 2017.
- ↑ "Yuvatha - Review". Filmbeat. Archived from the original on 14 జూలై 2019. Retrieved 31 May 2020.