అగస్త్య సంహిత
అగస్త్య సంహిత (అర్థం: " అగస్త్యుని సంకలనం ") అనేది ప్రాచీన ఋషి అగస్త్య మహర్షి రచించిన సంస్కృత గ్రంథం. అందులో అనేక పరిశోధనాంశాలను చేర్చాడు.[1] భారతదేశంలో, అంతర్జాతీయంగా గ్రంథాలయాలలో పంపిణీ చేయబడుతున్న వివిధ రచనల జాబితా, మనుగడలో ఉన్న రాతప్రతుల కోసం, వి. రాఘవన్, న్యూ కాటలాగస్ కాటలాగోరం (1968--), v.1, pp. 20–22 చూడండి.
ఈ శీర్షిక క్రింద ఉన్న రచనలలో ఒకటి పాంచరాత్ర కథనాల రచనా సామాగ్రికి చెందినది (క్రింద బాహ్య లింక్ చూడండి).
అందులోని అంశాలు
[మార్చు]అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలు ఇప్పుడు లభిస్తున్నాయి. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది. ఆ వర్ణనలో[3]
“సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్I
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిఃII
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతఃI
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్II”
దీని భావం - ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలక పెట్టాలి. తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి. పైన పాదరసము, యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి. అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది.
మరో శ్లోకం చూడండి
“అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషుI
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతఃII
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకేI
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్II”
దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు, ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
- తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
- సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
- విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
- శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
- హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.
- అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.
3000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery)
శ్లో|| సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం చాదఏత్ సిఖిగ్రీవేన అర్ద్రాభి కాశ్తపమ్సుభిహ్|
దస్తలోస్తో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత సంయోగాత్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం||
సంస్కృతం:
संस्थाप्य मृण्मये पात्रे ताम्रपत्रं सुसंस्कृतम्।
छादयेच्छिखिग्रीवेन चार्दाभि: काष्ठापांसुभि:॥
दस्तालोष्टो निधात्वय: पारदाच्छादितस्तत:।
संयोगाज्जायते तेजो मित्रावरुणसंज्ञितम्॥
అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (కాపర్ సల్ఫేట్) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (జింకు) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని (విద్యుత్తు) వుద్భావిమ్పచేయవచ్చు .[4]
మూలాలు
[మార్చు]- ↑ Agastya Maitravaruni. Agastya Sanhita with Hindi.
- ↑ Agastya Muni. Agastya Samhita.
- ↑ "Rishi Agastya Inventor of Portable Electricity, Battery and Cells". HariBhakt | History, Facts, Awareness of Hinduism (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-12-05. Archived from the original on 2020-04-15. Retrieved 2020-04-18.
- ↑ మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత
లింక్ చేసిన పేజీలు
[మార్చు]బాహ్య లింకులు
[మార్చు]- బెంగాలీ లిపిలో ఇంటర్నెట్ ఆర్కైవ్ నుండి అగస్త్య సంహిత ముద్రిత ఎడిషన్ యొక్క PDF వెర్షన్.
- భారతదేశంలోని జమ్మూలోని రఘునాథ ఆలయ గ్రంథాలయం నుండి " అగస్త్యసాహిత " అనే మాన్యుస్క్రిప్ట్ పిడిఎఫ్ ఇప్పుడు స్కాన్ చేయబడింది. ఇంటర్నెట్ ఆర్కైవ్ వద్ద ఉంది. ఈ పేరు యొక్క అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇది పర్వత-శివా సంభాషణలో సుతక, అగస్త్యుల మధ్య సంభాషణ, దీనిని పంచరత్ర వచనంగా వర్ణించారు. వి. రాఘవన్, న్యూ కాటలాగస్ కాటలాగోరం (1968--), వి .1, పేజీలు 20–21 చూడండి.
- అగస్త్య సాహితి అనే పదాలు ఉపయోగించిన ప్రదేశాలు (vedabase.net)
- https://web.archive.org/web/20191202004753/http://indianmanuscripts.com/scriptviewer.php
- "YouTube". www.youtube.com. Retrieved 2020-04-18.
- Recreating a 4000 Year Old Battery - Was Electricity Used in Ancient Times?