అగిర్రె ది వ్రాత్ ఆఫ్ గాడ్ (1972 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగిర్రె ది వ్రాత్ ఆఫ్ గాడ్
దర్శకత్వంవెర్నర్ హోర్జోగ్
రచనవెర్నర్ హోర్జోగ్
నిర్మాతవెర్నర్ హోర్జోగ్
తారాగణంక్లాస్ కిన్స్కి, హెలెనా రోజో, రుయ్ గెర్రా
ఛాయాగ్రహణంథామస్ మాచ్
కూర్పుబీట్ మెయిన్కా-జెల్లీహాస్
సంగీతంపొపోల్ వుహ్
నిర్మాణ
సంస్థలు
వెర్నర్ హోర్జోగ్ ఫిల్మ్ ప్రొడక్షన్, హెస్స్చెర్ రండఫంక్
పంపిణీదార్లుఫిలింవర్లాగ్ డెర్ ఆటోరన్[2]
విడుదల తేదీ
29 డిసెంబరు 1972 (1972-12-29)
సినిమా నిడివి
94 నిముషాలు
దేశాలుపశ్చిమ జర్మనీ, పెరు[1]
భాషలుఇంగ్లీష్, జర్మన్ భాష[3]
బడ్జెట్US$370,000[4]

అగిర్రె ది వ్రాత్ ఆఫ్ గాడ్ వెర్నర్ హోర్జోగ్ దర్శకత్వంలో 1972, డిసెంబర్ 29న విడుదలైన పశ్చిమ జర్మన్ చారిత్రాత్మక చలనచిత్రం.[5] క్లాస్ కిన్స్కి, హెలెనా రోజో, రుయ్ గెర్రా నటించిన ఈ చిత్రంలో స్పానిష్, పోర్చుగీసు దేశాలకు చెందిన సైనికుల జీవితాలను చూపించబడింది.[6]

కథా నేపథ్యం

[మార్చు]

పదహారవ శతాభ్దానికి చెందిన లోపే డి అగిర్రె అనే సైనిక నాయకుడు అధికారికంగా ఉన్న రాజును చంపి తనని తానూ రాజుగా ప్రకటించుకొని తాము జయించిన మూల వాసులైన ఆ దేశ ప్రజలని బానిసలుగా చేసుకుని స్పానిష్ సాహసయాత్రకు సంబంధించిన బృందంతో కలిసి బంగారపు నిధులున్న ఎల్ డొరాడోని వెతుకుతూ వెళ్లేందుకు బయలుదేరుతాడు. చివరికి ఆ ప్రాంతాన్ని కనుక్కోలేక ఒక్కడే మిగులుతాడు.

భూమికి 14000 అడుగుల ఎత్తున్న నిటారుగా ఉన్న కొండమీద నుంచి 400 నుంచి 500 మధ్య మనుషులని గుర్రాలతో, పందులు, పశువులు, యుద్ధ సామాగ్రి, ఆహారం, పల్లకీలు అందులో రాజవంశానికి చెందిన రాణి, ఆగిర్రే కూతురు ఎల్విరాతో సహా బానిస బృందం కలిసి భయంకరమైన దారుల గుండా ప్రయాణం చేస్తారు . వాళ్ళు అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో అడవుల్లో నీటి ప్రవాహాల మధ్య నడవలేని పరిస్తితిల్లో కూడా ప్రయాణం కొనసాగిస్తారు.

నరభక్షకులైన మనుషులున్న గ్రామాలగుండా వీళ్ళు ప్రయాణం సాగిస్తుంటారు. అగిర్రే బృందం ఆ నరభక్షక సమూహాల్ని తాము తెచ్చుకున్న మందుగుండు సామాగ్రితో చంపేస్తూ, వాళ్ళ గ్రామాలకు నిప్పంటిస్తూ వెళ్తారు. ఆ ప్రయాణంలో వాళ్లతో వచ్చిన మనుషులు, బానిసలు ఆకలివల్ల రోగాల వల్ల చచ్చిపోతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఇక ఈ ప్రయాణం వద్దు వెనక్కి వెళ్ళడం మంచిది అన్న సందర్భం వచ్చినప్పుడు ఉర్సువా ఈ ప్రయాణం అన్వేషణ మానేసి వెనక్కి వెళదాం అన్నప్పటికి ఆగిర్రే పట్టించుకోడు. అగిర్రే ఆ బంగారం నిధులున్న దేశం కోసం అన్వేషించడం ఆపకూడదు అని గట్టిగానే ఉర్సువాని తృణీకరిస్తాడు. ఆ బృంద సభ్యులు బానిసలు కూడా వెనక్కి వెళ్ళడమే సరైనదని అనుకుంటున్న సందర్భంలోనే ఉర్సువా మీద పిస్టల్ దాడి జరుగుతుంది. ఉర్సువా ప్రమాదంలో ఉన్నాడు ఏదో ఒకటి చేయమని మత గురువును సహాయం అడిగినా గ్యాస్పర్ డి కార్వజలాల్ అనే మత గురువు ఏమి చేయలేడు. తనతో ఉన్న ప్రజలకి నమ్మకంలేదన్న కారణంగానే ఉర్సువాని ఉరేసి చంపించేస్తాడు ఆగిర్రే.

అక్కడితో ఆగకుండ స్థూలకాయుడు , భోజనప్రియుడు నిర్ణయాత్మకంగా బలహీనుడైన డాన్ డి గుజ్మన్ ను తమ అన్వేషణా యాత్ర బృందానికి తాము కనుగొనబోయే ప్రాంతానికి రాజుగా నియమిస్తాడు. ఒకానొక చోట ఇద్దరు నేటివ్ ఇండియన్లు వీళ్ళకి ఎదురుపడతారు. వాళ్ళ మెడలో బంగారం చూసి దగ్గరలోనే ఉన్నామని ఆనందపడతాడు అగిర్రే . ఆ ఇద్దరికీ మతప్రభోధకుడు బైబిల్ చేతులో పెడతాడు. దేవుడి గురించి సువార్త చెప్పి దేవుడు మాట్లాడతాడు అని చెప్తాడు. వాళ్ళు బైబుల్ ని చెవి దగ్గర పెట్టుకుని దేవుని మాటలు ఇందులో నుంచి ఏమీ వినిపించడంలేదు అని అమాయకంగా అడుగుతారు. అది దేవదూషనేనని వాళ్ళని బలవంతంగా మోకాల్లేయించి ప్రార్ధన కూడా చేయిస్తారు.

యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఆకలి చావులు మొదలవుతాయి. అక్కడి లోకల్ ఇండియన్ల దాడి జరిగి కొందరు చనిపోతారు. విషజ్వారాలు వస్తాయి. వాళ్ళ తెప్ప పాడవుతుంది. చివరికి పది పదిహేను మంది మిగులుతారు. వాళ్ళ మీద కూడా దాడి జరుగుతుంది. తిండి లేక బలహీనపడ్డ మతగురువు అగిర్రే బానిస అది భ్రమ అనుకునే అంత బలహీనంగా మారతారు. సొంత కూతురు కూడా దాడిలో బల్లెం పొడుచుకెళ్ళి చనిపోతుంది. చివరిగా ఒకే ఒక్కడు మిగులుతాడు. తాను ఒక్కడే అయిన ఆ ప్రాంతాన్ని కనుక్కుని తానే రాజై ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తానని, తను ఉగ్రతని కుమ్మరించే దేవుడని అనుకునే మాటలతో సినిమా ముగుస్తుంది.

నటవర్గం

[మార్చు]
  • క్లాస్ కిన్స్కి
  • హెలెనా రోజో
  • రుయ్ గెర్రా
  • డెల్ నీగ్రో
  • పీటర్ బెర్లింగ్
  • సిసిలియా రివెరా
  • డానియెల్ అడెస్
  • ఎడ్వర్డ్ రోలాండ్
  • అర్మండో పోలనా
  • అలెజాండ్రో రిపల్స్
  • జస్తో గొంజాలెజ్

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, నిర్మాత, దర్శకత్వం: వెర్నర్ హోర్జోగ్
  • నటులు: క్లాస్ కిన్స్కి, హెలెనా రోజో, రుయ్ గెర్రా
  • సంగీతం: పొపోల్ వుహ్
  • ఛాయాగ్రహణం: థామస్ మాచ్
  • కూర్పు: బీట్ మెయిన్కా-జెల్లీహాస్
  • నిర్మాణ సంస్థ: వెర్నర్ హోర్జోగ్ ఫిల్మ్ ప్రొడక్షన్, హెస్స్చెర్ రండఫంక్
  • పంపిణీదారు: ఫిలింవర్లాగ్ డెర్ ఆటోరన్

చిత్రీకరణ

[మార్చు]
  1. పెరు రాష్ట్రంలో మాచు పీచు ప్రాంతంలోని కొండ[7] మీద నుంచి బరువైన కాస్ట్యూమ్ లు వేసి పశువుల్ని, గుర్రాల్ని, ఇచ్చి వాళ్ళను మోయిస్తూ మేఘాల గుండా వాళ్ళని నడిపించడం జరిగింది.
  2. నదీ ప్రయాణంలో వీళ్లు ఏర్పాటుచేసుకున్న తెప్ప పాడయింది. కొంతమంది నది ఇవతలకు చేరుకోగా, మరికొంతమంది అటువైపు ఆ ప్రవాహం ఉదృతం అవడంవల్ల ఆగిపోయారు. నటులు నది ప్రవాహ భయంతో కొట్టుమిట్టాడేది కూడా దృశ్యీకరించి సినిమాలో వాడబడింది..
  3. నటుల సహజమైన హావభావాలను భయాందోళనలను ఉన్నవి ఉన్నట్టుగా చూపించేందుకు ఉద్దేశ్యంతో స్టూడియోలో సెట్టింగ్గుల్లో కాకుండా పెరూవియన్ అడవుల్లోనే అత్యంత సహజమైన వాతావరణంలో ప్రకృతి మధ్య వెర్నెర్ ఈ సినిమాని తీశారు.
  4. తన సొంత డబ్బులు, తన సహోదరుని దగ్గర నుంచి తీసుకున్న అప్పు, తన దగ్గరున్న ఒకే ఒక్క కెమెరాతో వెర్నెర్ అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాడు.[7] జర్మన్ టెలివిషన్ స్టేషన్ కూడా ఇతనికి ఫండింగ్ ఇవ్వడం వల్ల ఆ టీవీలో దీన్ని ప్రదర్శించేందుకు అతడు తొందర తొందరగా ఈ సినిమాని తీయవలసి వచ్చింది.
  5. ఈ సినిమా తీయడానికి ముందుగానే వెర్నెర్ సౌత్ అమెరికాకెళ్ళి అతడు తన సినిమాకి తగ్గ లొకేషన్లను చూసుకున్నాడు. పెరూవియన్ అడవుల్లో అమెజాన్ పరీవాహక కొండజాతుల వాళ్లకు అతడు తీయబోతున్న సినిమా గురించి ముందుగానే చెప్పాడు.
  6. ఈ చిత్రానికి 270 మంది అక్కడి పెరూవియన్ కొండజాతుల వాళ్లతో మొత్తం 450మంది బృందం పనిచేశారు.

చిత్ర వివరాలు

[మార్చు]
  1. అమెజాన్ అడవిలో అత్యంత కిష్టపరిస్థితుల్లో దీనిని తెరకెక్కించారు
  2. ఇది ప్రపంచ ప్రజలు చూడదగ్గ సినిమా అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది. ప్రపంచ ఉత్తమ 100 చిత్రాల్లో ఒకటిగా పేర్కొంది.

అవార్డులు

[మార్చు]

ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది.

  1. 1973లో, "ఔట్ స్టాండింగ్ ఇండ్యూజవల్ అచీవ్‌మెంట్ సినిమాటోగ్రఫీ" లో డ్యూచర్ ఫిల్స్ప్రిస్ (జర్మన్ ఫిల్మ్ అవార్డ్) గెలుచుకుంది.[8]
  2. 1976లో ఫ్రెంచ్ సిండికేట్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ చే "బెస్ట్ ఫారిన్ ఫిల్మ్" గా ఎంపికైంది.[9][10]
  3.  1977లో నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ (యూఎస్) వారినుండి "ఉత్తమ సినిమాటోగ్రఫీ" అవార్డు వచ్చింది.[11]
  4.  1976లో బెల్జియన్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వారి ప్రఖ్యాత గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకోవడంతోపాటు "బెస్ట్ ఫిల్మ్" సేసర్ అవార్డుకు నామినేట్ చేయబడింది.[12]

మూలాలు

[మార్చు]
  1. "Aguirre, der Zorn Gottes". LUMIERE. Retrieved 9 April 2019.
  2. "Aguirre, der Zorn Gottes". Filmverlag der Autoren. Retrieved 9 April 2019.
  3. Overbey, David. Movies of the Seventies, pg. 162. Edited by Ann Lloyd, Orbis Books, 1984. ISBN 0-85613-640-9: The film was shot in English, but was primarily released in a German-dubbed version.
  4. "Business Data for Aguirre, der Zorn Gottes". Internet Movie Database. Retrieved 9 April 2019.
  5. నమస్తే తెలంగాణ, సినిమా వార్తలు (10 April 2018). "ఘనంగా ప్రారంభమైన జర్మన్ చిత్రోత్సవం". Archived from the original on 9 April 2019. Retrieved 9 April 2019.
  6. ఈనాడు, కరీంనగర్ (24 April 2018). "ఫిలిం భవన్‌ వేదికగా.. జర్మనీ అంతర్జాతీయ చిత్రోత్సవం". Archived from the original on 9 April 2019. Retrieved 9 April 2019.
  7. 7.0 7.1 Herzog, Werner. Herzog on Herzog, edited by Paul Cronin, Faber & Faber, 2003. ISBN 0-571-20708-1
  8. "Deutsche Filmpreise von 1951–2004" (in German). /www.deutsche-filmakademie.de. Archived from the original on 27 సెప్టెంబరు 2007. Retrieved 9 ఏప్రిల్ 2019.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  9. "Film Archive: Aguirre, The Wrath of God". German Films. Archived from the original on 23 నవంబరు 2010. Retrieved 9 April 2019.
  10. "Awards for Aguirre, der Zorn Gottes". Internet Movie Database. Retrieved 9 April 2019.
  11. "Past Winners Database: 1977 12th National Society of Film Critics Awards". theenvelope.latimes.com. Archived from the original on 16 August 2007. Retrieved 9 April 2019.
  12. "Anciennes Éditions" (in French). www.lescesarducinema.com. Archived from the original on 27 సెప్టెంబరు 2007. Retrieved 9 ఏప్రిల్ 2019.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

ఇతర లంకెలు

[మార్చు]