అగ్గిబరాట

వికీపీడియా నుండి
(అగ్గిబరాటా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అగ్గిబరాటా
దర్శకత్వంబి.విఠలాచార్య
రచనజి. కె. మూర్తి (మాటలు)
నిర్మాతబి. విఠలాచార్య
తారాగణంనందమూరి తారక రామారావు,
రాజశ్రీ
ఛాయాగ్రహణండి. వరదరాజన్
కూర్పుకె. గోవిందసామి
సంగీతంవిజయా కృష్ణమూర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబరు 17, 1966 (1966-10-17)
సినిమా నిడివి
124 ని
దేశంభారతదేశం
భాషతెలుగు

అగ్గిబరాట 1966లో బి. విఠలాచార్య స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.

సేనాధిపతి గజపతి (రామదాసు) తన సైన్యంతో అడవిలో బందిపోటు దొంగలముఠా నాయకుడైన పులిదండు రంగరాజును బంధిస్తాడు. అయితే, తనతో చేతులు కలిపి మహారాజును అంతంచేసి యువరాణిని, రాజ్యాన్ని వశం చేసుకొమ్మని బందిపోటు రంగరాజు సలహాయిస్తాడు. సేనాని గజపతి మాత్రం తన నమ్మినబంటు సలహాతో రంగరాజును అంతం చేస్తాడు. అతని పేరుతో మారువేషంలో తానే దోపిడీలు సాగిస్తాడు. మహారాజు అమరసింహుడు (మిక్కిలినేని) అడవిలో కార్చిచ్చులో మరణించాడని యువరాణి వాసవి (రాజశ్రీ)ని నమ్మిస్తాడు. ఆ రాజ్యంలో రామాపురం గ్రామానికి చెందిన రాజా (ఎన్టీఆర్), ఆ ఏడాది జరిగే ఉత్సవాల్లో వీరుల పోటీలో గజపతిని ఓడించి వీరఖడ్గం చేజిక్కించుకుంటాడు. యువరాణి రాజాకు బహుమానం ఇస్తూ తొలి చూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. నగరంలో జరిగిన వీరుని ఊరేగింపులో అంతఃపుర గవాక్షం నుంచి అతనిపైకి పూలబంతి విసురుతుంది. పక్క గవాక్షం నుంచి గజపతి, రాజాపైకి కత్తిని విసురుతాడు. అది రాకుమారే విసిరిందని భ్రమపడిన రాజా, ఆ రాత్రి అంతఃపురంలోకి ప్రవేశించి ఆమెను కత్తులతో బంధిస్తాడు. ఆపైన ఆమెనుంచి ఆమె తండ్రి గురించి, సేనాపతి గురించి తెలుసుకుంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. వీరుని గురించి, వారి ప్రణయం గురించి తెలుసుకున్న గజపతి, యువరాణితో బలవంతంగా పెళ్ళికి సిద్ధపడతాడు. రాజా తన స్నేహితులతో కలిసి మారువేషంలో వచ్చి యువరాణిని తీసుకెళ్తాడు. గజపతి, ఆమెను తిరిగి బంధించి రాజాను గాయపరుస్తాడు. గాయపడిన రాజా అడవిలో ఓ గుహలో మహారాజును, అతని విప్లవ సైన్యాన్ని కలుసుకుంటాడు. మహారాజుకు, యువరాణికి అండగా ఉంటానని మాట ఇచ్చి తిరిగి వెళతాడు. దారిలో రంగరాజు పేరుతో దోపిడీలు చేస్తున్నది గజపతేనని రాజా గ్రహిస్తాడు. కొండబూచాడు (ముక్కామల) సాయంతో రాజా కోటలోకి రాకుండా గజపతి కట్టడిచేయగా, గాలిపటం సాయంతో కోటలోకి ఎగిరి వెళ్ళి గజపతిని అంతం చేస్తాడు. మహారాజు అమరసింహుడు, రాజా యువరాణి వాసవిల వివాహం జరిపించి రాజ్యభారం అప్పగించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.[1]

తారాగణం

[మార్చు]
  • ఎన్.టి.రామారావు
  • రాజశ్రీ
  • పద్మనాభం
  • మిక్కిలినేని
  • రామదాసు
  • ముక్కామల
  • బాలకృష్ణ
  • వాణిశ్రీ
  • రమణారెడ్డి
  • మోదుకూరి సత్యం
  • కోళ్ళ సత్యం
  • విద్యశ్రీ

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ: బివి ఆచార్య
  • రచన: జి కృష్ణమూర్తి
  • కెమెరా: వరదరాజన్
  • కూర్పు: గోవిందస్వామి
  • నృత్యం: చిన్ని, సంపత్
  • కళ: నాగరాజన్
  • స్టంట్స్:
  • సంగీతం: విజయా కృష్ణమూర్తి.
  • నిర్మాత, దర్శకుడు: బి విఠలాచార్య

పాటలు

[మార్చు]
  1. అడుగు తొణికెను ఆడిన పెదవి ఒణికెను - ఎస్. జానకి
  2. ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను - ఘంటసాల, సుశీల. రచన: సీ. నారాయణ రెడ్డి.
  3. చెలి ఏమాయె ఏమాయె ఏమా - సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
  4. ఛమ్‌ఛమ్ గుఱ్ఱం చెలాకి గుఱ్ఱం -ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం, మాధవపెద్ది
  5. చిరునవ్వులోని హాయి చిలికించె - ఘంటసాల, సుశీల .రచన: సీ. నారాయణ రెడ్డి.
  6. చురుకు చురుకు నీ చూపు - ఎల్.ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది
  7. ఈ పలకవే నా రామచిలకా పలకవే - సుశీల
  8. మబ్బులు తొలిగెనులే మనసులు - ఘంటసాల, సుశీల . రచన: సీ. నారాయణ రెడ్డి.
  9. మల్లెలమ్మ మల్లెల - ఘంటసాల, మాధవపెద్ది, స్వర్ణలత బృందం . రచన: కొసరాజు.

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. అగ్గిబరాటా - ఫ్లాష్‌బ్యాక్ @ 50 - సివిఆర్ మాణిక్యేశ్వరి