Jump to content

అచ్చమ్మకుంటతండా

అక్షాంశ రేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
వికీపీడియా నుండి
అచ్చమ్మకుంటతండా
—  రెవెన్యూయేతర గ్రామం  —
అచ్చమ్మకుంటతండా is located in Andhra Pradesh
అచ్చమ్మకుంటతండా
అచ్చమ్మకుంటతండా
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం మాచర్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522426
ఎస్.టి.డి కోడ్

అచ్చమ్మకుంటతండా పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ తుల్జాభవానీ అలయం:- గ్రామంలో ఈ ఆలయ నిర్మాణానికి 2015, నవంబరు-30వ తేదీ సోమవారంనాడు భూమిపూజ నిర్వహించారు.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

[మార్చు]
  • ఈ కృష్ణా నదీతీరంలోని నల్లమల తండాలో, మొదట మద్యానికి బానిసలైన గ్రామస్తులను చూసిన ఈ గ్రామయువకులు కొందరు, పట్టుదలతో మద్యంపై పోరుకు స్వీకారం చుట్టి మద్యనిషేధం అమలు చేశారు. పోలీసులు గూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని, గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా చేశారు. గురజాలకు చెందిన డా.చల్లగుండ్ల శ్రీనివాస్ తన ఫౌండేషన్ క్రింద చేయూతనిస్తున్నారు.
  • కృష్ణా నదీతీరాన ఉండే ఈ తండాకు రెండేళ్ళ క్రిందటివరకూ రాకపోకలు సాగించేటందుకు సరైన బాట లేదు. తండావాసులలో అక్షరాస్యత గూడా అంతంతే. రెక్కడితేగానీ డొక్కడని పరిస్థితులు. ఇంతటి దయనీయమైన పరిస్తితులలో, ఈ తండాకు చెందిన 5గురు విద్యార్థులు, ప్రభుత్వ బడులలో విద్య నభ్యసించి, వసతి గృహాలలో భోజనం చేసి, ఆర్థిక ఇబ్బందులనధిగమించి, వైద్యవిద్యలో పట్టభద్రులైనారు.

మూలాలు

[మార్చు]