Jump to content

అడయార్ మర్రి చెట్టు

వికీపీడియా నుండి

అడయార్ మర్రి చెట్టు (ఆంగ్లం:Adayar Banyan Tree) అనేది తమిళనాడులోని చెన్నైలోని అడయార్‌లో ఉన్న 450 సంవత్సరాల పురాతన పెద్ద మర్రి చెట్టు.[1] ఇది థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయం మైదానంలో ఉంది, దీని కింద ప్రజలు జిడ్డు కృష్ణమూర్తి, అన్నీ బిసెంట్, మరియా మాంటిస్సోరితో సహా మేధావుల ఉపన్యాసాలను విన్నారు.[2]

ఈ చెట్టు అడయార్ నుండి బీసెంట్ నగర్ వెళ్ళే మార్గంలో, Mr. వి. కా. వంతెన సమీపంలో ఉంది. ఈ చెట్టు అడయార్ థియోసాఫికల్ సొసైటీ ఆవరణలోని తోటలో ఉంది. ఈ చెట్టు ట్రంక్‌లు దాదాపు 63 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ చెట్టు యొక్క మొత్తం వైశాల్యం 59,500 చదరపు అడుగులు. దక్షిణ భారతదేశంలో ది గ్రేట్ మర్రి చెట్టుగా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఈ చెట్టు దగ్గర ఇప్పటికీ ది గ్రేట్ బన్‌యన్ ట్రీ అని వ్రాయబడిన బోర్డు వుంటుంది. అయితే ప్రస్తుతం ది గ్రేట్ మర్రి చెట్టుగా కోల్‌కతలో వున్న పెద్ద మర్రిచెట్టును పిలుస్తారు.

1989 తుఫాను గాలికి చెట్టు అద్భుతంగా సురక్షితంగా బయటపడింది.

వీక్షణ సమయం

[మార్చు]

ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రకృతి రమణీయతలో చెట్లు, మొక్కలు, తీగలు, పక్షులను ప్రజలు ఉచితంగా చూడవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Banyan Tree". www.ts-adyar.org. Retrieved 2022-09-21.
  2. Besant, Annie Wood (March 2003). Theosophist Magazine; October-December 1927. ISBN 9780766151918.