అడవి మల్లి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
మల్లె చెట్టుకి సంబంధించిన వివిధ రకాలలో ఒక రకం పేరు అడవి మల్లి. దీని శాస్త్రీయ నామం Jasminum pubescens. ఇది స్వేచ్ఛగా వ్యాప్తిచెందే పొద, ఇది మెత్తనైన హృదయాకృతి ఆకులుతో పెద్ద సమూహంగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క పువ్వులు విరబూసినప్పుడు నక్షత్రాకారంలో అందంగా ఉంటాయి, ఈ పువ్వులు తెల్లగా మంచి సువాసన కలిగి ఉంటాయి. ఇది సతతహరితమని చెప్పవచ్చు, వీటి కొమ్మలు తీగలుగా వ్యాప్తిగా చెందుతాయి. ఇది సాధారణంగా బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తుంది, గుట్టలలో మొదలు వద్ద కొద్ది వెడల్పుతో, 5-10 'పొడవుగా వ్రేలాడుతున్నట్లు వ్యాప్తి చెందుతాయి. బాగా గుబురుగా కాడలతో ఆకులు కలిగిన ఈ చెట్టు ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఈ ఆకులు బేస్ వద్ద ఈనెకు ఒకవైపు అండాకారంలో, గుండ్రంగా ఉంటాయి, ఈనెకు మరొకవైపు వ్యతిరేకంగా ఇలాగే ఉంటాయి, ఈ ఆకులు 2" పొడవుతో ఉంటాయి. నక్షత్రాకారంలో తెల్లగా, గుంపుగా ఉండే ఈ పువ్వులు దాదాపు సంవత్సరం పొడవునా కనిపిస్తాయి.