Jump to content

అత్తకు తగ్గ అల్లుళ్ళు

వికీపీడియా నుండి
అత్తకు తగ్గ అల్లుళ్లు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం రామనారాయణ
తారాగణం విజయశాంతి,
రాధ,
సురేష్,
మురళి,
రాజసులోచన
సంగీతం శంకర్ గణేష్,
జె. వి. రాఘవులు
నిర్మాణ సంస్థ లావణ్య ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

అత్తకు తగ్గ అల్లుళ్లు లావణ్య ఆర్ట్ పిక్చర్స్ పతాకం క్రింద వాసంతి నిర్మించిన చిత్రం.

నటీనటులు

[మార్చు]
  • విజయశాంతి
  • రాధ
  • రాజసులోచన
  • సురేశ్
  • మురళి

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. స్నేహం శ్రీరాగం మోహం భూపాలం

కథలు

[మార్చు]

శ్రీమతి నాయుడు జమీందారిణి. క్రింద పడిన తాళంచెవిని నౌకరును పిలిచి తీయించుకోవడం ఆమెకు అలవాటు. పనిమనిషి పొరబాటున కాఫీని ఒలకబోస్తే పనిమనిషిచేత ఆ కాఫీని నాకించడం ఆమెకు పరిపాటి. ఆమెకు సీత, గీత అనే ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు. తనకన్నా సంపన్నులైన వారి బిడ్డలకు భర్తలుగా చేసుకోవాలన్నది ఆమె ఆశయం. ఎన్నాళ్లు గడిచినా తగిన వరులు దొరకలేదు. ఇక తమకు పెళ్లి కాదని సీత, గీత భయపడిన తరుణంలో చిల్లర దొంగలైన రాజు, రాములతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారుతుంది. ఒక మాదిరి సంపన్నులైన వారిని కూడా అల్లుళ్ళుగా అంగీకరించని శ్రీమతి నాయుడు రాజు, రాములను తన అల్లుళ్ళుగా ఎలా అంగీకరిస్తుంది అనేది మిగిలిన కథ.[1]

మూలాలు

[మార్చు]
  1. వి. (15 October 1982). "చిత్రసమీక్ష - అత్తకు తగ్గ అల్లుళ్ళు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 19 January 2020.[permanent dead link]