రామనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామనారాయణ
2014లో రామనారాయణన్
జననం(1949-04-03)1949 ఏప్రిల్ 3
కారైకుడి, తమిళనాడు, భారతదేశం[1]
మరణం2014 జూన్ 22(2014-06-22) (వయసు 65)
సింగపూర్
వృత్తి
  • దర్శకుడు
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1981–2013
పిల్లలు2

రామనారాయణ లేదా రామనారాయణన్ (1949-2014) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, మలయ్ మొదలైన 9 భాషలలోని చలనచిత్రాలకు దర్శకత్వం వహించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1949, ఏప్రిల్ 3వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కారైకుడిలో జన్మించాడు. ఇతడు సినిమాలలో పాటలు వ్రాయాలనే ఉద్దేశంతో మద్రాసు లోనికి కాలుమోపాడు కానీ సంభాషణల రచయితగా సినిమాలలో అడుగు పెట్టాడు. తన మిత్రుడు ఎం.ఎ.ఖాజాతో కలిసి రామ్‌-రహీమ్‌ పేరుతో జంటగా తమిళ సినిమాలకు సంభాషణలు వ్రాశాడు. 1976లో తొలిసారి ఇతడు ఆశై అరుబదు నాళ్ అనే సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు వ్రాశాడు. 1977లో మీనాక్షి కుంకుమమ్ అనే సినిమాతో నిర్మాతగా మారాడు. 1981లో సుమై అనే సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించాడు. ఇతడు మొత్తం 9 భాషలలో 125కుపైగా సినిమాలకు పనిచేశాడు. 1980వ దశకంలో ఎక్కువగా జంతువులు ప్రధాన పాత్రలుగా ఉన్న సినిమాలు తీశాడు. 1990లలో భక్తి సినిమాలు తీశాడు. ఇతని సినిమాలు తెలుగు, హిందీతో సహా పలు భారతీయ భాషలలోనికి డబ్ చేయబడ్డాయి. ఇతడు తమిళ సినిమా నిర్మాతల మండలికి వరుసగా మూడుసార్లు అధ్యక్షుడిగా ఉన్నాడు. 1989లో కారైకుడి నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభకు ఎన్నికైనాడు. 1996లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ కు అధ్యక్షునిగా నియమితుడైనాడు. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ఇతడిని కళైమామణి పురస్కారంతో సత్కరించింది. ఇతడు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తన 65వ యేట 2014, జూన్ 22న సింగపూర్‌లో మరణించాడు.

సినిమాలు

[మార్చు]

రామనారాయణ తీసిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

సంవత్సరం సినిమా పేరు పాత్ర వివరాలు
దర్శకత్వం కథ స్క్రీన్ ప్లే నిర్మాత
1980 పున్నమినాగు Green tickY
1982 అత్తకు తగ్గ అల్లుళ్ళు Green tickY
1982 న్యాయ పొరాటం Green tickY
1984 కోడలు దిద్దిన కాపురం Green tickY మనైవి సొల్లె మందిరం అనే తమిళ సినిమా డబ్బింగ్
1984 ఛాలెంజ్ దొంగలు Green tickY
1984 పగ పట్టిన పులి Green tickY
1984 సకల కళా ప్రియుడు Green tickY తీరద విలాయత్తు పిళ్ళై అనే తమిళ సినిమా డబ్బింగ్
1985 కేటుగాళ్ళకు సవాల్ Green tickY
1985 చిలిపి యవ్వనం Green tickY
1985 ఛాలెంజ్ కిలాడీ Green tickY
1985 దెయ్యాల మేడ Green tickY
1985 మావూరి మొనగాళ్ళు Green tickY
1985 రాధ మాధవి Green tickY
1986 నాగదేవత Green tickY Green tickY Green tickY
1986 మారుతి Green tickY Green tickY
1986 రణధీరుడు Green tickY
1987 నాగపూజా ఫలం Green tickY
1990 లక్ష్మి దుర్గ Green tickY
1990 శ్రావణ శుక్రవారం Green tickY
1991 కొండవీటి ఖైది Green tickY
1991 గంగ Green tickY
1991 నరహరి మురహరి Green tickY
1991 నాగమ్మ Green tickY Green tickY
1991 ముద్దుల మరదలు Green tickY
1991 శ్రావణ మాసం Green tickY
1991 సింధూర దేవి Green tickY
1992 గోమాతవ్రతం Green tickY
1992 గౌరమ్మ Green tickY Green tickY Green tickY
1992 నాగబాల Green tickY
1993 దుర్గ అనుగ్రహం Green tickY Green tickY
1993 మావారికి పెళ్ళి Green tickY
1993 శాంభవి Green tickY
1993 శివరాత్రి Green tickY
1998 జగదీశ్వరి Green tickY
1999 గురు పౌర్ణమి Green tickY Green tickY
2000 తిరుమల తిరుపతి వెంకటేశ Green tickY తిరుపతి ఎళుమలై వెంకటేశ అనే తమిళ సినిమా రీమేక్
2000 దేవత Green tickY
2000 మహాదేవి Green tickY
2002 అమ్మోరు తల్లి Green tickY
2003 అల్లరి గజేంద్రుడు Green tickY
2010 కారా మజాకా Green tickY Green tickY Green tickY Green tickY తమిళంలో కుట్టి పిశాసు, కన్నడలో బొంబాట్ కార్ అనే పేర్లతో ఒకే సారి నిర్మించారు.

మూలాలు

[మార్చు]
  1. "Rama Narayanan, veteran director, producer, dies at 65". The Times of India. 23 June 2014. Retrieved 4 October 2022.

బయటిలింకులు

[మార్చు]