అత్తిరాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"అత్తిరాల (హత్యరాల)" కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామచరిత్ర[మార్చు]

1830ల నాటికే ఈ గ్రామానికి పుణ్యక్షేత్రంగా పేరుంది. ఆనాటికే గ్రామం పేటస్థలం, సకల వస్తువులు దొరుకేవి. గ్రామంలో ముస్లిములు ఎక్కువగా ఉండేవారని 19వ శతాబ్ది యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు[2].

  • అత్తిరాలలో రెండు వేల సంవత్సరాల కాలం నాటి రోమన్ నాణేలు దొరికినాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పేరు వృత్తాంతము[మార్చు]

ఒక సారి శివుడు తనను దూషించిన బ్రహ్మ ఐదవ తలను నరికినప్పుడు ఆ తల రాలి ఇక్కడే పడిందని, "హత్య! (తల) రాలె!" అనే మాటలే చివరకు "అత్తిరాల" అయ్యాయని అంటారు. ఇంకో కథ ప్రకారం పరశురాముడు తన తండ్రి జమదగ్ని మాట ప్రకారం తన తల్లి అయిన రేణుకను చంపుతాడు. తల్లిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి పరశురాముడు బాహుదా నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్న త్రేతేశ్వర స్వామిని సేవించాడు. పరశురాముని చేతికంటిన పాపం పోగొట్టిన ఈ నదికి చెయ్యేరు అని పేరు వచ్చింది. ఈ క్షేత్రాన్ని పరశురామ క్షేత్రమనీ, హత్యరాల అనీ అంటారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నుంచి నెల్లూరు వెళ్ళే మార్గంలో రాజంపేటకు 5-6 కి.మీ. దూరంలో అత్తిరాల ఉంది. ఈ క్షేత్రం బాహుదా నది ఒడ్డున వెలసిం

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఆలయాలు[మార్చు]

అత్తిరాలలో త్రేతేశ్వరాలయం, కామాక్షి ఆలయం ప్రసిద్ధమైనవి.

కొండ దిగువన పరశురామాలయం ఉంది. పరశురామాలయం మీద నృత్య భంగిమ శిల్పాలు, రామ, కృష్ణ, విష్ణు, పరశురామ శిల్పాలు ఉన్నాయి. ఇవి కాక మట్లి రాజుల కాలంలో ఉన్న ఏకా తాతయ్య విగ్రహం ఉంది. తలనొప్పితో బాధపడేవారు తమ తలతో తాతయ్య తలకు కొట్టుకుంటారు. అలా చేస్తే తలనొప్పి పోతుందని వారి విశ్వాసం.

పరశురామాలయం ప్రక్కనే గదాధర స్వామి ఉన్నాడు. ఇది విష్ణ్వాలయం.

దేవగిరి యాదవరాజు అత్తిరాలను దర్శించినాడు. పొత్తపి రాజు శ్రీకంఠ చోళుడు 'మందరం' గ్రామాన్ని ఈ స్వామికి సమర్పించినాడు. భర్తలు చనిపోయిన భార్యలు, భార్యలు చనిపోయిన భర్తలు ఏడాది లోపు ఈ క్షేత్రాన్ని దర్శిస్తారు. స్త్రీల సంఖ్య ప్రధానంగా కామాక్షీ దేవిని దర్శిస్తారు. గుట్ట పైన జ్యోతి స్తంభం ఉంది. శివరాత్రి నాడు జ్యోతిని వెలిగిస్తారు. మాఘ మాసంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసంలో కూడా ఇక్కడికి చాలా మంది వచ్చి శివుడిని దర్శనం చేసుకొంటారు. అదే కాకుండా ప్రతి సంవత్సరము జరిగే జాతరకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. దేశం నలు మూలల నుండి ఈ జాతరను కోసము భక్తులు వచ్చెదరు.

గ్రామ విశేషాలు[మార్చు]

అత్తిరాల బాహుదా నదీ తీరాన ఉన్న పరశురాముడి ఆలయం వద్ద, నీరు ఎండిపోవడంతో, తమిళ శాసనాలతో కూడిన బండలు, ఒక దేవతామూర్తి విగ్రహం బయట పడినవి. అత్తిరాల బాహుదానది ఇంతవరకు ఎండిపోయిన దాఖలాలు లేవు. తీవ్రకరవుతో చెయ్యేరు కొన్నేళ్ళుగా పారకపోవడంతో , బాహుదానది నీటిమట్టం, పూర్తిగా పడిపోయినది. ఈ కారణంగా జీవనది అయిన అత్తిరాల బాహుదానదిలో నీరు లేకుండా పోయినది. ఒకప్పుడు నదిలోనికి అడుగు పెట్టాలంటే భయపడే భక్తులు, ఇప్పుడు నదిలో దిగి నడుచుకుంటూ వెళ్ళుచున్నారు. [1]

మూలాలు, వనరులు[మార్చు]

వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు, రాజంపేట నివాసి - దగ్గుపాటి నికేతన్, అత్తిరాలవాసి-కోవూరు గణేష్

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు కడప; 2014, ఆగష్టు-6; 2వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-04.
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=అత్తిరాల&oldid=3044217" నుండి వెలికితీశారు