అద్నాన్ ఓక్తర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అద్నాన్ ఓక్తార్ / Adnan Oktar
Adnan oktar 03.jpg
జననం
అద్నాన్ ఓక్తర్ / అద్నాన్ అక్తర్

1956 (age 64–65)
ఇతర పేర్లుహారూన్ యహ్యా , అద్నాన్ హోకా
వృత్తిరచయిత
సుపరిచితుడుIslamic creationism, Anti-Zionism, Anti-Masonry, Ijaz Literature
వెబ్‌సైటుwww.harunyahya.com

అద్నాన్ ఓక్తర్ (జననం 1956), హారూన్ యహ్యా గానూ ప్రసిద్ధి, [1] టర్కీకి చెందిన రచయిత, "ఇజాజ్ సాహిత్యం" ప్రముఖ ప్రాపగేటర్.[2] మరియూ ఇస్లామీయ జీవపరిణామ సిద్ధాంతం గురించిన రచయిత.[3] 2007 లో ఇతను తన రచనయైన అట్లాస్ ఆఫ్ క్రియేషన్ యొక్క వేలకొలది కాపీలను అమెరికా శాస్త్రఙఞులకు, కాంగ్రెస్ సభ్యులకు,, సైన్సు సంగ్రహాలయాకు పంపిణీ చేసాడు, [4] ఈ గ్రంథం ఇస్లామీయ పరిణామ సిద్ధాంతాన్ని పరిచయం చేస్తుంది.[5] ఓక్తార్ రెండు సంస్థలను నడుపుతున్నాడు. రెండింటికీ ఇతను గౌరవాద్యక్షుడు, 1) బిలిం అరష్తీర్మా వక్ఫి (సైన్సు పరిశోధనా సంస్థ - 1990), ఈ సంస్థ సృష్టితత్వాన్ని నిర్వచిస్తుంది,, 2) మిల్లి దెగీర్‌లెరి కొరుమా వక్ఫి (జాతీయ విలువల పరిరక్షణా సంస్థ - 1995), జీవన విలువలను గౌరవాలను పరిరక్షించే సంస్థ.[6] గత రెండు దశాబ్దాలుగా ఓక్తార్ అనేక న్యాయసంబధ కేసులలో వున్నాడు, కొన్నివాటిలో వాదిగానూ కొన్నివాటిల్లో ప్రతివాదిగానూ.

రచనలు[మార్చు]

ఓక్తర్ "హారూన్ యహ్యా" అనే కలం పేరుతో అనేక పుస్తకాలు వ్రాసాడు. "హారూన్", "యహ్యా" ఇస్లామీయ ప్రవక్తల పేర్లు. ఇతని రచనలన్నీ ఖురాను లోని ఏకేశ్వరుడైన అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని చాటే విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇతడి ముఖ్యోద్దేశ్యం, ఇస్లాంను ప్రపంచానికి పరిచయం చేయడం. అల్లాహ్, ఖురాన్, ఇస్లామీయ విశ్వాసాలు, ఇస్లామిక్ శాస్త్రీయ దృక్ఫధం ప్రపంచానికి పరిచయం చేయడం, పశ్చిమ దేశాల శాస్త్రవేత్తల శాస్త్రాలలోని లోపాలను ఎత్తి చూపడం, ప్రాకృతిక నియమాలను సశాస్త్రీయంగా ఖురాన్ ప్రకారం సూత్రీకరించి సత్యనిరూపణ చేయడం. మరీ ముఖ్యంగా డార్విన్ సిద్ధాంతాన్ని, భౌతికవాదాన్ని, నాస్తికత్వాన్ని విమర్శించి ఎండగట్టడం.

టెలివిజన్ ప్రసారాలు[మార్చు]

2011 మార్చి 21 న ఓక్తార్ టెలివిజన్ ప్రసారాలను A9 సాటిల్లైట్ ద్వారా ప్రారంభించాడు. ఈ ప్రసారాలలో ఇంటర్వ్యూలు, లెక్చర్లు నేరుగా ప్రసారమయ్యేవి.[7]

గ్రంధాలు - ప్రచురణలు[మార్చు]

ఓక్తర్ పుస్తకాలు బ్రోచర్లు టర్కీ భాషలో "వూరల్ యాయిషిలిక్" (గ్లోబల్ పబ్లిషింగ్) కంపెనీ, ఇస్తాంబుల్ చే ప్రచురితమయ్యాయి. ఆంగ్ల తర్జుమాలు "తాహా పబ్లిషర్స్" లండన్, యు.కె.; గ్లోబల్ పబ్లిషింగ్ ఇస్తాంబుల్, టర్కీ; అల్-అతీక్ పబ్లిషర్స్, ఒంటారియా, కెనడా;, గుడ్‌వర్డ్ బుక్స్ న్యూఢిల్లీ, భారత్ లలో ప్రచురింపబడుతున్నాయి.

ప్రచురణలలో ముఖ్యమైనవి : పుస్తకాలు, బుక్‌లెట్స్, కరముద్రికలు, కరపత్రాలు, బాల సాహిత్యం, పత్రికలు, డాక్యుమెంటరీలు, ఆడియో-గ్రంధాలు, సి.డి.లు, పోస్టర్లు,, 100 కంటే ఎక్కువ వెబ్‌సైట్లు. ఇతడి రచనలు పుస్తకాలూ వందలకొద్దీ గలవు.[8] ఇతడి రచనలు హుందాగానూ రంగులలోనూ, నాణ్యతగల కాగితాలతోనూ తయారయి ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ పుస్తక విక్రయశాలలలో లభ్యమవుతున్నాయి

మూలాలు[మార్చు]

  1. "Harun Yahya". harunyahya.com. Archived from the original on 24 ఫిబ్రవరి 2011. Retrieved 26 December 2011.
  2. Osama Abdallah
  3. Seeing the light – of science Salon.com
  4. Yahya, Hârun; Rossini, Carl Nino; Evans, Ron; Mossman, Timothy (2006). "Atlas of creation". Global Publishing. OCLC 86077147. Cite journal requires |journal= (help)
  5. Dean, Cornelia (17 July 2007). "Islamic Creationist and a Book Sent Round the World". New York Times. Archived from the original on 25 ఆగస్టు 2007. Retrieved 17 July 2007.
  6. Songün, Sevim (27 February 2009). "Turkey evolves as creationist center". Hurriyet Daily News. Archived from the original on 5 మార్చి 2009. Retrieved 17 March 2009.
  7. "Adnan Hoca da TV Kanalı Kurdu". Haber365.com. 19 February 2011. Archived from the original on 21 మార్చి 2012. Retrieved 10 April 2012.
  8. harunhaya.net as of December 2010 lists 274 items in Turkish (dated October 1991 to January 2010), 197 items in English, or 771 items counting all languages.

బాహ్య లింకులు[మార్చు]