Jump to content

అధర్ముడు

వికీపీడియా నుండి
శ్రీ మద్భాగవతము

అధర్ముడు వరుణునికి జ్యేష్ఠాదేవి యందు పుట్టిన కొడుకు. ఈతనిభార్య నిరృతుని కూఁతురయిన హింస; కుమారులు భయుడు, మహాభయుఁడు, మృత్యువు. చెల్లెలు సురనిందని.

శ్రీ మద్భాగవతము ప్రకారము అధర్ముఁడు మృషను వివాహమాడినట్లును, ఆమెయందు దంభుఁడు అను కొడుకును, మాయ అను కూఁతురును కలిగినట్లును, వారికి ఇరువురకు లోభుఁడు అను కొడుకును, నికృతి అను కూఁతురును పుట్టినట్లును, వారికి క్రోధుఁడు, హింస పుట్టిరనియు, వారికి కలియు, దురుక్తియు పుట్టిరనియు, వారికి మృత్యువును, భీతియు కలిగిరనియు, ఆమృత్యువునకు భీతియందు నిరయుడు, యాతనయు పుట్టిరనియు చెప్పఁబడి ఉంది.

విష్ణుపురాణము ప్రకారము అధర్మునికిని హింసకును అకృతుడు అను కొడుకును, నికృతి అను కూతురును పుట్టినట్లును, నికృతియందు అనృతునికి భయుఁడు, నరకుఁడు అను నిద్దఱు పుత్రులును, మాయ, వేదన అను నిద్దఱు పుత్రికలును జన్మించినట్లును, అందు భయునికి మాయయందు మృత్యువు అనువాడును, నరకునికి వేదనయందు దుఃఖుడు అనువాడును పుట్టినట్లును చెప్పి ఉంది. మఱియు మృత్యువునకు వ్యాధి, జర, శోకుఁడు, తృష్ణ, క్రోధుఁడు అనువారు పుట్టి లోకమును నాశము చేయుచుందురనియు చెప్పి ఉంది.

[పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 ]

"https://te.wikipedia.org/w/index.php?title=అధర్ముడు&oldid=3846966" నుండి వెలికితీశారు