Jump to content

అనంత్ గీతే

వికీపీడియా నుండి
అనంత్ గీతే
అనంత్ గీతే


శివ సేన జాతీయ కార్యవర్గ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
జనవరి 23, 2018

భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంట్రప్రెస్స్ శాఖ మంత్రి
పదవీ కాలం
26 మే 2014 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు ప్రఫుల్ పటేల్
తరువాత అరవింద్ సావంత్

పదవీ కాలం
26 ఆగష్టు 2002 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు సురేష్ ప్రభు
తరువాత పి. ఎం. సయీద్ ]

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2019
ముందు నూతన నియోజకవర్గం ఏర్పాటు
తరువాత సునీల్ తట్కరే
నియోజకవర్గం రాయగడ్
పదవీ కాలం
1996 – 2009
ముందు గోవిందరావు నికమ్
తరువాత నియోజకవర్గం రద్దయింది
నియోజకవర్గం రత్నగిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1951-06-02) 1951 జూన్ 2 (వయసు 73)
తిసంగి
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివ సేన
జీవిత భాగస్వామి అశ్వినీ
నివాసం ముంబై

అనంత్ గంగారామ్ గీతే (జననం 1951 జూన్ 2) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2002 ఆగస్టు నుండి 2004 మే వరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా, 2014 నుండి 2019 వరకు నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర భారీ పరిశ్రమల, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]

నిర్వహించిన పదవులు

[మార్చు]
1985–92 కౌన్సిలర్, మున్సిపల్ కార్పొరేషన్, ముంబై
1990–92 మునిసిపల్ కార్పొరేషన్ ముంబై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్
1996 రత్నగిరి నుంచి 11వ లోక్‌సభకు మొదటి సారి ఎన్నికయ్యాడు, చీఫ్ విప్, శివసేన పార్లమెంటరీ పార్టీ
1996–98 పట్టణ & గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యుడు
1998 12వ లోక్‌సభకు 2వ సారి ఎన్నికయ్యాడు
1998–99 సభ్యుడు, విదేశీ వ్యవహారాల కమిటీ, దాని సబ్-కమిటీ-III

మెంబర్ కన్సల్టేటివ్ కమిటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

1999 13వ లోక్‌సభకు 3వ సారి ఎన్నికయ్యాడు, శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడు
1999–2000 పట్టణ & గ్రామీణాభివృద్ధి కమిటీ చైర్మన్. సభ్యుడు, వ్యాపార సలహా కమిటీ.

సాధారణ ప్రయోజనాల కమిటీ. రైల్వే కన్వెన్షన్ కమిటీ సభ్యుడు.

1999–2001 అంచనాల కమిటీ సభ్యుడు
2000–2002 పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
జూలై-2002 ఆగస్టు కేంద్ర సహాయ మంత్రి, ఆర్థిక, బ్యాంకింగ్, వ్యయ మంత్రిత్వ శాఖ
2002 ఆగస్టు - 2004 మే కేంద్ర కేబినెట్ మంత్రి, విద్యుత్
2004 14వ లోక్‌సభకు 4వ సారి ఎన్నికయ్యాడు, సభ్యుడు, సాధారణ ప్రయోజనాల కమిటీ. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కమిటీ చైర్మన్, పిటిషన్లపై కమిటీ సభ్యుడు
2007 ఆగస్టు నుండి కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ కమిటీ చైర్మన్
2009 15వ లోక్‌సభకు 5వ సారి ఎన్నికయ్యాడు, శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడు,
2009 సెప్టెంబరు 23 చైర్మన్, పిటిషన్లపై కమిటీ, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజా పంపిణీపై కమిటీ సభ్యుడు. సభ్యుడు, వ్యాపార సలహా కమిటీ
కొంకణ్ రైల్వే వినియోగదారుల సలహా కమిటీ సభ్యుడు
2014 16వ లోక్‌సభకు 6వ సారి ఎన్నికయ్యాడు
2014 మే 28 కేంద్ర కేబినెట్ మంత్రి, భారీ పరిశ్రమలు & ప్రభుత్వ రంగ సంస్థలు
2018 శివసేన పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు [2]

మూలాలు

[మార్చు]
  1. "Political Career of Anant Geete". Archived from the original on 2022-08-28. Retrieved 2022-08-28.
  2. "एकनाथ शिंदे, आनंदराव अडसूळ, अनंत गीते, चंद्रकांत खैरे, आदित्य ठाकरे यांची सेनेच्या नेतेपदी वर्णी".