అనర్ఘరాఘవం
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ నటకానికి ఏడు అంకాలు. ప్రథమాంకం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ రక్షణార్ధం తన వెంట తీసుకువెళ్ళడంతో ముగుస్తుంది. రెండో అకంలో రావణాదుల పరిచయం, తాటక వధ, మిథిలా ప్రయాణం వర్ణించారు మురారి. రావణుడు సీతను వివాహామాడ దలచుకోవడంతో మొదలయ్యే మూడో అంకం రాముడు హరివిల్లు విరవడం, రావణుని పురోహితుడు శేషల్కుడు దీనికి ప్రతీకారం తప్పదని రాముని బెదిరంచడంతో పూర్తవుతుంది. ఇక నాలుగో అంకంలో రావణుని మంత్రి మాల్యవంతుడు సీతా రాములకు వియోగం కలగాలనీ, కైకేయి ద్వారా రామునికి వనవాసమయ్యేట్లు చేయమని శూర్పణకను ప్రేరేపిస్తాడు. రామ పరశురాముల సంభాషణ, రామునికి రాజ్యాభిషేకం చేస్తానని దశరథుడు ప్రకటించడం, కైకేయి వరాలను తెలుపుతూ మంథర ప్రవేశించడం, అవి విని దశరథుడూ మూర్చిల్లడంతో నాలుగో అంకం పూర్తవుతుంది. రాముడు వనవాసంలో ఎందరో రాక్షసుల్ని సంహరించినట్టు జాంబవంత, శ్రమణుల సంభాషణ ద్వారా చెప్తూ పంచమాంకం మొదలవుతుంది, సీతాపహరణం, జటాయు మరణం, వాలి సంహారం, సుగ్రీవ పట్టాభిషేకం ఉంటాయి ఈ అంకంలో. ఆరవ అంకంలో రావణుని గూఢచారులు శుక, సారణులు రాముడు సేతుబంధనం చేశాడని మాల్యవంతునికి వివరిస్తారు. కుంభ, ఇంద్రజిత్తులతో రామ యుద్ధం, రావణ వధతో ఈ అంకం పూర్తవుతుంది. ఆఖరిది అయిన సప్తమాంకంలో సీతారాములు, లక్ష్మణ, హనుమంతాదులు పుష్పకవిమానంపై అయోధ్య పయనం, సుమేరు, చంద్ర లోకాలు, నదులు, ఉపనదుల వర్ణనలు ఉంటాయి. రాముని రాజ్యాభిషేకంతో నాటకం ముగుస్తుంది.