అనిరుద్ధ గుహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిరుద్ధ గుహ
జననం (1985-11-13) 1985 నవంబరు 13 (వయసు 38)[1]
వృత్తిపాత్రికేయుడు, స్క్రీన్ ప్లే రచయిత

అనిరుద్ధ గుహ[2] మహారాష్ట్రకు చెందిన పాత్రికేయుడు, సినిమా స్క్రీన్ ప్లే రచయిత, పోడ్‌కాస్టర్, హోస్ట్.[3][4][5][6] ఇతను డిఎన్ఏ, ది హిందూ, ఫస్ట్‌పోస్ట్, ముంబై మిర్రర్ వంటి ప్రముఖ పత్రికలలో పాత్రికేయుడిగా, సినీ విమర్శకుడిగా పనిచేశాడు.[7][8][9] పిఓడబ్ల్యూ - బండి యుద్ద్ కే, మలాంగ్, రష్మీ రాకెట్ మొదలైన వాటికి స్క్రీన్ ప్లేలు రాశాడు. 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రష్మీ రాకెట్ చిత్రానికిగానూ ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్ పొందాడు.[10]

జననం[మార్చు]

అనిరుద్ధ గుహ 1985, నవంబరు 13న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. ఇతడు ప్రముఖ సినీ నిర్మాత దులాల్ గుహా మనవడు.[11][12]

పాత్రకేయరంగం[మార్చు]

2007లో డిఎన్ఏ (డైలీ న్యూస్ & అనాలిసిస్)లో తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించాడు. అందులో సినిమా సమీక్షలు రాశాడు. తరువాత, టైమ్ అవుట్ (ముంబయి) పత్రికలో సినిమా సంపాదకత్వంలో చేరాడు. దాంతోపాటు ముంబై మిర్రర్, ది హిందూ, ఫస్ట్‌పోస్ట్, మెన్స్‌ఎక్స్‌పి వంటి పత్రికలకు కాలమ్‌లు రాశాడు.

సినిమారంగం[మార్చు]

2016లో పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ పిఓడబ్ల్యూ - బండి యుద్ద్ కే సినిమాతో స్క్రీన్ ప్లే రచయితగా సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[13][14] నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు పొందడంతోపాటు సియోల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ ఏషియన్ షో, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులలో ఉత్తమ డ్రామా (జ్యూరీ) గెలుచుకుంది.[13] గుహా ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులలో ఉత్తమ టెలిప్లే విభాగంలో ఎంపికయ్యాడు. తరువాత పలు సినిమాలకు రచనలు చేశాడు.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా/వెబ్ విభాగం ఇతర వివరాలు
2021 రష్మీ రాకెట్ స్క్రీన్ ప్లే & అదనపు సంభాషణలు
2020 మలంగ్ స్క్రీన్ ప్లే
2020 కోడ్ ఎం కథ సలహాదారు
2016 పిఓడబ్ల్యూ - బండి యుద్ధ్ కే కథ & స్క్రీన్ ప్లే

మూలాలు[మార్చు]

 1. "Aniruddha Guha Instagram Post". www.instagram.com. Archived from the original on 2021-12-26. Retrieved 2023-07-22.
 2. "Rashmi Rocket is Not Dutee Chand's Story, But Tribute to Several Sportswomen: Writer Aniruddha Guha". News18 (in ఇంగ్లీష్). 2021-10-07. Retrieved 2023-07-22.
 3. "The couple rocking Clubhouse". Mid day (in ఇంగ్లీష్). 2021-07-18. Retrieved 2023-07-22.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "Writer calling writer". The Hindu. 2016-11-07. ISSN 0971-751X. Retrieved 2023-07-22.
 5. "HT Brunch Cover Story: The new stars of Clubhouse". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-09-18. Retrieved 2023-07-22.
 6. "They practice Netflix and chill". Mid-day (in ఇంగ్లీష్). 2019-06-05. Retrieved 2023-07-22.{{cite web}}: CS1 maint: url-status (link)
 7. "Aniruddha Guha". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-22.
 8. "Aniruddha Guha". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2023-07-22.
 9. "Articles by Aniruddha Guha, Latest News by Aniruddha Guha | Mumbai Mirror Reporter". Mumbai Mirror. Retrieved 2023-07-22.
 10. "Nominations for the 67th Wolf777news Filmfare Awards 2022". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2023-07-22.
 11. कर्ण, अमित (2021-10-13). "रश्मि रॉकेट: रिसर्च में दो महीने और स्क्रीन प्ले तैयार करने में 7-8 महीने लगे, बोर्ड पर सबसे पहले आईं तापसी पन्नू, फिर 4 प्रोड्यूसर और 3 राइटर्स किए गए साइन". Dainik Bhaskar. Retrieved 2023-07-22.
 12. "My granddad made movies. In the '70s, Dulal Guha was among Hindi cinema's most prominent filmmakers - smashing it out of the park in successive years with films like 'Dharti Kahe Pukar Ke', 'Dushmun', 'Pratiggya', 'Dost' and 'Do Anjaane'". www.instagram.com. Archived from the original on 2023-07-22. Retrieved 2023-07-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 13. 13.0 13.1 "P.O.W. director Nikkhil Advani: I will take a position but I don't want to become a jingoist". The Indian Express (in ఇంగ్లీష్). 2016-10-16. Retrieved 2023-07-22.
 14. "POW Bandi Yuddh Ke director Nikkhil Advani: 'Army wives are the real prisoners of war'-Entertainment News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2016-10-15. Retrieved 2023-07-22.