అనిరుద్ధ రాయ్ చౌదురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిరుద్ధ రాయ్ చౌదురి
పుట్టిన తేదీ, స్థలం(1964-07-31)1964 జూలై 31
భారతదేశం
వృత్తిసినిమా దర్శకుడు
జాతీయతభారతీయుడు
గుర్తింపునిచ్చిన రచనలుపింక్, అంతహీన్, అనురనన్

అనిరుద్ధ రాయ్ చౌదురి, భారతీయ సినిమా దర్శకుడు. ఇతడు బెంగాలీ, హిందీ సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా పనిచేశాడు. ఇతడు 2016లో దర్శకత్వం వహించిన పింక్ సినిమా అత్యంత విజయవంతమవడంతోపాటు సినీ విమర్శకుల నుండి, సినీ ప్రేమికుల నుండి ప్రశంసలను అందుకుంది.

సినిమారంగం

[మార్చు]

2006లో అనురనన్ అనే బెంగాలీ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. మూడు జాతీయ అవార్డులు, అరవిందన్ పురస్కారం, అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు, రెండు జీ సినీ అవార్డులు, రెండు ఇటిసి బాలీవుడ్ బిజినెస్ అవార్డులు, ఒక స్టార్‌డస్ట్ అవార్డులు , జాగ్రాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడు మొదలైన అవార్డులు అందుకున్నాడు. దాదాపు నాలుగు వందల ప్రచార చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

2016లో వచ్చిన పింక్, అనురనన్ సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నాడు. అతను 2008లో వచ్చిన అంతహీన్ సినిమాకు ఉత్తమ చిత్రం విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు. 2015లో వచ్చిన పికు అనే హిందీ సినిమాలో అతిధి పాత్రలో నటించాడు. సామాజిక ఇతివృత్తాలపై సినిమాలు చేస్తూ, సమస్యల గురించి ఆలోచించమని ప్రోత్సహించాడు.

సినిమాలు

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాషలు మూలాలు
2006 అనురనన్ దర్శకుడు బెంగాలీ
2008 అంతహీన్ దర్శకుడు బెంగాలీ [1]
2010 ఏక్తి తారార్ ఖోంజే నిర్మాత బెంగాలీ [2]
2012 అపరాజిత తుమి దర్శకుడు బెంగాలీ
2014 బునో హాన్ష్ దర్శకుడు బెంగాలీ
2016 పింక్ దర్శకుడు హిందీ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం శీర్షిక భాష నెట్‌వర్క్ మూలాలు
2019 పార్చాయీ: రస్కిన్ బాండ్ రచించిన ఘోస్ట్ స్టోరీస్ హిందీ జీ5 ఒరిజినల్స్ [3][4]
2020 ఫర్బిడెన్ లవ్ హిందీ జీ5 ఒరిజినల్స్

మూలాలు

[మార్చు]
  1. "Bengali film market not properly nurtured: Filmmaker Aniruddha Roy Chowdhury". Business Standard. 9 March 2018. Retrieved 28 June 2021.
  2. "Aniruddha Roy Chowdhury". Outlook (Indian magazine). Retrieved 28 June 2021.
  3. Team, DNA Web (2019-01-07). "Ghost stories by Ruskin Bond, titled 'Parchayee', to come alive on ZEE5". DNA India (in ఇంగ్లీష్). Retrieved 28 June 2021.
  4. Team, DNA Web (2019-01-09). "Parchayee: Watch Ruskin Bond's favourite ghost stories on ZEE5". DNA India (in ఇంగ్లీష్). Retrieved 28 June 2021.

బయటి లింకులు

[మార్చు]