అనిల్ డ్యాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ డ్యాని
Anil Dani.jpg
అనిల్ డ్యాని
జననంఅనిల్
(1981-07-03) జులై 3, 1981 (వయస్సు 39)
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాస ప్రాంతంకొండపల్లి, కృష్ణా జిల్లాః
వృత్తికవి
భార్య / భర్తసుభాషిణి
పిల్లలుయదీద్యా
తండ్రిఅబ్రహాం
తల్లిఎలిజబెత్

అనిల్ డ్యాని యువ కవి. కవి సంగమం రచయితలలో ఒకరు.

జననం[మార్చు]

అనిల్ డ్యాని ఎలిజబెత్, అబ్రహాం దంపతులకు 1981, జూలై 3న కృష్ణా జిల్లా, విజయవాడలో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం[మార్చు]

ప్రస్తుతం కృష్ణా జిల్లా, కొండపల్లిలో నివసిస్తున్నారు.

వివాహం[మార్చు]

వీరికి సుభాషిణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (యదీద్యా).

ప్రచురితమయిన మొదటి కవిత[మార్చు]

మొదటి కవిత... 2014 ప్రజాశక్తి "సవ్వడిలో"

ఇప్పటివరకు ప్రచురితమైన పత్రికలు - కవితా పఠనాలు[మార్చు]

 • ప్రజాశక్తి, కవితా!, తెలుగు వెలుగు, వాకిలి, ప్రజాప్రభాతం, పునాది, ఆత్మీయంలలో
 • ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో "యువవాణి" కార్యక్రమంలో కవితా పఠనం
 • కవిసంగమంలో 4వ సీరిస్ లో మిత్రుడు నరేష్, మెరాజ్ ఫాతిమాలతో కలిసి కవితా పఠనం
 • ప్రజాశక్తి దినపత్రికలో 2015 ఆగస్టు 10 న " అనిల్ ఓ ఎగసిపడే కవితా కెరటం " పేరుతో ఒక ముద్రిత వ్యాసం

కవితల జాబితా[మార్చు]

 1. రంగు వెలసిన ఆకాశం
 2. ఖాళీ కుర్చీ
 3. అస్తిత్వ భావన
 4. యధాలాపంగా
 5. తనలోతాను
 6. ప్రవాహం
 7. నవ్వే నక్షత్రాలు
 8. స్వచ్ఛత
 9. ఈ దారిలో
 10. ఊరంటే ఊరు కాదు
 11. సిగ్నచర్ ట్యూన్
 12. మెర్క్యూరి
 13. ఆకురాలే కాలం
 14. నీ కృపలో

ప్రచురితమయిన పుస్తకాల జాబితా[మార్చు]

 • తీరం దాటీన నాలుగు కెరటాలు మరో ముగ్గురు మిత్రులు నరేష్కుమార్, వర్ణలేఖ, చైతన్య లతో కలిసి (2014 జూలై 12 వ తేదీన ఖమ్మం శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రముఖ కవి శివారెడ్డి గారు, అప్పటి హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారి చేతులమీదుగా ఆవిష్కరణ)
 • 2017 లో ఎనిమిదోరంగు అనే కవితా సంకలనం వెలువరించారు . ఆవిష్కరణ శ్రీ . మువ్వా. శ్రీనివాసరావు గారు, సమీక్ష, చినుకు రాజగోపాల్ గారు, సభా నిర్వహణ శ్రీరాం.పుప్పాల 2017 మార్చి 10 న మధుమాలక్ష్మి చాంబర్స్ లో జరిగింది.

పుస్తక ఆవిష్కరణ చిత్రమాలిక[మార్చు]

వీడియో లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]