అనుపమ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుపమ కుమార్
జననం (1974-12-04) 1974 డిసెంబరు 4 (వయసు 49)
ఇతర పేర్లుఅనుపమ ప్రకాష్ కుమార్
వృత్తినటి, నిర్మాత, మోడల్, యాంకర్, టెలివిజన్ కార్యక్రమాల నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
జీవిత భాగస్వామిజి. శివకుమార్
పిల్లలు1

అనుపమ ప్రకాష్ కుమార్ (జననం 1974 డిసెంబరు 4) భారతీయ నటి, మోడల్.[1] 300లకు పైగా వాణిజ్య ప్రకటనలలో చేసిన ఆమె, 2003 కన్నడ చిత్రం పార్థతో నటిగా అరంగేట్రం చేసింది. ఆమె ఎక్కువగా తమిళ చిత్రాలలో సహాయక పాత్రలు పోషించింది.[2] తెలుగు తెరకు కూడా ఆమె పరిచయమే.

నటన మోడలింగ్‌లతో పాటు, ఆమె జర్నలిస్ట్‌గా, టెలివిజన్ యాంకర్‌గా, ప్రొడ్యూసర్ గా కూడా పనిచేసింది.[3] ముప్పోజుదుమ్ ఉన్ కర్పనైగల్ (2012), సార్పట్ట పరంపర (2023)లతో సహా పలు చిత్రాలలో ఆమె తల్లి పాత్రలు పోషించింది.[4]

కెరీర్[మార్చు]

తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన అనుపమ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో నివసించింది. ఆమె టెలివిజన్ రంగంలో యాంకర్, విజువలైజర్, జర్నలిస్ట్, నిర్మాతగా కెరీర్ లో ఎక్కువ సమయం పనిచేసింది. తర్వాత ఆమె మోడలింగ్, నటన వైపు వచ్చింది. షారుఖ్ ఖాన్, మోహన్ లాల్ వంటి అగ్ర హీరోలతో పాటు 300 కంటే ఎక్కువ వాణిజ్య ప్రకటనలలో ఆమె నటించింది. ఆమె కభీ ఆయే నా జుదాయి, మిషన్ ఫతే, షక లక బూమ్ బూమ్ ది మ్యాజిక్ మేకప్ బాక్స్ వంటి అనేక హిందీ భాషా టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించింది. 2010లో, ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ఇష్కియాలో అతిధి పాత్ర పోషించింది.[5]

తెలుగులో ఆమె నటించిన చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Flickr: anupama kumar". Flickr. Retrieved 2009-09-26.
  2. Raghavan, Nikhil (2011-09-03). "itsy Bitsy". The Hindu. Chennai, India.
  3. "Multi-Faceted Modelist Anupama Kumar". sivajitv.com. Archived from the original on 7 September 2009. Retrieved 2009-09-26.
  4. Desk, Roktim Rajpal,DH Web. "There is variety but can't say that I'm getting more work now: Anupama Kumar on life after 'Sarpatta Parambarai'". Deccan Herald.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  5. "A cameo impresses". The Hindu. Chennai, India. 2009-08-28. Archived from the original on 2009-08-29. Retrieved 2009-09-26.

బాహ్య లంకెలు[మార్చు]