అనుభా గుప్తా
అనుభా గుప్తా | |
---|---|
జననం | 1930 దినాజ్‌పూర్, బంగ్లాదేశ్ |
మరణం | 1972 జనవరి 14 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1948–1960 |
అనుభా గుప్తా (1930 - 1972 జనవరి 14) బెంగాలీ సినిమా నటి. హంసులీ బ్యాంకర్ ఉపకథ సినిమాలో నటించి 26వ బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్టు అవార్డులలో ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది.
జననం, విద్య
[మార్చు]అనుభా గుప్తా 1930లో బంగ్లాదేశ్ లోని దినాజ్‌పూర్‌లో జన్మించింది. ప్యారీ చరణ్ బాలికల పాఠశాల, శాంతినికేతన్‌లలో చదువుకుంది.
సినిమారంగం
[మార్చు]అనుభా గుప్తాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్, మ్యూజిక్‌పై ఆసక్తి ఉండేది. సంగీత దర్శకుడు రాబిన్ ఛటర్జీ, అనుభాను సినిమారంగానికి పరిచయం చేసినప్పుడు బెంగాలీ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. 1949లో విడుదలైన సమర్పన్ సినిమాలో తొలిసారిగా నటించింది. సినిమాలతోపాటు నాటకరంగంలోనూ నటించింది. కబీ, రత్న డిప్, చంపదంగర్ బౌ, హంసులీ బ్యాంకర్ ఉపోకథ మొదలైన సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందిన అనుభా, 5 ఏళ్ళకాలంలోనే బెంగాలీ నటీమణులలో అగ్రస్థానానికి చేరుకుంది.[1] సత్యజిత్ రే తీసిన అభిజన్, కాంచనజంఘ కూడా నటించింది.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అనుభాకు ఫుట్‌బాల్ క్రీడాకారుడు అనిల్ దేతో వివాహం జరిగింది. వారిద్దరు విడిపోయాక ప్రముఖ నటుడు రబీ ఘోష్‌తో రెండవ వివాహం జరిగింది.[3][4]
సినిమాలు
[మార్చు]- ఘుమియే అచే గ్రామ్
- అవిజాత్యో
- కబీ
- బామునేర్ మేయే
- రత్న డిప్
- భగవాన్ శ్రీకృష్ణ చైతన్య
- మంత్ర శక్తి
- స్వామి వివేకానంద
- కంకబాటిర్ ఘాట్
- సాహెబ్ బీబీ గోలం
- శేష్ పర్జంత్య
- నాయికా సంగ్బాద్
- హంసులీ బ్యాంకర్ ఉపకథ
- శ్రీ శ్రీ మహాలక్ష్మి పూజ
- ఫోక్ టేల్స్ ఆఫ్ రివర్ బెండ్
- పాలటాక్
- ఛాయా సూర్య
- అలోర్ పిపాసా
- బాలికా బధు
- చంపడంగర్ బౌ
- శంకర్ నారాయణ్ బ్యాంక్
- కాంచన్‌జుంగా
- ఛద్మబేషి
- కలకత్తా 71
- ధన్యే మేయే
- శేష్ పర్బా
- జబాన్
- చితి
- డిబ్రత్రిర్ కబ్యా
- చందా పటాన్
- దత్తా
మరణం
[మార్చు]అనుభా 1972 జనవరి 14న పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Kalyani". Archived from the original on 30 March 2018. Retrieved 20 March 2022.
- ↑ Marie Seton. Portrait of a Director: Satyajit Ray.
- ↑ "Rabi Ghose was extremely simple". The Times of India. Archived from the original on 2 February 2017. Retrieved 20 March 2022.
- ↑ Bijoya Ray. Manik and I: My Life with Satyajit Ray.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనుభా గుప్తా పేజీ