అనుశ్రీ (కన్నడ నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుశ్రీ
జననం (1987-01-25) 1987 జనవరి 25 (వయసు 37)
సూరత్‌కల్, కర్ణాటక, భారతదేశం
విద్యాసంస్థమంగళూరు విశ్వవిద్యాలయం
వృత్తిటెలివిజన్ ప్రెజెంటర్, నటి
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

అనుశ్రీ (జననం 1988 జనవరి 25) భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత. కన్నడ చిత్రాలలో కూడా నటిస్తుంది.[1]

ఆమె కన్నడ టెలివిజన్‌ రంగంలో హోస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించి, సినిమా నటిగా మారింది. ఆమె ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌లలో ఒకరుగా ఎదిగింది. మురళి మీట్ మీరా చిత్రానికి గాను ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆమె కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

జీవితం తొలి దశలో[మార్చు]

ఆమె కర్ణాటకలోని మంగళూరుకు చెందిన సూరత్‌కల్‌లో తుళు మాట్లాడే కుటుంబమైన సంపత్, శశికళ దంపతులకు జన్మించింది.[2] ఆమెకు అభిజీత్ అనే తమ్ముడు ఉన్నాడు. ఆమె చిన్నతనంలో ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లితగ్గరే పెరిగింది.[3] ఆమె తన పాఠశాల విద్యను బెంగళూరులోని సెయింట్ థామస్, మంగళూరులోని నారాయణ గురు పాఠశాలలో పూర్తిచేసింది. ఆమె తన ప్రీ-యూనివర్సిటీ విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె టెలివిజన్ షోలను హోస్ట్ చేసే ఆఫర్‌లను పొందడం ప్రారంభించినప్పుడు బెంగళూరుకు తిరిగి వచ్చింది.[4]

కెరీర్[మార్చు]

అనుశ్రీ మంగళూరులో ఉన్న ఒక టెలివిజన్ ఛానెల్‌లోని నమ్మ టీవీలో టెలి అంత్యాక్షరి అనే ఫోన్-ఇన్ మ్యూజిక్ షోలో యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించింది.[5] ఈటీవీ కన్నడ టెలివిజన్ షో డిమండప్పో డిమండులో యాంకర్‌గా ఆమె మంచి ప్రజాదరణ పొందింది. ఆమె బిగ్ బాస్ కన్నడ 1 రియాల్టీ షోలో కూడా పాల్గొంది. ఆమె బిగ్ బాస్ హోమ్‌లో 80 రోజులు పూర్తి చేసుకుంది.

సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్, TV9 ఫిల్మ్ అవార్డ్స్, జీ మ్యూజిక్ అవార్డ్స్, SIIMA అవార్డ్స్, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వంటి అనేక స్టేజ్ షోలను ఆమె హోస్ట్ చేసింది. కామెడీ ఖిలాడిగలు, ట్వంటీ-ట్వంటీ కామెడీ కప్, కునియోన బారా వంటి ప్రముఖ షోలతో ఆలరించింది.

ఆమె బెంకిపట్నతో చలనచిత్రంలోకి ప్రవేశించింది, ఇది ఆమెకు ఉత్తమ తొలి నటిగా NAK మీడియా అచీవ్‌మెంట్ అవార్డును తెచ్చిపెట్టింది.[6] 2011లో, మురళీ మీట్స్ మీరా చిత్రానికి గానూ ఆమె కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా అవార్డును గెలుచుకుంది. ఇమ్రాన్ సర్ధారియా దర్శకత్వం వహించిన ఉప్పు హులీ ఖారా చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.[7]

అవార్డులు[మార్చు]

  • 2011: కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు: ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి (మహిళ): మురళి మీట్ మీరా
  • 2015: జీ కుటుంబ అవార్డ్స్ పాపులర్ యాంకర్
  • 2015: NAK మీడియా అచీవ్‌మెంట్ అవార్డు - ఉత్తమ తొలి నటి : బెంకిపట్న
  • 2016: జీ కుటుంబ అవార్డ్స్ 2016 - ఉత్తమ యాంకర్
  • 2017: జీ కుటుంబ అవార్డ్స్ 2017 - ప్రముఖ యాంకర్
  • 2018: కెంపేగౌడ ప్రశస్తి
  • 2018: జీ కుటుంబ అవార్డ్స్ 2018 - ఫేవరెట్ యాంకర్
  • 2019: జీ కుటుంబ అవార్డ్స్ 2019 - ఫేవరెట్ యాంకర్
  • 2020:జీ కుటుంబ అవార్డ్స్ 2020 - ఫేవరెట్ యాంకర్
  • 2021:జీ కుటుంబ అవార్డ్స్ 2021 - ఫేవరెట్ యాంకర్
  • 2022:జీ కుటుంబ అవార్డ్స్ 2022 - ఫేవరెట్ యాంకర్

మూలాలు[మార్చు]

  1. "'My Focus is to Become a Good Actor, Not the Top Heroine'". Newindianexpress.com. Archived from the original on 2016-08-16. Retrieved 2016-07-24.
  2. "Mangaluru: Kannada anchor, actress Anushree to debut in Tulu film". www.daijiworld.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-05.
  3. Joy, Prathibha (12 September 2015). "'Can't bear the pain of rejection again'". The Times of India. Retrieved 29 March 2017.
  4. "Bubbly girl of small screen to become Dream Girl of silver screen". Newskarnataka.com. 19 June 2013. Archived from the original on 29 March 2017. Retrieved 24 July 2016.
  5. "Mangaluru: Kannada anchor, actress Anushree to debut in Tulu film". daijiworld.com. 22 March 2017. Archived from the original on 29 March 2017. Retrieved 29 March 2017.
  6. "Anushree turns Heroine through 'Benki Patna'". Indiancinemagallery.com. 2013-11-29. Archived from the original on 16 August 2016. Retrieved 2016-07-24.
  7. "Imran Is Happy to Have 3 'Shrees' For Uppu Huli Kara". The New Indian Express. 2016-04-18. Archived from the original on 2016-08-01. Retrieved 2016-07-24.