అను హాసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనూ హాసన్

అను హాసన్ (15 జూలై 1970), ప్రముఖ తమిళ సినీ నటి, టీవీ వ్యాఖ్యాత. 1995న ఇందిరా సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది ఆమె.  ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా  తరువాత కొన్ని తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది  ఆమె. తమిళ ఛానల్ విజయ్ లో కాఫీ విత్ అనూ అనే ప్రముఖుల టాక్ షోకు వ్యాఖ్యాతగా మూడు సీజన్ల పాటు విజయవంతంగా నిర్వహించారు. 

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

5 జూలై 1970న తమిళనాడులో జన్మించింది అను. ఆమె తండ్రి ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు అన్నయ్య. తిరుచిరాపల్లిలోని సెయింట్  జోసెఫ్స్ ఆంగ్లో ఇండియన్ బాలికల ఉన్నత పాఠశలలో చదువుకుంది ఆమె. రాజస్థాన్ లోని బిట్స్, పిలానీలో ఫిజిక్స్, మేనేజ్ మెంట్ లో  ఎం.ఎస్.సి డిగ్రీ చదువుకుంది అను హాసన్.[1][2]   

కెరీర్

[మార్చు]

2000వ సంవత్సరంలో ఆమె టివిలో పని చేయడం మొదలుపెట్టింది అను.[3] చిత్ర బెనర్జీ దివకరుణి రాసిన సిస్టర్ ఆఫ్ మై హార్ట్ నవల ఆధారంగా తమిళంలో అంబుల్లా స్నేహ్గిదియే అనే సీరియల్ లో ఆమె మొదట నటించింది. 

మూలాలు

[మార్చు]
  1. "Sandpaper - The BITSAA Magazine". Sandpaper.bitsaa.org. Retrieved 2013-09-07.
  2. "Metro Plus Madurai / Profiles : Spreading fragrance everywhere". The Hindu. 2006-12-16. Archived from the original on 2007-12-11. Retrieved 2013-09-07.
  3. "Interview with Anu Hasan : Goergo". Goergo.in. Archived from the original on 2013-02-18. Retrieved 2013-09-07.
"https://te.wikipedia.org/w/index.php?title=అను_హాసన్&oldid=3979430" నుండి వెలికితీశారు