అన్నవరప్పాడు (పెరవలి)
అన్నవరప్పాడు | |
— రెవెన్యూయోతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°42′03″N 81°46′41″E / 16.700900°N 81.778193°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | పెరవలి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534331 |
ఎస్.టి.డి కోడ్ |
అన్నవరప్పాడు, పశ్చిమగోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామం. తణుకు, రావుల పాలెం ప్రధానరహదారిపై పెరవలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో కల చిన్నగ్రామం.ఇది 5 వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని ఉంది. ఖండవల్లి, పిట్టలవేమవరం, మల్లేస్వరం గ్రామాలు అన్నవరప్పాడుకు సరిహద్దులు.ఇక్కడ జాతీయ రహదారిని ఆనుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. పుష్కరిణి, వివిధ చిన్నచిన్న ఆలయాలతో కూడుకొని పరిసర గ్రామాలలో అత్యంత ప్రసిద్ధి పొందినది. పవిత్ర గోదావరీ నదీ తీరాన, దండకారణ్య ప్రాంతంలో నెలకొనిఉన్న ఈ ఆలయం, కశ్యప ప్రజాపతి తపమాచరించిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. కశ్యప ప్రజాపతి అభీష్టం మేరకు ఈ ఆలయం నిర్మింపబడినట్లు, పురాణాలు చెబుతున్నాయి. అన్నవరప్పాడు, పిట్టలవేమవరం, మళ్లేశ్వరం, కడింపాడు మొదలగు నాలుగు గ్రామాలకు అన్నవరప్పాడు సెంటర్
గ్రామ పూర్వనామం
[మార్చు]"పులపర్తి నామమున బరగిన గ్రామమా ప్రాంతము రెడ్డిరాజులు పాలనములోనికి వచ్చినపుడది "అన్యమావరము" గ (నేటి అన్నవరప్పాడుగ)" మారింది.
పులుపర్తి గ్రామము నేటి అన్నవరప్పాడు గ్రామమని *"కాటయవేముని అన్యమావర శాసనము" వలన స్పష్టమగుచున్నది.
(*) 1. విశ్వామిత్ర నదీంగ తేష్వ నుమతాభత్రాప్లుతా తజ్జలే గ్రామం నా పులుపత్తిన్ సంజ్ఞ మకరోద్బ్రాతాపిన్ తందిప్రసాతే యదైవాన్యమయా గ్రామః సతమాదిప్రసత్కృతః | తదా ప్రభృతి తన్నామ్నా భువిరుఢోన్యవరః || -- కాటయవేముని అన్యమాపర శాసనము.
(ఆధారం: శ్రీ పంచలింగ క్షేత్ర దర్శనం అనే గ్రంధాన్ని రచించిన గ్రంథ కర్త " చరిత్ర విద్యాధర " తురగా కృష్ణమూర్తి, మార్ఖండేయ మృకండేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఖండవల్లి అనే గ్రంధం)