అన్నే అనసూయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అన్నే అనసూయ సీపీఐ (ఎం) సీనియర్‌ నాయకురాలు, భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[1][2]

జీవిత విశేషాలు[మార్చు]

అన్నే అనసూయ కృష్ణా జిల్లాకు చెందిన ఈడుపుగల్లు గ్రామంలో సుంకర రామచంద్రరావు, కోటమ్మ దంపతుల జన్మించింది. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదివింది. ఆమె తన 13వ ఏటనే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితులయింది. ప్రముఖ నాటక రచయిత, సుంకర సత్యనారాయణ, కృష్ణాజిల్లా కమ్యూనిస్టు నాయకుడు సుంకర వీరభద్రరావు ఆమె సోదరులు. ఆమె తండ్రి, సోదరులు, కుటుంబమంతా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ఆమెలో అభ్యుదయ భావాలను నింపింది. గాంధీజీ వారి ప్రాంతానికి వచ్చినపుడు ఆమె స్వాతంత్ర్యోద్యమ విరాళంగా తన మెడలోని బంగారు గొలుసుని ఇచ్చింది. స్వాత్రంత్య్ర సమర యోధుడు, కమ్యూనిస్టు అయిన అన్నే వెంకటేశ్వరరావుతో ఆమె వివాహం జరిగింది.[3]

ఉద్యమ జీవితం[మార్చు]

ఆమె 1948లో కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధ కాలంలో 3 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపింది. 1950లో అజ్ఞాతంలో కొంతకాలం గడిపింది. ఆమె పిల్లలతో పాటు జైలుకు వెళ్ళింది. 1952లోనే కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేసింది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు సీపీఐ (ఎం) వైపు నిలిచింది. భర్త అన్నే వెంకటేశ్వరరావు కొంతకాలం సీపీఐ (ఎం) కు దూరంగా ఉన్నా అనసూయ మాత్రం కడవరకూ స్థిరంగా నిలిచారు. సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యురాలిగా, ఏలూరు తాలుకా కార్యదర్శిగా పనిచేసింది. 1980-90 మధ్యకాలంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది.

ఐద్వా సీనియర్‌ నేతగా, రాష్ట్ర నాయకులుగా పేరొందారు. అన్నే దంపతులు ఏ కమిటీల్లో స్థానం వద్దని కార్యకర్తలుగా ఉంటూనే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరినీ ఆకర్షించేవారు. కుటుంబం మొత్తాన్ని పార్టీ సానుభూతిపరులుగా మార్చడం వీరి ప్రత్యేకత. నిరంతరం ప్రజా ఉద్యమాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూనే ఉన్నారు. పాత ఏలూరు, చింతలపూడి తాలూకాల్లో నిర్వహించిన భూపోరాటాల్లో వేలాది ఎకరాలు సాధించి, పేదలకు దక్కేలా చేసిన నేతల్లో వీరు ముఖ్యులు.

సమరశీల కార్యకర్తగా అనసూయ పేరొందారు. ఏపీ రైతుసంఘం, ఐద్వా జిల్లా కార్యాలయం, అన్నే భవన్‌ నిర్మాణానికి పెద్దఎత్తున సహకారం అందించింది.[4]

ఆమె 2017, డిసెంబర్ 2ఏలూరులో శాంతినగర్‌లోని స్వగృహం వద్ద మరణిందించి.

మూలాలు[మార్చు]

  1. "CPM leader passes away - Thehansindia | DailyHunt". DailyHunt. Retrieved 2018-04-14.
  2. "Women resent delay in quota bill passage". The Hindu. 2007-03-09. ISSN 0971-751X. Retrieved 2018-04-14.
  3. "అన్నే అనసూయ ఇక లేరు". Cite web requires |website= (help)
  4. Stories, Prajasakti News. "అన్నే అనసూయ అస్తమయం". Prajasakti. Retrieved 2018-04-14.