అన్షు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్షు
జననం
అన్షు

వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002 – 2005
బంధువులుసచిన్ (భర్త)

అన్షు తెలుగు చలనచిత్ర నటీమణి. మన్మధుడు సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన అన్షు రాఘవేంద్ర, మిస్సమ్మ వంటి చిత్రాలలో నటించింది.

జననం

[మార్చు]

అన్షు లండన్ లో జన్మించింది. తల్లిదండ్రుల సొంత ఊరు ఢిల్లీ. ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు.

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

సినిమా చాయగ్రహుడు కబీర్ లాల్ అన్షుకు కుటుంబ మిత్రుడు. నటనలో అసక్తి ఉన్న అన్షు ఫోటోలను కొన్నిటిని విజయ భాస్కర్ గారికి చూపించడం జరిగింది. అలా మన్మధుడు సినిమా ఎంపికైంది. ఆ తరువాత ప్రభాస్ హీరోగా నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ పాత్రను, మిస్సమ్మ సినిమాలో అతిధి పాత్రలో నటించింది. కొన్ని కన్నడ చిత్రాలలో కూడా నటించింది.

వివాహం - పిల్లలు

[మార్చు]

లండన్ లోని నివసిస్తున్న సచిన్ అనే వ్యక్తిని అన్షు పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప.[1]

నటించిన చిత్రాల జాబితా

[మార్చు]

నటిగా

[మార్చు]
  1. పత్తర్ దిల్ (బాలనటి) - 1985
  2. మన్మధుడు - 2002 [2]
  3. రాఘవేంద్ర - 2002[3]
  4. మిస్సమ్మ - 2003
  5. సిటీ ఆఫ్ గాడ్ - ముంబై 1982: ఎక్ ఆంకహీ కహానీ - 2010
  6. బేవాజా - 2017

కాస్ట్యూమ్ డిజైనర్ గా

[మార్చు]
  1. ఓం జై జగదీష్ - 2002
  2. ఉష్క్ విష్క్ - 2003

మూలాలు

[మార్చు]
  1. తెలుగు న్యూస్ స్టాంప్. "నాగ్ తో మన్మధుడు సినిమా చేసిన అన్షు గుర్తుందా? ఇప్పుడెలా ఉందో తెలుసా?". telugu.newsstamp.com. Retrieved 19 May 2017.[permanent dead link]
  2. Sakshi (6 June 2021). "'మన్మథుడు' హీరోయిన్‌ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?". Sakshi. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
  3. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=అన్షు&oldid=3213952" నుండి వెలికితీశారు