అప్పారావు షేట్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎమ్మెల్యే
పదవీ కాలం
1952 - 1962
ముందు తొలి ఎన్నికలు
తరువాత ఆర్.దేశ్‌పాండే
నియోజకవర్గం నారాయణ్‌ఖేడ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రేసు పార్టీ

అప్పారావు షేట్కర్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు.

నారాయణ్‌ఖేడ్ ప్రాంతంలోని కన్నడ లింగాయత్ సామాజికవర్గంలో జన్మించిన అప్పారావు న్యాయవిద్య అభ్యసించి, న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు.[1]

ఆయన హైదరాబాదు రాష్ట్రంలో 1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తొలిసారి నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తిరిగి 1957లో సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అదే నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి రాంచందర్‌రావు దేశ్‌పాండే చేతిలో ఓడిపోయాడు.[1][2]

నారాయణ్‌ఖేడ్ ప్రాంత రాజకీయాల్లో షేట్కర్ కుటుంబం కీలక పాత్ర పోషించింది. అప్పారావు షేట్కర్ తర్వాత ఈయన కుటుంబానికి చెందిన శివరావు షెట్కర్ నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మూడుసార్లు ఎన్నికయ్యాడు. శివరావు షెట్కర్ కుమారుడు సురేష్ కుమార్ షెట్కర్ నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఒకసారి శాసనసభ్యుడిగా, రెండుసార్లు జహీరాబాద్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Eenadu (15 November 2023). "అసెంబ్లీ బాట పట్టారిలా." Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
  2. "జహీరాబాద్ సీటు షేట్కర్‌దే". ఈనాడు. 9 March 2024. Retrieved 22 September 2024.
  3. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.