Jump to content

అప్పిచ్చువాడు వైద్యుడు

వికీపీడియా నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
పొడుపు కథలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు


సుమతీశతకం సృష్టించిన జాతీయాలు, సామెతల్లో ఇది ఒకటి. శతకం చెప్పిన రూపం మారిపోయి దీనికి మరో అర్థం తోడవుతున్న సమయమిది. పద్యమిలా ఉంది.

పద్యం

[మార్చు]

అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
చొప్పడిన, యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ

అర్థం

[మార్చు]

పై పద్యానికి అర్థం తెలిసిపోతూనే ఉంది. అప్పిచ్చేవాడు, వైద్యుడు, సమృద్ధిగా ఎప్పుడూ నీటితో పారే ఏరూ, ద్విజుడు, మొదలైనవాళ్ళుండే ఊళ్ళోనే ఉండాలి. అవి లేని వాళ్ళుండే ఊళ్ళో ఉండరాదు.[1] అని అర్థం.

వివరణ : ఎలాంటి ఊరిలో మనం నివశించాలీ ఎక్కడ వుండకూడదూ అనే విషయాన్ని గురించి అప్పిచ్చువాడు ఒకరికి అవసరం అయినప్పుడు దయ జాలి గుణం వుంటే అప్పిచ్చే మనిషి వుంటాడు. అలాగే అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం చెయ్యడానికి ఒక వైద్యుడు, ఎల్లప్పుడూ నిరంతరం పారే ఏరూ, ద్విజుడు అంటే రెండవ జన్మ తీసుకున్న వాడు అంటే ఉపనయనము చేసుకుని బ్రాహ్మణత్వము సిద్దింపచేసుకున్న విద్యావంతుడైన బ్రాహ్మణుడు చొప్పడిన అంటే వీరు నివశిస్తున్న యూర నుండుము అంటే ఊరులో వుండుము. వీరు లేని ఊరిలో వుండవద్దు అని చెప్తున్నాడు సుమతీ శతకమును చెప్పిన కవి.

వాడుకలో సామెత

[మార్చు]

అయితే, ప్రస్తుతం మొదటి పాదానికి అర్థం మారిపోతూంది. తప్పు తప్పుగా చదువుతూ అప్పిచ్చువాడువైద్యుడు అంటూ కలిపి చదివేస్తూ ... వైద్యుడంటే అప్పిచ్చేవాడనే అర్థంలో కొందరు వాడుతున్నారు. పద్యం తెలిసినవారు శ్లేషార్థంలో వాడుతుంటే.., పూర్తి పద్యం తెలియనివారు వైద్యుడికి అప్పిచ్చే బాధ్యత కూడా ఉంది కామోసనీ, అప్పిచ్చేవాడు వైద్యుడితో సమానం కాబోలనీ, వైద్యుడికి అప్పిచ్చే బాధ్యతను ఎందుకు పెట్టారబ్బా మనవాళ్ళు..? అనీ అనుకుంటూ ఉంటారు.

మూలాలు

[మార్చు]
  1. "అప్పిచ్చువాడు వైద్యుడు". www.telugunris.com. Archived from the original on 2020-10-28.