నీతివాక్యాలు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (July 2021) |
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
పొడుపు కథలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
- అతి సర్వత్రా వర్జయేత్. (అతిగా చేయడం అన్నిచోట్లా విడువతగినది) [1]
- అతి వినయం ధూర్త లక్షణం.
- ఆలస్యం అమృతం విషం.
- ఆడి తప్పవద్దు*
- అప్పు చేయ వద్దు*
- కలసిఉంటే కలదు సుఖం.
- నిదానమే ప్రదానం.
- నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష : నీవు ఎవరికీ చెడు విద్యలు నేర్పించకు. అవతలి వాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. నీటిలో నీ ముఖం ప్రతిబింబించినట్టుగా నీవు ఇతరులకి నేర్పిన విద్య నీ మీద కూడా ప్రతిఫలించ గలదు.
- నోరు మంచిదైదే ఊరు మంచిదవుతుంది
- పెద్దల మాట చద్దికూటి మూట.
- పాలుత్రాగి పరుగెత్తేకంటే నీళ్ళు త్రాగి నిలబడటం మేలు.[1]
- పేదల మాటాలు పెదవికి చేటు.
- పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాటకు బానిస నీవు.
- మంచి పనికి దుర్ముహుర్తంలేదు, చెడ్డ పనికి సుమూహుర్తం లేదు.
- పోరు నష్టం పొందు లాభం[1]
- ఋణశేషం శత్రుశేషం ప్రమాదం.
- వినదగు నెవ్వరు చెప్పిన:మంచి మాట ఎవరు చెప్పిన వినవచ్చును. దీనికి వయసుతో సంభందం లేదు.[1]