Jump to content

అఫీఫ్ హుస్సేన్

వికీపీడియా నుండి
అఫీఫ్ హుస్సేన్ ధ్రుబో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అఫీఫ్ హుస్సేన్ ధ్రుబో
పుట్టిన తేదీ (1999-09-22) 1999 సెప్టెంబరు 22 (వయసు 25)
ఖుల్నా, బంగ్లాదేశ్
మారుపేరుధ్రుబో[1]
ఎత్తు5 అ. 7 అం. (1.70 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రBatting ఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 132)2020 మార్చి 6 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 6 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.18
తొలి T20I (క్యాప్ 58)2018 ఫిబ్రవరి 15 - శ్రీలంక తో
చివరి T20I2023 3 May 2023 - ఇంగ్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.88 (previously 18)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017ఖుల్నా డివిజను
2016రాజషాహీ కింగ్స్
2017ఖుల్నా టైటన్స్
2019సిల్హెట్ సిక్సర్స్ 
2019–2020Rajshahi Royals
2022Jaffna Kings
2023Chattogram Challengers
కెరీర్ గణాంకాలు
పోటీ ODI T20I
మ్యాచ్‌లు 22 60
చేసిన పరుగులు 495 1,003
బ్యాటింగు సగటు 35.35 21.34
100లు/50లు 0/3 0/3
అత్యధిక స్కోరు 93* 77*
వేసిన బంతులు 82 150
వికెట్లు 3 9
బౌలింగు సగటు 22.66 23.22
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/0 2/9
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 16/–
మూలం: ESPN Cricinfo, 11 March 2023

అఫీఫ్ హుస్సేన్ ధ్రుబో (జననం 1999 సెప్టెంబరు 22) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. [2] 2018 ఫిబ్రవరిలో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో అతను ఎంపికయ్యాడు. [3] 2018 ఫిబ్రవరి 15న శ్రీలంకపై తన తొలి T20I ఆడాడు.[4]

జీవితం తొలి దశలో

[మార్చు]

అఫీఫ్ బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ అయిన బంగ్లాదేశ్ క్రీడా శిఖా ప్రొతిష్ఠాన్ విద్యార్థి. షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, నాసిర్ హుస్సేన్ మొదలైన వారు అక్కడి నుండి వచ్చినవారే. అతను U-19 స్థాయిలో పెద్ద హిట్టర్‌గా పేరు పొందాడు. కోచ్‌లు అతనిని తమీమ్ ఇక్బాల్‌తో సమానంగా లెక్కగట్టారు. [5]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

అఫీఫ్ 2018లో శ్రీలంకకు వ్యతిరేకంగా మొదటి T20I ఆడాడు. అయితే అతని రెండవ బంతికి డకౌటయ్యాడు. బౌలింగులో 2 ఓవర్లలో 1/26 సాధించాడు. దాంతో తదుపరి మ్యాచ్‌కు అతన్ని తీసేసారు. [3] 2019-20 బంగ్లాదేశ్ ట్రై-నేషన్ సిరీస్ కోసం అతన్ని జట్టులోకి తీసుకున్నారు. జింబాబ్వేతో జరిగిన మొదటి మ్యాచ్‌లో, బంగ్లాదేశ్ 60 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి, గెలవడానికి ఇంకా 85 పరుగులు చేయాల్సి ఉండి, ఓటమి అంచున ఉంది. అఫీఫ్ 8 వ నంబరులో బ్యాటింగ్‌కు వచ్చి, 26 బంతుల్లో 52 పరుగులు చేసి, మొసాద్దెక్ హుస్సేన్‌తో కలిసి కీలకమైన 82 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. అతను మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. [6]

2019 నవంబరులో, బంగ్లాదేశ్‌లో జరిగిన 2019 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో అఫీఫ్ ఎంపికయ్యాడు. [7] అదే నెలలో, 2019 దక్షిణాసియా క్రీడలలో క్రికెట్ టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [8] ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. [9]

2020 ఫిబ్రవరిలో అఫీఫ్, జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో ఎంపికై,[10] 2020 మార్చి 6న జింబాబ్వేపై తన తొలి వన్‌డే ఆడాడు.[11] 2021 సెప్టెంబరులో 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [12]

షఫీఫ్ 2022 ఫిబ్రవరిలో చటోగ్రామ్‌లో 93* పరుగులు చేసి, ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ప్రసిద్ధ విజయం సాధించడంలో సహాయం చేశాడు. ఇది వన్‌డే క్రికెట్‌లో ఏ బంగ్లాదేశ్ బ్యాటరైనా 7 అంతకంటే దిగువ స్థానంలో చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. [13]

2022 ఆగస్టులో, జింబాబ్వేతో జరిగిన చివరి వన్‌డే లో అఫీఫ్ 81 బంతుల్లో 85 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ 256/9 తో లక్ష్యాన్ని చేరి, విజయం సాధించింది. అతను "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును గెలుచుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Afif Hossain: The boy wonder from Bangladesh". The Business Standard. 24 March 2020. Retrieved 30 January 2021.
  2. "Afif Hossain". ESPN Cricinfo. Retrieved 11 February 2017.
  3. 3.0 3.1 "Bangladesh pick five uncapped players for Sri Lanka T20I". ESPN Cricinfo. 10 February 2018. Retrieved 10 February 2018.
  4. "1st T20I (N), Sri Lanka Tour of Bangladesh at Dhaka, Feb 15 2018". ESPN Cricinfo. 15 February 2018. Retrieved 15 February 2018.
  5. "Who is Afif Hossain?". ESPN Cricinfo. Retrieved 3 December 2016.
  6. "Young Afif Hossain gate crashes Zimbabwe's party". ESPN Cricinfo. 13 September 2019.
  7. "Media Release : Bangladesh squad for Emerging Teams Asia Cup 2019 announced". Bangladesh Cricket Board. Retrieved 11 November 2019.
  8. "Media Release : Bangladesh U23 Squad for 13th South Asian Game Announced". Bangladesh Cricket Board. Retrieved 30 November 2019.
  9. "South Asian Games: Bangladesh secure gold in men's cricket". bdnews24.com. Retrieved 9 December 2019.
  10. "Afif Hossain and Mohammad Naim break into Bangladesh ODI squad". ESPN Cricinfo. Retrieved 23 February 2020.
  11. "3rd ODI (D/N), Zimbabwe tour of Bangladesh at Sylhet, Mar 6 2020". ESPN Cricinfo. Retrieved 6 March 2020.
  12. "No surprises as Bangladesh name Mahmudullah-led squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  13. Bandarupalli, Sampath (23 January 2022). "Stats - Afif and Mehidy's 79.45% contribution to Bangladesh's cause". ESPN Cricinfo.