అబ్దుల్ ఆజాద్ ఖాన్ పఠాన్
శ్రీ అబ్దుల్ ఆజాద్ ఖాన్ పఠాన్
బాల్యము
[మార్చు]అబ్దుల్ ఆజాద్ ఖాన్ పఠాన్ ప్రకాశం జిల్లా రాచర్ల గ్రామంలో 1971 జూన్ ఒకటిన జన్మించారు. తల్లితండ్రులు: ఇమాంబి, మహబూబ్ ఖాన్. చదువు: బి.ఎ(తెలుగు).,విద్వాన్ (హింది).
ఉద్యోగము
[మార్చు]ప్రజాశక్తి దినపత్రికకు విలేఖరిగా పనిచేస్తున్నారు.
రచనా వ్యాసంగము
[మార్చు]2003లో ప్రచురితమయిన 'ఓ గులాబీ ప్రేమగీతం' కవితతో సాహిత్య వ్యాసంగం ఆరంభం చేశారు. ఇతని కవితలు, వ్యాసాలు పలు పత్రికల లో ప్రచురితం అయ్యాయి. పలు సత్కారాలు పొందారు. సాహిత్య-సాంస్కతిక కార్యక్రమాల ఏర్పాటు పట్ల ఆసక్తి గలవారు. మతసామరస్యం ప్రధాన ప్రాతిపదికగా చాల సర్వమత సమ్మేళనాల నిర్వహణ చేపట్టి మత సామరస్యానికి తన వంతు ప్రాత్ర పోషించారు. ఈయనకు సామాజిక, రాజకీయాంశాల మీద రచనలు చేయడం ఇష్టం.
మూలాలు
[మార్చు]- సయ్యద్ నశీర్ అహమ్మద్ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము. పుట 29
అక్షరశిల్పులుగ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010
ప్రచురణకర్త-- ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్
చిరునామా వినుకొండ - 522647. పుట 29