అబ్దుల్ రషీద్ మహమ్మద్
- అబ్దుల్ రషీద్ మహమ్మద్
బాల్యము
[మార్చు]అబ్దుల్ రషీద్ మహమ్మద్ వరంగల్ జిల్లా దేశాయిపేటలో 1952 ఏప్రిల్ 3 న జన్మించారు. వీరితల్లితండ్రులు: సారాబి, మహమ్మద్ అబ్దుల్ సత్తార్. కలంపేరు: అబ్దుర్రషీద్. చదువు: 5వ తరగతి. వ్యాపకం: అధ్యాయనం, రచన, ప్రచురణ, ప్రసంగాలు.
రచనా వ్యాసంగము
[మార్చు]'దేశం ప్రమాకరమైన దిశ-మేధావి వర్గం బాధ్యాతలు' అను ఉర్దూ నుండి తెలుగులోకి అనువదించిన తొలి గ్రంథం 1989లో వెలువడింది. అప్పనుండి రచనా వ్యాసంగంలో పూర్తిగా నిమగ్నం. రాష్ట్రంలోని వివిధ పత్రికలలో ధార్మిక వ్యాసాలు, కవితలు, విశ్లేషణలు ప్రచురితం. సాక్షి దినపత్రికలో 'ఇస్లాం సందేశం' కాలమ్ నిర్వహణ చేశారు.
స్వతంత్ర రచనలు
[మార్చు]వీరి స్వతంత్ర రచనలు
1.జిహద్,
2. అబద్దా ప్రవక్త మీర్జాగులాం అహ్మద్ ఖాదియాని.
ఈ గ్రంథాలలో 'జిహాద్' మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు అనువాదాలు:
1. భారతీయ సమాజ సంస్కరణకు సమాయత్తమవండి,
2. సర్వలోక మహోపకారి,
3. విశ్వమానవ ప్రేమ సౌభ్రాతృత్వాలు,
4. మీరు ఇస్లాం అధ్యాయనం ఎందుకు చేయాలి?,
5. ప్రియమైన అమ్మకు,
6. ఇస్లాం సందేశం,
7.అధార్మ సంపాదనకు దూరం,
8. యుగ పురుషుడు సయ్యద్ మౌదూది,
9. నమాజు పుస్తకం,
10. మీసొత్తు మీపరం,
11. ఇస్లాం ధర్మనియమాలు (ఈ పుస్తకం 2009 వరకు లక్షా నలభైవేల కాపీల ముద్రణ జరిగింది),
12. దారూద్ శుభాలు,
13. ఖుర్‌ఆన్ దై గ్రంథం,
14. ఖుర్‌అన్ బోధన వాచకం,
15. ఖుర్‌ఆన్ వాచకం,
16.లక్ష్యం వైపుకు.
వంటి అనే పుస్తకాలు ప్రచురితమయ్యాయి. లక్ష్యం ఇస్లాంపట్ల ఉన్న అపోహలను దూరంచేయడం.
మూలాలు
[మార్చు]అబ్దుల్ రషీద్ మహమ్మద్ .....అబ్దుల్ రజాక్, అక్షరశిల్పులు అనుగ్రంథము, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త ఆజాద్ హౌస్ ఆఫ్ పబ్లికేషన్స్, చిరునామా వినుకొండ - 522647 పుట 36