Jump to content

అభిషేక్ జైన్

వికీపీడియా నుండి
అభిషేక్ జైన్
అభిషేక్ జైన్ (2016)
జననం (1986-08-03) 1986 ఆగస్టు 3 (వయసు 38)
విద్యాసంస్థవిస్లింగ్ వుడ్స్
వృత్తిదర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుం
సినీమ్యాన్ ప్రొడక్షన్స్‌
గుర్తించదగిన సేవలు
కెవి రైట్ జైష్
బే యార్
రాంగ్ సైడ్ రాజు
బంధువులునయన్ జైన్ (సోదరుడు)

అభిషేక్ జైన్ గుజరాత్ కు చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత. కెవి రైట్ జైష్, బే యార్, రాంగ్ సైడ్ రాజు వంటి ప్రసిద్ధి చెందిన గుజరాతీ సినిమాలు తీసిన అభిషేక్, 2021లో హమ్ దో హమారే దో అనే సినిమాతో హిందీ సినిమారంగంలోకి అరంగేట్రం చేసాడు.

జననం, విద్య

[మార్చు]

అభిషేక్ జైన్ 1986, ఆగస్టు 3న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలోని మార్వాడీ జైన కుటుంబంలో జన్మించాడు.[1] బికె మజుందార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుండి బిబిఏ డిగ్రీని పొందాడు. 2006లో అహ్మదాబాద్ విశ్వవిద్యాలయంలో భాగమయ్యాడు, 2008లో విస్లింగ్ వుడ్స్ నుండి ఫిల్మ్ మేకింగ్‌లో పట్టా పొందాడు.

సినిమారంగం

[మార్చు]

విస్లింగ్ వుడ్స్‌లో కోర్సు పూర్తి చేసి, సంజయ్ లీలా భన్సాలీ, సుభాష్ ఘయ్‌ తీసిన గుజారిష్, సావరియా, యువరాజ్‌ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత, జైన్ రేడియో మిర్చిలో రేడియో జాకీగా పని చేయడం ప్రారంభించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మిఖిల్ ముసలే, అనీష్ షా తదితరులను అభిషేక్ కలిశాడు. వారంతా కలిసి 2010లో సినీమ్యాన్ ప్రొడక్షన్స్‌ను స్థాపించారు.[2] కెవి రైట్ జైష్‌ అనే మొదటి సినిమాను గుజరాతీ భాషలో చేసాడు.[3][4] కెవి రైట్ జైష్ విజయవంతమయింది. గుజరాతీ ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా అతనికి ట్రెండ్ సెట్టర్ అవార్డు కూడా లభించింది.[5] ఆ తర్వాత బే యార్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందకోవడంతోపాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.[6] 2016, ఫిబ్రవరిలో అభిషేక్ జైన్, సినీమ్యాన్ ప్రొడక్షన్స్ మూడు గుజరాతీ చిత్రాలను ఫాంటమ్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తుందని, వాటిలో ఒకదానికి అభిషేక్ స్వయంగా దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు.[7] సినీమ్యాన్ ప్రొడక్షన్స్, ఫాంటమ్ ఫిల్మ్‌ల సంయుక్త బ్యానర్‌పై విడుదలైన మొదటి సినిమా రాంగ్ సైడ్ రాజుకు, సినీమ్యాన్ ప్రొడక్షన్స్ సహ వ్యవస్థాపకుడు మిఖిల్ ముసలే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో గుజరాతీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.

2019 ఏప్రిల్ లో హిట్ కన్నడ సినిమా కిరిక్ పార్టీకి హిందీ రీమేక్‌ చేయడానికి ముందుకు వచ్చాడు, కానీ తరువాత ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. 2021లో హమ్ దో హమారే దో అనే హిందీ కామెడీ సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[8]

సినిమాలు

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత రచయిత భాష ఇతర వివరాలు
2012 కెవి రైట్ జైష్ Yes Yes Yes గుజరాతీ
2014 బే యార్ Yes Yes గుజరాతీ
2016 రాంగ్ సైడ్ రాజు Yes గుజరాతీ
2021 హమ్ దో హమారే దో Yes story హిందీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది[8]
సహాయ దర్శకుడు
సంవత్సరం సినిమా
2007 సావరియా
2008 యువరాజ్
2010 గుజారిష్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సిరీస్ సీజన్ దర్శకుడు నిర్మాత భాష నెట్‌వర్క్/ప్లాట్‌ఫారమ్ ఇతర వివరాలు
2021 విఠల్ టీడీ 1 Yes Yes గుజరాతీ ఓహో గుజరాతీ వెబ్ సిరీస్
2021 రివర్ ఫ్రంట్ కథలు 1 Yes Yes గుజరాతీ ఓహో గుజరాతీ ఎపిసోడ్: వాత్ రాత్ మాన్
2022 మిస్సింగ్ 1 Yes Yes గుజరాతీ ఓహో గుజరాతీ వెబ్ సిరీస్

పుస్తకాలు

[మార్చు]

2015 జూన్ లో ఆ తో జస్ట్ వాట్ ఛే... అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది తన మొదటి రెండు పట్టణ గుజరాతీ సినిమాలను తీస్తున్నప్పుడు తనకు కలిగిన అనుభవాలపై రాసిన పుస్తకం. 

అవార్డులు

[మార్చు]
సినిమా అవార్డులు వర్గం
కెవి రైట్ జైష్ 2012 బిగ్ గుజరాతీ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు ఉత్తమ దర్శకుడు[9]
12వ వార్షిక ట్రాన్స్‌మీడియా గుజరాతీ స్క్రీన్ & స్టేజ్ అవార్డులు ఉత్తమ దర్శకుడు[10]
ఉత్తమ కథ
బే యార్ 14వ వార్షిక ట్రాన్స్‌మీడియా గుజరాతీ స్క్రీన్ & స్టేజ్ అవార్డులు ఉత్తమ దర్శకుడు[11]
రాంగ్ సైడ్ రాజు 14వ వార్షిక ట్రాన్స్‌మీడియా గుజరాతీ స్క్రీన్ & స్టేజ్ అవార్డులు ఉత్తమ చిత్రం

మూలాలు

[మార్చు]
  1. "'કેવી રીતે જઈશ' અને 'બે યાર'ના સર્જક અભિષેક જૈન કહે છે...એ ઘટનાએ જ મારી ગુજરાતી ફિલ્મ બનાવવાની ધગશને વધુ પ્રગટાવી". 2 May 2015. Archived from the original on September 24, 2015. Retrieved 2023-07-15.
  2. "સેટ થઈ ટ્યૂનિંગ બની ગયું સિનેમેન" [Tuning was done, it became CineMan]. Divya Bhaskar. 25 February 2010.
  3. "'કેવી રીતે જઈશ' : યે હુઈ ન બાત!" ["Kevi Rite Jaish" - Yeh hui naa baat!].
  4. "Whistling Woods' graduate creates wave at box-office". Archived from the original on 29 November 2014. Retrieved 2023-07-15.
  5. Hina Nainani (30 April 2013). "Gujarati director dubbed a "trend setter"".
  6. "Return Of The Native". Box Office India : India’s premier film trade magazine. 2015-01-10. Archived from the original on 16 July 2015. Retrieved 2023-07-15.
  7. "Cineman and Phantom Films to co-produce three Gujarati films". Indian Express. 11 February 2016.
  8. 8.0 8.1 "Dinesh Vijan announces new comedy film with Rajkummar Rao and Kriti Sanon". India Today. 19 February 2021. Retrieved 2023-07-15.
  9. ""Kevi Rite Jaish" covered in award also". 14 July 2012.
  10. Hina Nainani (12 Mar 2013). "'Kevi Rite Jaish' showed the way!". Daily News and Analysis. Archived from the original on 14 July 2015. Retrieved 2023-07-15.
  11. Shruti Jambekar (1 March 2015). "Bey Yaar bags nine awards". Times of India.

బయటి లింకులు

[మార్చు]