Jump to content

అమన్ అరోరా

వికీపీడియా నుండి
అమన్ అరోరా
అమన్ అరోరా


ఐ & పీఆర్, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి శాఖ

ఎమ్మెల్యే [1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
మార్చి 2017
ముందు పార్మిందర్ సింగ్ దీండ్సా
నియోజకవర్గం సునం

ఆప్ పంజాబ్ కో - కన్వీనర్
పదవీ కాలం
10 మే 2017 – 17 మార్చి 2018
తరువాత బల్బీర్ సింగ్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
31 జనవరి 2019

వ్యక్తిగత వివరాలు

జననం (1974-08-12) 1974 ఆగస్టు 12 (వయసు 50)
సునం, పంజాబ్, భారతదేశం
సంతానం 2
పూర్వ విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్

అమన్ అరోరా పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సునం శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2022 జూలై 4న భగవంత్ మాన్ మంత్రివర్గంలో ఐ & పీఆర్, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

అమన్ అరోరా తన తండ్రి మాజీ మంత్రి భగవాన్ దాస్ అరోరా అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2007, 2012లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన అనంతరం 2016లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి[4] 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సునం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అమన్ అరోరా 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి భగవంత్ మాన్ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, ఐ & పీఆర్, పునరుత్పాదక శక్తి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Members". www.punjabassembly.nic.in.
  2. Andhra Jyothy (3 July 2022). "మంత్రివర్గ విస్తరణ ఖరారు.. కొత్తగా ఐదుగురికి చోటు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  3. Suryaa (4 July 2022). "ఐదుగురు మంత్రులతో మంత్రివర్గాన్ని విస్తరించిన పంజాబ్ సీఎం మాన్" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  4. Hindustan Times (10 January 2016). "Congress' Aman Arora formally joins Aam Aadami Party" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  5. The Times of India (5 July 2022). "Newly inducted ministers allotted portfolios, Aman Arora gets Urban Development". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.