అమరావతి కథా సంగ్రహం 51-75

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూరు కథలు అమరావతి కథలు. రచన సత్యం శంకరమంచి ఈ నూరు కథల్నీ ఆంధ్రజ్యోతి వార పత్రిక వారు రెండు సంవత్సరాలపాటు 1975-77 మధ్య ధారావాహికంగా వేశారు. కథలన్నీ కూడా మానవత్వపు విలువలను ఎత్తి చూపటమేకాకుండా , సామాజిక, వ్యక్తిగత బలహీనతలను ఎండగట్టుతూ ఉంటాయి. ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.

అమరావతి కథలు వ్యాసంలో ఈ పుస్తకం గురించిన వివరాలు,అమరావతి కథల జాబితా ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క కథ గురించి మరిన్ని విశేషాలు నాలుగు వేరు వేరు వ్యాసాలలో పొందుపరచబడ్డాయి .

అమరావతి కథలు 51 నుండి 75 వరకు[మార్చు]

51.దొంగలో? దొరలో?[మార్చు]

  • ముఖ్య పాత్రలు-గొర్రెల కాపరి రంగయ్య,అమరయ్య, దొంగలు
  • బాపు బొమ్మ-ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసినట్టు దొంగాడి పాగాలో రాజుగారి బాకుని చిత్రించారు బాపు. కళ్ళకు గంతలతో, పెద్ద పెద్ద మీసాలతో, తీవ్రంగా చూస్తున్న మనిషి ముఖం, అతని తలపాగాలో ఒక బాకు.ఊరికి న్యాయం చెప్పవలసినవాడే అన్యాంయం చేస్తే, ఆ అన్యాయాన్ని సరిచేసిన దోంగలోని న్యాయ గుణాన్ని సూచిస్తున్నట్టు రాజుగారి బాకు ఆ దొంగ తలపాగాకు అభరణం గా వెయ్యటం బాపు చమత్కారం.
  • కథ-ఊళ్ళో దోంగలు పడబోతున్నారన్నవిషయాన్ని చేరవేసిన గొర్రెల కాపరి రంగయ్యకు జరిగిన అన్యాయాన్ని ఏ దొంగలనయితే పట్టిద్దమనుకున్నాడో, ఆ దొంగలే సరిచేసిన విధానమే ఈ కథ. ఊరి పెత్తందార్ల దుర్భుద్ధి వారు చేయతలపెట్టిన అన్యాయపు పనులు అమరయ్యపాత్ర ద్వార తెలియచేసారు. చివరకు రంగడు దొంగలు తనకు తెచ్చిచ్చిన పాడి ఆవుతో ఆరూళ్ళ ఆవతలకి పారిపోవటంతో కథ ముగుస్తుంది.దొంగయినవాడిలో తమ వల్ల అన్యామయిన వాడికి ఉపకారం చెయ్యాలన్న బుద్ధి, ఆ దొంగలను పంపకం చేసింది అమరయ్యే అని తెలియక దొంగల సమాచారం ఇచ్చి అతనికి ఉపకారం చేస్తున్నాననుకున్న రంగడికి అపకారం తలపెట్టే అమరయ్య, పాత్రల మధ్య వైరుధ్యం చక్కగా మలచారు రచయిత.

52.కానుక[మార్చు]

  • ముఖ్య పాత్రలు-బుద్ధుడు, తండ్రి శుద్ధొదనుడు
  • బాపు బొమ్మ-బుద్దుడి కాళ్ళకు మొక్కుతున్న అతని భార్య యశోధర, పక్కన తండ్రి శుద్ధొదనుడు, కుమారుడు రాహులుడు
  • కథ-ఇది బుద్ధుడికి సంబంధించిన కథ. బుద్ధుడు తాను సన్యసించిన తరువాత తన తండ్రి రాజ్యానికి తిరిగి వెళ్ళినప్పుటి సంఘటనలకు కథారూపం. బుద్ధుడికి అతని తండ్రి కానుకగా అతని కొడుకు రాహులిణ్ణి ఇవ్వటంతో కథ ముగుస్తుంది.

53.తల్లి కడుపు చల్లగా[మార్చు]

  • ముఖ్య పాత్రలు-పదేళ్ళ రంగడు, వాడి తల్లి
  • బాపు బొమ్మ-తల్లి వడిలో ముద్దులు పోతున్న రంగడు, తల్లి ముఖంలో రంగడిమీద ఆప్యాయాన్ని రంగరించి పోశారు బాపు. రంగడు నిక్కరు ధరించి లేడు, ఇరవయ్యో శతాబ్దపు మొదటి రోజులలో బాలురు ధరించే వస్త్ర శైలిలో చిత్రించి కథా సమయాన్ని సూచించారు.
  • కథ-ఒక పక్క శీతాకాలపు రోజులు, దేవుడి ఊరేగింపు వర్ణిస్తూనే, తల్లీ బిడ్డల మధ్య ఉండే అనుబంధం, అప్యాయతలను చక్కగా పొందుపరచారు కథలో. అంత చలిలోనూ కృష్ణలో స్నానం చేస్తూ ఉంటే తల్లి వళ్ళో ఉన్నట్టు రంగడు భావిస్తాడు. ఎవరేమిచ్చినా, తనకొకటి తీసుకుని, "మా అమ్మకో" అని అడిగి మరీ తీసుకొచ్చే రంగడు, దేవుడి ప్రసాదం ఇద్దరికి తెస్తూ, మధ్యలో గుడి పైకి వెళ్ళలేని ముసలమ్మకు తన వంతు ఇచ్చేసి రావటం, రంగడు తెచ్చిన ప్రసాదాన్ని మొత్తం తల్లి వాడికే పెట్టి, 'ప్రసాదం రుచి అంతా కరెవేపాకులో ఉంటుందమ్మా' అని రంగడు నోటికందిచ్చిన కరెవేపాకు తిని అనందించి రంగణ్ణి వళ్ళోకి తీసుకంటే, రంగడికి కృష్ణమ్మ కడుపులో స్నామాడినట్లనిపించింది అని ముగించి, కృష్ణమ్మకు, అమ్మకు ఉన్న సారూప్యాన్ని చక్కగా వివరించారు రచయిత.

54.విరిగిన పల్లకీ[మార్చు]

55.నా వెనక ఎవరో...[మార్చు]

56.సిరి - శాంతి[మార్చు]

57.గుండే శివుడి కిచ్చుకో[మార్చు]

58.సంగమం[మార్చు]

59.అంతా సామిదే? నేనెవర్ని ఇవ్వడానికి?[మార్చు]

60.మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ[మార్చు]

61.అంపకం[మార్చు]

62.నిండుకుండ బొమ్మ[మార్చు]

63.గాయత్రి[మార్చు]

64.మౌన శంఖం[మార్చు]

65.అదుకో - అల్లదుగో...[మార్చు]

66.అప్పడాల అసెంబ్లీ[మార్చు]

67.మట్టి..ఒఠిమట్టి[మార్చు]

68.వేలం సరుకు[మార్చు]

69.నిలబడగలవఅ?[మార్చు]

70.సాక్షాత్కారం[మార్చు]

71.ఎవర్కీ చెప్పమాక![మార్చు]

72.జ్ఞానక్షేత్రం[మార్చు]

73.ఏక కథాపితామహ[మార్చు]

74.తృప్తి[మార్చు]

75. ఆగని ఉయ్యాల[మార్చు]