Jump to content

అమర్ హనీఫ్

వికీపీడియా నుండి
అమీర్ హనీఫ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీOctober 4, 1967 (1967-10-04) (age 57)
లాహోర్, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు - 5
చేసిన పరుగులు - 89
బ్యాటింగు సగటు - 44.50
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు - 36*
వేసిన బంతులు - 130
వికెట్లు - 4
బౌలింగు సగటు - 30.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు -/- 3/36
క్యాచ్‌లు/స్టంపింగులు -/- -/-
మూలం: [1], 2006 మే 3

అమీర్ హనీఫ్, పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1993 - 1995 మధ్యకాలంలో ఐదు వన్డేలు ఆడాడు.[1]

జననం

[మార్చు]

అమీర్ హనీఫ్ 1967, అక్టోబరు 4న పాకిస్తాన్, పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

తను ఆడిన మొదటి మ్యాచ్ కి, మరో నాలుగు మ్యాచ్‌ల మధ్య రెండేళ్ళ విరామం ఉన్నప్పటికీ శ్రీలంకపై ఈ ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. 1993లో తన అంతర్జాతీయ అరంగేట్రంలో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అసంక గురుసిన్హా ఎల్‌బిడబ్ల్యుగా ఔట్ చేయడం, బ్యాటింగ్ లో అజేయంగా 17 పరుగులు చేయడం ద్వారా జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.[3] రెండేళ్ళ తర్వాత మళ్ళీ శ్రీలంక పర్యటనకు వెళ్ళేవరకు ఇతనికి అవకాశం రాలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని మూడవ మ్యాచ్‌లో కాకుండా నాలుగవ వన్డే మ్యాచ్‌లో ఆడాడు, అందులో తన అత్యధిక స్కోరు 36 నాటౌట్ గా నిలిచి, శ్రీలంక నాలుగు వికెట్ల ఓటమిలో మూడు వికెట్లు తీసుకున్నాడు.[4]

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 161 మ్యాచ్ లలో 254 ఇన్నింగ్స్ లలో 8,120 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 225 కాగా, 15 సెంచరీలు, 37 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 8148 బంతులలో 3850 పరుగులు ఇచ్చి, 117 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 7/71 కాగా, 7సార్లు 5 వికెట్లను తీశాడు.

లిస్టు ఎ క్రికెట్ లో 159 మ్యాచ్ లలో 142 ఇన్నింగ్స్ లలో 4206 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 108 కాగా, 3 సెంచరీలు, 25 అర్థ సెంచరీలు చేశాడు. బౌలింగ్ లో 2774 బంతులలో 2171 పరుగులు ఇచ్చి, 61 వికెట్లు తీశాడు. అత్యుత్తమ వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ 4/36 కాగా, 1సారి 4 వికెట్లు తీశాడు.

పదవి విరమణ

[మార్చు]

2005లో వృత్తిపరమైన క్రికెట్ నుండి కేవలం ఐదు వన్డే అంతర్జాతీయ తరువాత రిటైర్ అయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Aamer Hanif Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  2. "Aamer Hanif Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. "SL vs PAK, Pepsi Champions Trophy 1993/94, 5th Match at Sharjah, November 02, 1993 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  4. "PAK vs SL, Singer Champions Trophy 1995/96, 6th Match at Sharjah, October 17, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.

బయటి లింకులు

[మార్చు]