అమీన్ సాహెబ్ పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"అమీన్ సాహెబ్ పాలెం" గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలానికి చెందిన గ్రామం. [1]

ఈ గ్రామాన్ని వ్యవహారికంలో "అవిశాయపాలెం" అని పిలుస్తారు. ఈ గ్రామం, హైదరాబాదు-చీరాల రాష్ట్రీయ రహదారి ప్రక్కనే ఉన్నది.

గ్రామంలోని విద్యాసౌకర్యలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న, ఒక నిరుపేద కుటంబానికి చెందిన కందుల అశోక్ అను విద్యార్థి, తనకున్న పరిఙానంతో, కర్షకుల సాగునీటి కష్టాలు తీర్చేటందుకు, "స్వయంచాలక నీటిపారుదల వ్యవస్థ" నమూనా తయారుచేసినాడు. జిల్లా వైఙానిక ప్రదర్శన్లో దీనిని ప్రదర్శించి పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందినాడు. [2]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యo[మార్చు]

ఈ గ్రామంలో విరిగిన ఎముకలకు ప్రకృతి వైద్యం చేయడం ఒక ప్రత్యేకం. [1]

గ్రామ విశేషాలు[మార్చు]

రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన కోటప్పకొండ తిరునాళ్ళకు ఇక్కడినుండి ఒక ప్రభ తరలివెళ్ళటం ఈ వూరి ఆచారం. 55 సంవత్సరాలుగా ఈ ప్రభను తయారుచేసి పంపించుచున్నారు. ఇది తమ గ్రామానికి వారసత్వంగా వచ్చుచున్నదని గ్రామస్తుల కథనం. తొంభై అడుగుల ఎత్తులో నిర్మించే ఈ ప్రభ నిర్మించిడానికి ఒక నెలరోజులు పడుతుంది. 1961 నుండి ఈ ప్రభకు విద్యుద్దీపాలు అమర్చుచున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రభ నిర్మించడానికి సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని, గ్రామంలో ఉండే 190 కుటుంబాలవారే చందాల రూపంలో భరిస్తారు. గ్రామంతో అనుబంధం ఉండే వ్యక్తులు, వ్యాపారులు గూడా ఆర్ధికంగా కొంతవరకూ సహకరిస్తారు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.