Jump to content

అమీర్ సోహైల్

వికీపీడియా నుండి
అమీర్ సోహైల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ అమీర్ సోహైల్ అలీ
పుట్టిన తేదీ (1966-09-14) 1966 సెప్టెంబరు 14 (వయసు 58)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు5 అ. 9 అం. (175 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రఓపెనింగ్ బ్యాట్స్‌మెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 122)1992 4 June - England తో
చివరి టెస్టు2000 5 March - Sri Lanka తో
తొలి వన్‌డే (క్యాప్ 80)1990 21 December - Sri Lanka తో
చివరి వన్‌డే2000 19 February - Sri Lanka తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1983–1999Lahore
1987–1992Habib Bank Limited
1995–2001Allied Bank Limited
1998–1999Karachi
2000–2001Lahore
2001Somerset
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 47 156 195 261
చేసిన పరుగులు 2,823 4,780 12,213 7,852
బ్యాటింగు సగటు 35.28 31.86 38.89 31.91
100లు/50లు 5/13 5/31 29/50 9/50
అత్యుత్తమ స్కోరు 205 134 205 134
వేసిన బంతులు 2,383 4,836 12,063 7,840
వికెట్లు 25 85 157 179
బౌలింగు సగటు 41.96 43.56 38.10 33.34
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 4/54 4/22 7/53 4/11
క్యాచ్‌లు/స్టంపింగులు 36/– 49/– 153/– 92/–
మూలం: CricketArchive, 2010 30 March

మహ్మద్ అమీర్ సోహైల్ అలీ (జననం 1966, సెప్టెంబరు 14) పాకిస్తాన్ క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్.[2] పదేళ్ల పాటు సాగిన క్రీడా జీవితంలో, సోహైల్ 195 ఫస్ట్-క్లాస్, 261 లిస్ట్ ఎ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో 47 టెస్ట్ మ్యాచ్‌లు, 156 వన్డే ఇంటర్నేషనల్స్ పాకిస్థాన్ తరపున ఉన్నాయి.

ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా, వన్డేలలో 156 మ్యాచ్‌లలో 14 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

సోహైల్ 1983లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ గా రాణించాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

సోహైల్ మొదటిసారిగా 1990లో శ్రీలంకతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడు.

కెప్టెన్సీ

[మార్చు]

సోహైల్ 1998లో పాకిస్థాన్‌కు ఆరు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన మొదటి పాకిస్తానీ కెప్టెన్ గా నిలిచాడు.[3] 1996 నుండి 1998 వరకు 22 వన్డే ఇంటర్నేషనల్‌లలో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా చేశాడు. తొమ్మిది విజయాలు, బ్యాట్‌తో సగటు 41.5 సాధించాడు. షార్జాలో వెస్టిండీస్‌పై పాకిస్థాన్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.[4]

క్రికెట్ పరిపాలన

[మార్చు]

2001లో క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, సోహైల్ జాతీయ జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా నియమించబడ్డాడు. 2004 జనవరిలో పదవీకాలం ముగిసింది. అతని స్థానంలో మాజీ జాతీయ జట్టు వికెట్ కీపర్ వసీం బారీ వచ్చాడు. క్రికెట్ బ్రాడ్‌కాస్టర్‌గా పని చేస్తూనే ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 4న, మళ్ళీ రెండోసారి జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Aamer Sohail's profile on CREX".
  2. "Pakistan appoint Aamer Sohail as national chief selector - Cricket News". Archived from the original on 1 July 2015. Retrieved 2023-09-14.
  3. Pakistan in South Africa, 1997/98, 2nd Test scorecard
  4. ODI statistics for Aamer Sohail at CricketOnly
  5. Farooq, Umar. "Aamer Sohail named Pakistan's chief selector". ESPNcricinfo. ESPN. Retrieved 2023-09-14.

బాహ్య లింకులు

[మార్చు]