Jump to content

అమెరికా కలబంద

వికీపీడియా నుండి

అమెరికా కలబంద
Scientific classification Edit this classification
Kingdom: Plantae
Clade: Tracheophytes
Clade: పుష్పించే మొక్కలు
Clade: ఏకదళబీజాలు
Order: Asparagales
Family: Asparagaceae
Subfamily: Agavoideae
Genus: Agave
Species:
A. americana
Binomial name
Agave americana
Agave americana in bloom in Portugal. The flower stalk may reach up to 8 meters (28 feet) in height.

'అమెరికా కలబంద' వృక్ష శాస్త్రీయ నామం Agave americana. ఆంగ్లంలో సాధారణంగా సెంచరీ ప్లాంట్ (శతాబ్దపు మొక్క) అంటారు. అయితే ఇది కలబంద రకాలలో విభిన్న కుటుంబానికి చెందినది. ఈ కలబంద వాస్తవానికి మెక్సికో నుండి వచ్చింది, కాని ఒక అలంకార మొక్కగా ప్రపంచవ్యాప్తంగా పెంచబడుతుంది. ఐరోపా, దక్షిణ ఆఫ్రికా, భారతదేశం,, ఆస్ట్రేలియా అటవీ ప్రాంతాలలో, అనేక ప్రాంతాలలో సహజసిద్ధంగా ఈ మొక్క పెరుగుతుంది.

వర్ణన

[మార్చు]

మొక్క శతాబ్దపు మొక్కగా పేరుగాంచినా సాధారణంగా 10 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. ఇది రోసెట్టే (మొక్క మొదలు నుంచి ఆకులు చుట్టూ దాదాపు సమానంగా) మాదిరిగా విస్తరిస్తుంది. 2 మీటర్ల (6.6 అడుగులు) పొడవైన లేత పచ్చని ఆకులతో 4 మీటర్లు (13 అడుగులు) ఈ మొక్క విస్తరిస్తుంది. వీటి ఆకుల అంచులు రంపపు పళ్ళ వలె ఉంటాయి,, కొన వద్ద సూదిగా గట్టిగా గుచ్చుకొనేట్టుగా ఉంటుంది. ఇవి పుష్పాలను పుష్పించు సమయంలో పొడవుగా 8 మీటర్ల (26 అడుగులు) పైన స్పైక్ వలె పెరిగి పెద్ద పెద్ద పసుపు పువ్వులున్న పెద్ద పుష్పగుచ్ఛము వలె ఉంటుంది. దీని సాధారణ పేరు శతాబ్దపు మొక్కగా ఉండేందుకు మటుకు ఈ మొక్క స్వభావ సిద్ధంగా ఒక ప్రత్యేకను కలిగి ఉంది, ఈ మొక్క తన సుదీర్ఘ జీవితంలో ముగింపు దశలో ఒక్కసారి మాత్రమే పుష్పిస్తుంది. ఈ మొక్క పుష్పించి మరణించిన తరువాత దీని ఆధారం నుంచి పిలకలు ఉత్పత్తి అయ్యి వాటి పెరుగుదలను కొనసాగిస్తాయి.

భూచక్రగడ్డ

[మార్చు]
భైరవకోనలో అమ్ముతున్న భూచక్రగడ్డ
భైరవకోనలో పలుచని పొరలుగా కోసి అమ్ముతున్న భూచక్రగడ్డను కొంటున్న యువకులు

తిరునాళ్ళ సమయంలో లేదా ఉత్స‌వాల స‌మ‌యంలో చెంచులు అమెరికా కలబంద మొదలు నుంచి భూచక్రగడ్డ అనే ఈ గడ్డను తీసి అమ్ముతుంటారు. భూచ‌క్ర‌గ‌డ్డ సేక‌రణ చుట్టూ అనేక న‌మ్మ‌కాలు, ఆచారాలు ముడిపెట్టుకునివున్నాయి. భూచ‌క్ర‌గ‌డ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. కాబ‌ట్టి దీనిని ల‌క్ష్మిగ‌డ్డ అని, ల‌చ్చిగ‌డ్డ అని కూడా పిలుస్తుంటారు. చెంచు తండాల్లో దీన్ని ల‌చ్చిగ‌డ్డ అని మాత్ర‌మే పిలుస్తారు. న‌ర‌సింహ‌స్వామిని ఆరాధించే చెంచులు భూచ‌క్ర‌గ‌డ్డ‌ను న‌ర‌సింహ‌స్వామి ప్ర‌సాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్స‌వాల స‌మ‌యంలో అమ్మేట‌ప్పుడు దీనిని గ‌డ్డ‌ప్ర‌సాద‌మ‌ని చెప్తుంటారు. ఒక గ‌డ్డను అమ్ముకుంటే వేల రూపాయల ఆదాయం లభిస్తుంది కాబట్టి దీనిని రహస్యంగా అమెరికా కలబంద మొదలు నుంచి సేకరించి అమ్ముతుంటారు. ఏవరైనా ఈ భూచక్రగడ్డ ఏ మొక్క నుంచి లభిస్తుంది అని అడిగినా, అమ్మేవారు ఇది శ్రీశైలం అడవులలో చాలా అరుదుగా లభిస్తుందని రకరకాలుగా చెబుతుంటారు. భూచక్రగడ్డ చర్చ పేజీలో మొదటిసారిగా 2013లో "కొందరు పెద్ద కలబంద చెట్టు మొదలును భూచక్రగడ్డలాగా జువ్వి దానికి చుట్టూరు ఎర్రమట్టి పూచి దానిని భూచక్రగడ్డ అని అమ్ముతారని ఒక అభిప్రాయం ఉంది" అని తెలుగు వికీపీడియాలో తెలియజేయడంతో ఇది ఏవిధంగా లభిస్తుందనేది వెలుగులోకి వచ్చింది.

ఉపయోగాలు

[మార్చు]
Tools used to obtain agave's ixtle fibers, at the Museo de Arte Popular, Mexico City D.F.
  • ఈ మొక్కల ఆకుల నుంచి తీసిన నారను మంచాలకు నులకగా ఉపయోగించేవారు, ఈ నారతో పేడిన తాడులు గట్టిగా ఉండుట వలన పూర్వం కపిలి మోకులకు,, చేంతాడులకు ఉపయోగించారు. ఇంకా మ్యాట్ ల, ముతక వస్త్రాల తయారీలో తోలు యొక్క అల్లిక కోసం ఉపయోగించారు.
  • పుష్పం కాడను పుష్పించకుండా కట్ చేస్తే, aguamiel అనే తీపి ద్రవం ("తేనె నీరు") మొక్క యొక్క హార్ట్ లో గుమికూడుతుంది. ఇది పులియబెట్టి pulque అనే పానీయాన్ని ఉత్పత్తి చేస్తారు.

పూర్వ కొలంబియన్ మెక్సికో ఆర్థిక వ్యవస్థకు Pulque, maguey ఫైబర్ రెండూ ముఖ్యమైనవిగా ఉన్నాయి.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Agave americana L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2005-05-23. Archived from the original on 2009-08-05. Retrieved 2010-01-12.