అమ్మిన శ్రీనివాస రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమ్మిన శ్రీనివాస రాజు తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను 1971 ఏప్రిల్ 21న తెలంగాణ రాష్ట్రంలోని పూర్వ ఖమ్మం జిల్లా(ములుగు: జిల్లా) లోని వాజేడు మండలానికి చెందిన లక్ష్మీపురంలో నూకరాజు, పళ్ళాలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కుటుంబ నేపథ్యంలో ఎక్కడా సాహితీవారసత్వం లేకపోయినా అయన సాహితీసేవను కొనసాహిస్తున్నారు. అయన వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకునిగా పనిచేస్తున్నారు. ఆయన డిగ్రీ చదువుతున్న కాలంలో రచయిత డి.బి.చారి చేసిన సూచనలు, ప్రోత్సాహం ఆయనలోని రచనా తృష్ణను తట్టిలేపాయి. అలా సాహిత్య పథంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన రచనలు చేయడమే కాకుండా తన శిష్యులలో రచనాశక్తిపై ఆసక్తి కలిగించడం కోసం తపన పడుతుంటారు. ఆయన నిత్యం మహనీయుల జయంతులు, వర్థంతుల సభలు నిర్వహించి ప్రముఖ సాహితీకారులను విద్యార్థులకు పరిచయం చేస్తున్నాడు. ఆయన యిప్పటి వరకు 7 పుస్తకాలు రచించారు. ఆయన రచనల్లో సరళత చదివించేటట్లు నిండుగా అగుపిస్తాయి.[2]

పుస్తకాలు

[మార్చు]

రసగుల్లాలు, పూతరేకులు, గ్రీష్మంలో వసంతం, అక్షర దక్షిణ, చంద్రవంకలు, న్యాయపతి రాఘవరావు కథలు. 2009 -10 విద్యా సంవత్సరం నుండి మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యాంశం (సరళభారతి) 7 వ తరగతిలో 'అడవిలో అందాల పోటి' అనే బాలల కథకు స్థానం పొందింది. 'ఇసుర్రాయి' బాలల కథకు కేంద్రసాహిత్య అకాడమి సంపుటిలో స్థానం సాధించింది. ఇవి కాకుండా ఆకాశవాణి ద్వారా అనేక ప్రసంగాలు చేశారు. వివిధ పత్రికలలో 300 కు పైగా వ్యాసాలు, 100కు పైగా కథలు ప్రచురితమయ్యాయి.

పిల్లలకు తీపి తినుబండారాలంటే ఎంత ఇష్టమో, కథలన్నా అంతే ఇష్టం. అందుకేనేమో ఆయన పిల్లల కథా సంపుటాలన్నిటికి వరుసగా తియ్యని తినుబండారాల పేర్లు పెట్టారి. గతంలో రసగుల్లలు (2002), పూతరేకులు (2006) కథా సంపుటాలు వెలువరించి అందరి మన్ననలు పొందారు. తరువాత 'చంద్రవంకలు'(2014) పేరుతో మూడో 'పిల్లల కథల సంపుటి' వ్రాసారు. ఆయన మొత్తం 26 కథలున్న ఈ 'చంద్రవంకలు' సంపుటిలోని ప్రతీ కథ ఒక ఆణిముత్యమే. 'ప్రతిభను' గమనించి ప్రోత్సహించడం వల్ల వచ్చే ఉపయోగం మొదలు ఆంగ్ల భాషా బోధనలో విద్యార్థులెదుర్కొంటున్న అగచాట్ల గురించి హృద్యంగా చెబుతూ, సాధించిన ఒక కార్యం వెనుక కనిపించని కార్యశూరులుంటారని చెప్పే 'ఇసుర్రాయి' కథ.. ఇలా ఏ ఒక్క విషయాన్నీ వదలకుండా పిల్లలకు ఏ విషయాలు అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకే అందించాడాయన. పిల్లలను ప్రభావితం చేసే సమకాలీన జంతుజాలపు ముక్తిదాయకమైన అంశాలతో తాను చెప్పదలుచుకున్న కథాంశాన్ని పొందుపర్చి అందంగా, అర్థవంతంగా చెప్పడంలో 'అమ్మిన' ప్రయత్నం సఫలమైంది. ఎంచక్కని ఎత్తుగడలతో ఎక్కడా నీతిబోధించినట్లుగా కాకుండా ఆశ్చర్యం కలిగించే ముగింపుతో పాఠకులను అలరించిన ఈ కథలు దేనికదే ఒక ప్రత్యేకతను చాటుకున్నాయి. పిల్లల మెదళ్లకు చైతన్యం కలిగించడంతో పాటు పెద్దల మనసులను ఆలోచింపజేసేవిగా ఉన్న ఈ కథలు చదవడం వల్ల కేవలం మానసిక ఆనందం, ఆలోచనా చైతన్యం కలగడమేకాదు చిన్న పిల్లలకు కథలు ఎలా రాయాలో కూడా అర్థమవుతుంది, జలగం వెంగళరావు జీవిత చరిత్ర (2015)

పురస్కారాలు

[మార్చు]
  • 2005 - విశ్వసాహితి హైదరాబాదు వారి పోతుకూచి వంశ పురస్కారం (25-12-2005)
  • 2006 - యువకథా రచయిత అధ్యాపక సన్మానం లైన్స్‌క్లబ్‌ భద్రాచలం వారిచే (05-09-2006)
  • 2007 - ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్‌ చర్ల వారిచే సన్మానం (10-09-2007)
  • 2009 - అద్దంకి జానపద కళాపీటం శ్రీశ్రీ పురస్కారం (01-06-2009)
  • 2010 - స్ఫూర్తి ఫౌండేషన్‌ చర్ల వారిచే ఆత్మీయ పురస్కారం (05-09-2010)
  • 2011 - ఖమ్మం జిల్లా సాంసృతిక శాఖ ఉగాది పురస్కారం (04-04-2011)
  • తెలుగు రక్షణ వేదిక హైదరాబాద్‌ వారి తెలుగు భాషా దినోత్సవ శతకవి పురస్కారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు చేతుల మీదుగా అందుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "డా: అమ్మిన శ్రీనివాస రాజు – మయూఖ" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-07-26. Retrieved 2022-05-30.
  2. మన్యంలో సాహితీకిరణం 'అమ్మిన'- - జవ్వాది మురళీకృష్ణ,[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]