అయనెస్కో యూజీన్
స్వరూపం
అయనెస్కో యూజీన్ | |
---|---|
అయనెస్కో యూజీన్ | |
జననం | స్లాటేనా, రుమేనియా | 1909 నవంబరు 26
మరణం | 1994 మార్చి 28 | (వయసు 84)
జాతీయత | ఫ్రెంచి |
వృత్తి | నాటక రచయిత |
అయనెస్కో యూజీన్ (నవంబరు 26, 1909 - మార్చి 28, 1994) ప్రముఖ ఫ్రెంచి నాటక రచయిత.[1] అనిబద్ధ నాటక శైలీలో (అబ్సర్డ్ థియేటర్) నాటక రచనలు చేశాడు.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]అయనెస్కో రుమేనియాలోని స్లాటేనాలో 1909, నవంబరు 26న జన్మించాడు. బుఖారెస్ట్ విశ్వవిద్యాలయంలో ఫ్రెంచ్ లో పట్టభద్రుడై 1939లో పారీస్ లో డాక్టరేట్ డిగ్రీ పొందాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]చిన్నతనం నుండే నాటకంపై ఆసక్తివున్న అయనెస్కో నాటక రచయితగా మారాడు. ఈ ప్రపంచంలో అర్థవంతంగాలేని మానవుని జీవన గతిని యథాతథంగా ఎలాంటి ముసుగులు లేకుండా చిత్రించే నాటకమే అనిబద్ధ నాటకం.[2] ఈయన ది చైర్స్, అమేడీ, ది విక్టిమ్ ఆప్ ది డ్యూటీ, ది పిక్చర్ వంటి నాటకాలను అనిబద్ధ ధోరణిలో రాశాడు.
రచించిన నాటకాలు
[మార్చు]- బాల్డ్ ప్రైమాడొన్నా (1950)
- ది లెసన్ (1951)
- ది మోటార్ షో (1951)
- ది చైర్స్ (1952)
- ది లీడర్ (1953)
- ది విక్టిమ్ ఆ ది డ్యూటీ (1953)
- మేయిడ్ టు మ్యారీ (1953)
- అమేడీ, ఆర్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ (1954)
- జాక్, ఆర్ ది సబ్మిషన్ (1955)
- ది న్యూ టెనంట్ (1955)
- ది పిక్చర్ (1955)
- ఇంప్రూవైజేషన్ (1956)
- ది ఫూట్ ఆఫ్ ది వాల్ (1956)
- ది ఫ్యూచర్ ఈజ్ ఇన్ ఎగ్స్, ఆర్ ఇట్ టేక్స్ ఆల్ సోర్ట్స్ టు మేక్ ఏ వరల్డ్ (1957)
- ది కిల్లర్ (1958)
- ఫోర్ సమ్స్ (1959)
- రైనోసిరస్ (1959)
- ఎక్జిట్ ది కింగ్ (1962)
- లెర్నింగ్ టు వాక్ (1960)
- ఫ్రెంజీ ఫర్ టూ, ఆర్ మోర్ (1962)
- ఎగ్జిట్ ది కింగ్ (1962)
- స్త్రోల్ ఇన్ ది ఎయిర్ (1962)
- హంగర్ అండ్ థర్స్ట్ (1964)
- ది హార్డ్ బాయిల్డ్ ఎగ్ (1966)
- ది ఓవర్సైట్ (1966)
- ది మైర్ (1966)
- ది కిల్లింగ్ గేమ్ అకా హియర్ కమ్స్ ఏ ఛాపర్ (1970)
- ది డ్యూయల్ (1971)
- డబుల్ యాక్ట్ (1971)
- మక్బెత్ (1972)
- ఓహ్, వాట్ ఏ బ్లడ్ సర్కస్ అకా ఎ హెల్ ఆఫ్ ఎ మెస్ (1973)
- మ్యాన్ విత్ బ్యాగ్స్ (1977)
- జర్నీస్ అమాంగ్ ది డెడ్ (1980)
- ది విస్కౌంట్ (అసంపూర్ణం)
మరణం
[మార్చు]అయనెస్కో ఫ్రాన్స్ లోని పారిస్ లో 1994, మార్చి 28న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.195.
- ↑ తెలుగు నాటకరంగం నూతన ధోరణులు - ప్రయోగాలు, (పుట. 460), రచన. డా. కందిమళ్ళ సాంబశివరావు