అరన్ముల పొన్నమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరన్ముల పొన్నమ్మ
జననం(1914-04-08)1914 ఏప్రిల్ 8
అరన్ముల పొన్నమ్మ, కేరళ
మరణం2011 ఫిబ్రవరి 21(2011-02-21) (వయసు 96)
వృత్తినాటకరంగ, టీవి, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1943–2004
జీవిత భాగస్వామికొచు కృష్ణ పిళ్లై
పిల్లలురాజమ్మ
రాజశేఖరన్
తల్లిదండ్రులుమాలేతు కేశవ పిళ్లై
పారుకుట్టి అమ్మ
బంధువులు
పురస్కారాలు2006 - జేసి డేనియల్ అవార్డు

అరన్ముల పొన్నమ్మ (1914, ఏప్రిల్ 82011, ఫిబ్రవరి 21) కేరళ రాష్ట్రానికి చెందిన నాటకరంగ, టీవి, సినిమా నటి. ఐదు దశాబ్దాల కెరీర్‌లో అనేక సినిమాలలో కథానాయికకు తల్లిగా పాత్రలు పోషించింది. మలయాళ సినిమారంగంలో మాతృమూర్తిగా విస్తృతంగా వర్ణించబడింది.[1][2] 2005లో, మలయాళ సినిమాకు చేసిన సేవలకుగాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును, కేరళ ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన జెసి డేనియల్ అవార్డును కూడా అందుకుంది.

జీవిత విశేషాలు[మార్చు]

పొన్నమ్మ 1914, ఏప్రిల్ 8న మాలేతు కేశవ పిళ్లై, పారుకుట్టి అమ్మల ఐదుగురు సంతానంగా ట్రావెన్‌కోర్‌లోని పతనంతిట్టలోని అరన్ములలో జన్మించింది.[3] రామకృష్ణ పిళ్లై, పంకియమ్మ, భాస్కర పిళ్లై, థంకమ్మ అనే నలుగురు తోబుట్టువులు ఉన్నారు.[4] 12 సంవత్సరాల వయస్సులో కర్ణాటక సంగీత గాయకురాలిగా తన వృత్తిని ప్రారంభించింది. పంపా నది ఒడ్డున హిందూ మహామండల్ ఏర్పాటుచేసిన సమావేశాలకు ముందు ఆమె పాడింది. 15 సంవత్సరాల వయస్సులో పాలాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. తరువాత స్వాతి తిరునాల్ మ్యూజిక్ అకాడమీలో మొదటి బ్యాచ్ విద్యార్థులతో చేరింది. కోర్సు తర్వాత, త్రివేండ్రంలోని కాటన్ హిల్ బాలికల ఉన్నత పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలిగా నియమితులయింది.[5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

కొచు కృష్ణ పిళ్లైతో పొన్నమ్మ వివాహం జరిగింది. ఈ దంపతులకు రాజశేఖరన్ అనే కుమారుడు, రాజమ్మ అనే కుమార్తె ఉన్నారు. ఆమె మనవరాలు రాధికా సురేష్‌కి సురేష్ గోపితో వివాహమైంది.[6]

అవార్డులు[మార్చు]

జాతీయ చలనచిత్ర అవార్డులు[మార్చు]

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు[మార్చు]

ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్[మార్చు]

  • 1998: జీవితకాల సాఫల్య పురస్కారం

టెలివిజన్[మార్చు]

  • ఆకాశదూతు (సూర్య టీవీ) - 2011
  • కడమత్తత్తు కథనార్ (ఆసియానెట్) - 2004
  • చువప్పు నాడ
  • అక్షయపాత్రం
  • మాంగల్యసూత్రం

నాటకాలు[మార్చు]

  • భాగ్యలక్ష్మి
  • రక్తబంధం
  • చెచి
  • జీవితయాత్ర
  • ప్రసన్న
  • రాండు జన్మం

మరణం[మార్చు]

పొన్నమ్మ 96 సంవత్సరాల వయస్సులో 2011, ఫిబ్రవరి 21న తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.[8][9][10]

మూలాలు[మార్చు]

  1. "Notice of Aranmula Ponnamma's death". Archived from the original on 20 February 2009. Retrieved 2023-05-16.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  2. "Matriarch of Mollywood". The Hindu. 12 January 2007.
  3. "Manorama Online |". Archived from the original on 3 December 2013. Retrieved 2023-05-16.
  4. "CINIDIARY - A Complete Online Malayalam Cinema News Portal". cinidiary.com. Archived from the original on 2015-05-05. Retrieved 2023-05-16.
  5. "Aranmula Ponnamma cremated". The New Indian Express. Retrieved 2023-05-16.
  6. Correspondent), (Our. "Kerala's 'screen mother' Ponnamma dies at 96". Khaleej Times.
  7. 7.0 7.1 "Aranmula Ponnamma cremated". The New Indian Express. Retrieved 2023-05-16.
  8. "Aranmula Ponnamma dies at 96". Deccan Herald. 21 February 2011. Retrieved 2023-05-16.
  9. "Aranmula Ponnamma dies". The Indian Express. Kerala. 21 February 2011. Retrieved 2023-05-16.[permanent dead link]
  10. "Aranmula Ponnamma passes away". Kerala: SansCinema. 21 February 2011. Archived from the original on 16 July 2011. Retrieved 2023-05-16.

బయటి లింకులు[మార్చు]