అరుణా రాజే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరుణా రాజే
జననం1946
పుణె, భారతదేశం
వృత్తిదర్శకురాలు, ఎడిటర్
భార్య / భర్తవికాస్ దేశాయ్ (విడాకులు)
పురస్కారాలుఆరు జాతీయ అవార్డులు

అరుణా రాజే (జననం 1946) భారతీయ సినిమా దర్శకురాలు, ఎడిటర్. హిందీ సినిమారంగంలో పనిచేసింది.[1] తన సినిమాలకు 6 జాతీయ అవార్డులను గెలుచుకుంది.

జననం, విద్య

[మార్చు]

అరుణా రాజే 1946 అక్టోబరు 17న భారతదేశంలోని పూణేలో జన్మించింది.[1] మెడిసిన్ చదవడానికి పూణేలోని గ్రాంట్ మెడికల్ కళాశాలలో చేరింది. తర్వాత ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరింది. 1969లో ఫిలిం ఇన్‌స్టిట్యూట్ నుండి బంగారు పతకంతో ఉత్తీర్ణత సాధించి పరిశ్రమలో శిక్షణ పొందిన మొదటి మహిళా సాంకేతిక నిపుణురాలిగా నిలిచింది.[2]

సినిమారంగం

[మార్చు]

తన కెరీర్ ప్రారంభంలో అరుణా రాజే తన మాజీ భర్త వికాస్ దేశాయ్‌తో కలిసి అరుణ-వికాస్ పేరుతో కలిసి పనిచేసింది. గిద్ద్, మసూమ్ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలకు సహ-ఎడిటర్ గా పనిచేసింది. తర్వాత వీరిద్దరూ షాక్, గెహ్రయీ, సీతం వంటి చిత్రాలను రూపొందించింది. తన భర్త నుండి విడిపోయిన తర్వాత స్వతంత్ర చలనచిత్ర-దర్శకత్వం ప్రారంభించింది, కష్టతరమైన స్త్రీవాద సినిమాలు చేసింది.[3]

సుప్రసిద్ధ శాస్త్రీయ నృత్యకారిణి మల్లికా సారాభాయ్, ప్రత్యేక పిల్లలపై జాతీయ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీలు, ది న్యూ ప్యారడిగ్మ్ వంటివి రూపొందించింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

వికాస్ దేశాయ్‌తో అరుణ వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తొమ్మిదేళ్ల కూతురు క్యాన్సర్‌తో చనిపోయింది. తర్వాత దంపతులు విడాకులు తీసుకున్నారు.

సినిమాలు

[మార్చు]
  • 2009 రెడ్ అలర్ట్: ది వార్ విత్ ఇన్ (కథ)
  • 2004 తుమ్? : ఎ డేంజరస్ అబ్సెషన్ (స్క్రీన్ ప్లే, కథ)
  • 1996 భైరవి (స్క్రీన్ ప్లే)
  • 1988 రిహాయీ (స్క్రీన్ ప్లే, కథ)
  • 1982 సీతం (సహ-రచన)
  • 1980 గెహ్రయీ (స్క్రిప్ట్)(సహ-రచన)
  • 1976 షేక్ (స్క్రిప్ట్)(సహ-రచన)

దర్శకత్వం

[మార్చు]
  • 2019 ఫైర్‌బ్రాండ్
  • 2004 తుమ్? : ఎ డేంజరస్ అబ్సెషన్
  • 1996 భైరవి
  • 1993 షాదీ యా... (టీవీ సిరీస్)
  • 1992 పాటిట్ పవన్
  • 1988 రిహాయీ
  • 1982 సీతం (సహ-దర్శకత్వం)
  • 1980 గెహ్రయీ (సహ-దర్శకత్వం)
  • 1976 షేక్ (సహ-దర్శకత్వం)

ఎడిటింగ్

[మార్చు]
  • 2004 తుమ్? : ఎ డేంజరస్ అబ్సెషన్
  • 1996 భైరవి
  • 1988 రిహాయీ
  • 1984 గిద్ద్ (కో-ఎడిటింగ్)
  • 1984 మసూమ్ (కో-ఎడిటింగ్)
  • 1982 సీతమ్ (కో-ఎడిటింగ్)
  • 1980 గెహ్రయీ (కో-ఎడిటింగ్)
  • 1976 షేక్ (కో-ఎడిటింగ్)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Aruna Raje". IMDB. Retrieved 10 July 2015.
  2. "Aruna Raje". Parallel Cinema. Retrieved 10 July 2015.
  3. "Between You and Me". The Hindu. 22 March 2004. Retrieved 10 July 2015.
  4. "'Tum' isn't my life story: Aruna Raje". Sify. Archived from the original on 11 January 2005. Retrieved 10 July 2015.

బాహ్య లింకులు

[మార్చు]

[[వర్గం:భారతీయ మహిళా టెలివిజన్ దర్శకులు]]