Jump to content

అరోరా

వికీపీడియా నుండి


అరోరా బొరియాలిస్
అరోరా బొరియాలిస్

అరోరా ధృవముల వద్ద ఆకాశములో రాత్రి పూట కనపడే వెలుగు. ఉత్తర దేశములలో దీనిని అరోరా బొరియాలిస్ అంటారు. 'అరోరా' అంటే రోమన్ లో ప్రత్యూషము (ఉదయము) నకు దేవత. 'బొరియాస్' అంటే గ్రీకులో ఉత్తర పవనములు. ఐరోపాలో ఉత్తర దిశలో ఎర్రని వెలుగు వలే కనపడి, సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తున్నాడే మో అనిపిస్తుంది. ఉత్తర ధృవములో ఉత్తర దిక్కు నుండి కనపడుతుంది కనుక అరోరా బొరియాలిస్ నే ఉత్తర వెలుగులు అని కూడా అంటారు. అరోరా బొరియాలిస్ సాధారంగా సెప్టెంబరు-అక్టోబరుల మధ్య లో, మార్చ-ఏప్రిల్ మధ్యలో వస్తుంది. దక్షిణ భాగములో అరోరా ఆస్ట్రియాలిస్ కూడా అవే ధర్మాలు ఉన్నాయి. ఆస్ట్రియాలిస్ అంటే లాటిన్ లో దక్షిణము.

ఎలా పనిచేస్తుంది

[మార్చు]

అరోరాలు అయస్కాంత ఆవరణములో ఉన్న ఉత్తేజిత కణాలు (ఎలక్ట్రానులు) ఉపరితల వాతావరణము (80 కి.మీ కంటే ఎత్తైన) లో ఉన్న పరమాణువులతో తాడనము చెందడము వలన కలుగుతుంది. ఉత్తేజిత కణములు ఒక వెయ్యి నుండి 15 వేల ఎలక్ట్రాన్ వోల్టుల వరకూ శక్తిని పొంది పరమాణువులను తాడించగా పరమాణువులకు శక్తి వస్తుంది. పరమాణువులు వాటి శక్తిని కాంతి రూపములో విడుదల చేస్తాయి (ఫ్లోరొసెన్స్ను చూడండి) . అక్సిజన్ ఉండడము వలన ఆకుపచ్చ కాంతి (557.7 నానో మీటర్ల తరంగదైర్ఘ్యము వద్ద), ఎర్రటి కాంతి (630 నానో మీటర్ల తరంగదైర్ఘ్యము వద్ద) వస్తుంది. ఈ రెండు ఎలక్ట్రానుల నిషేదించబడిన పరివర్తన కనుక, కొత్త తాడనములు లేకపోయినప్పుడు ఆ కాంతి చాలా సేపు ఉంటుంది.

ఇతర గ్రహాలలో అరోరాలు

[మార్చు]
గురు గ్రహంలో అరోరా.

గురు గ్రహం, శని గ్రహం లలో కూడా భూమి కంటే బలమైన అయస్కాంతఆవరణాలు ఉండడము వలన వాటి పై కూడా అరోరాలను చూడడము జరిగింది. (హబుల్ టెలీస్కోపు సహాయము తో)

జానపదంలో అరోరా

[మార్చు]

అరోరా కనపడే అన్ని దేశాలలో (ఉత్తర ధృవముకు దగ్గరగా ఉన్న దేశములు) కొన్ని జానపద కథలు, వాటి పాత్రలు శతాబ్దాల బట్టి అరోరాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అరోరా&oldid=4351740" నుండి వెలికితీశారు