Jump to content

అలహాబాద్ ఒప్పందం

వికీపీడియా నుండి

 

అలహాబాద్ ఒప్పందం
1765 ఆగస్టు 16 నాటి అలహాబాద్ ఒప్పందం
1765 ఆగస్టు 16 నాటి అలహాబాద్ ఒప్పందం
సందర్భంబక్సర్ యుద్ధం
సంతకించిన తేదీ16 ఆగస్టు 1765 (1765-08-16)
స్థలంప్రయాగ్‌రాజ్
సంతకీయులు
కక్షిదారులు
భాషలుఇంగ్లీషు, పార్సీ
అలహాబాద్ ఒప్పందం at Wikisource

అలహాబాద్ ఒప్పందం 1765 ఆగష్టు 16 న మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం, ఈస్టిండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్‌ల మధ్య కుదిరిన సంధి ఒప్పందం.[1] 1764 అక్టోబరు 22 న జరిగిన బక్సర్ యుద్ధం తరువాత ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాన్ని బెంగాలీ ముస్లిం లేఖకుడు, మొఘల్ సామ్రాజ్యానికి దౌత్యవేత్త అయిన ఇతిసం-ఉద్-దీన్ రాశాడు.[2]

మొఘల్ చక్రవర్తి షా ఆలం రాబర్ట్ క్లైవ్‌కు అలహాబాద్ ఒప్పందాన్ని అందజేస్తున్న దృశ్యం. దీని ప్రకారం, 1765 ఆగస్టు నుండి బెంగాల్ సుబాలో పన్ను వసూలు హక్కులు ఈస్టిండియా కంపెనీకి చెందాయి.

ఈ ఒప్పందం, భారతదేశంలో బ్రిటిషు వారి రాజకీయ పరమైన, రాజ్యాంగ పరమైన ప్రమేయాన్ని గుర్తించింది.[3] ఒప్పందం లోని నిబంధనల ప్రకారం షా ఆలం, ఈస్టిండియా కంపెనీకి దివానీ హక్కులు లేదా బెంగాల్-బీహార్-ఒరిస్సా తూర్పు ప్రావిన్స్ నుండి చక్రవర్తి తరపున పన్నులు వసూలు చేసే హక్కును మంజూరు చేశాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రజల నుండి నేరుగా ఆదాయాన్ని సేకరించేందుకు కంపెనీకి హక్కులు లభించాయి. ప్రతిగా, షా ఆలం కోసం కోరా, అలహాబాద్ జిల్లాలను కాపాడుతూ కంపెనీ వార్షికంగా ఇరవై ఆరు లక్షల రూపాయల కప్పంగా చెల్లిస్తుంది. ఈ సొమ్ము అలహాబాద్‌లోని చక్రవర్తి ఆస్థాన నిర్వహణ కోసం వాడాలి. వారణాసి ప్రాంతాన్ని షా ఆలంకు తిరిగి అప్పగించాలని, కంపెనీకి కొంత మొత్తంలో ఆదాయాన్ని చెల్లించినంత కాలం ఇది కొనసాగుతుందనీ కూడా ఒప్పందంలో రాసుకున్నారు. షుజా-ఉద్-దౌలాకు అవధ్‌ను తిరిగి అప్పగించారు. కానీ అలహాబాద్, కోరా లను అతని నుండి తీసేసుకునారు. యుద్ధ నష్టపరిహారంగా అవధ్ నవాబ్ షుజా ఉద్ దౌలా, ఈస్టిండియా కంపెనీకి యాభై లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.

అంతేకాకుండా, కంపెనీ దళాల సేవలకు నిర్వహణ్ ఖర్చు చెల్లించినట్లయితే, బయటి నుండి వచ్చే దాడుల నుండి నవాబ్‌కు రక్షణ కల్పిస్తామని కంపెనీ వాగ్దానం చేస్తూ, ఇరువురూ ఒక కూటమి ఒప్పందంపై కూడా సంతకం చేశారు. ఈ ఒప్పందం, నవాబును కంపెనీపై ఆధారపడేలా చేసింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక మలుపు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఒప్పందాల జాబితా

మూలాలు

[మార్చు]
  1. Grover, B. L.; Mehta, Alka (2014). A New Look at Modern Indian History (30th ed.). S Chand Publishing. p. 364. ISBN 978-8121905329.
  2. Christian–Muslim Relations. A Bibliographical History. Volume 12 Asia, Africa and the Americas (1700–1800). 2018. pp. 544–548.
  3. Bhattacherje, S. B. (2009). Encyclopaedia of Indian Events & Dates. Sterling Publishers Pvt. Ltd. p. A-96. ISBN 978-81-207-4074-7.